ఇబ్రహీంపట్నం,ప్రజాతంత్ర,నవంబర్ 17 : రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో రోజురోజుకు రాజకీయ సమీకరణలు మారుతున్నాయి.బిఆర్ఎస్ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్ రెడ్డి,కాంగ్రెస్ అభ్యర్థి మల్రెడ్డి రంగారెడ్డి,బిజెపి అభ్యర్థి దయానంద్ గౌడ్ పోటీ చేస్తున్నారు.సిపిఎం నుండి యాదయ్య పోటీ చేస్తుండగా నియోజకవర్గంలో దశలవారీగా రాజకీయ సమీకరణాలు మారుతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.ముఖ్యంగా బిఆర్ఎస్,కాంగ్రెస్ పార్టీల మధ్యలో పోటీ ఉంటుందని అందరూ భావించిన నేపథ్యంలో నియోజకవర్గంలో ముఖ్య నాయకుడైన దండం రామ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుండి రెబల్ అభ్యర్థిగా నామినేషన్ వేసి చివరకు బిఆర్ఎస్ పార్టీలో కేటీఆర్ సమక్షంలో చేరారు.దీంతో ఆల్రెడీ రంగారెడ్డికి గడ్డుకాలం తప్పకుండ ఏర్పడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.మల్ రెడ్డి రంగారెడ్డి ఒంటెద్దు పోకడలతో తన సోదరుడైన రామ్ రెడ్డిని అన్ని విధాల పూర్తి బాధ్యతలు అప్పజెప్పడంతో పలువురు సీనియర్ కాంగ్రెస్ నాయకులు తమకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని గ్రహించి బిఆర్ఎస్ పార్టీలో చేరడం జరుగుతుందని, గతంలో 2018లో మంచి రెడ్డి కిషన్ రెడ్డి పై స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన రంగారెడ్డి 314 అతి స్వల్ప ఓట్లతో ఓటమి అయ్యారు. దీంతో మంచిరెడ్డి కిషన్ రెడ్డి బిఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలుపొందారు.ఎన్నికలవేళ తప్ప మల్రెడ్డి రంగారెడ్డి ప్రజల మధ్యలో ఉండరని వాదం స్పష్టంగా కనబడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.ఆయన ఒంటెద్దు పోగొట్టుకుని గ్రహించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సైతం బి ఆర్ ఎస్ పార్టీలో చేరుతున్నారంటే ఆయనపై వ్యక్తిగతంగా పార్టీ పరంగా ఎంత ఆవేదన కలిగి ఉన్నారు అర్థం చేసుకోవాలని పలువురు భావిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న ఆయన రేపు ఎమ్మెల్యేగా గెలిచి పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రజలను ఏ విధంగా ఆదేస్తాడని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఏది ఏమైనప్పటికీ మల్ రెడ్డి రంగారెడ్డి ఓటమికి కాంగ్రెస్ పార్టీలోనే వెన్నుపోటు పొడిపొచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని పలువురు విశ్లేషకులు అభిప్రాయం.