ఈ ‌ప్రాంత అబివృద్ధికి నిధులెందుకు ఇవ్వవు?

భూములు కబ్జా చేసే అవకాశం

లేదని గాలికొదిలేసినవా?

కేంద్ర పథకాలు కంటోన్మెంట్‌కు వర్తింపజేయకూడదని నీకేమైనా రాసిచ్చారా?

బీజేపీకి భయపడే జాతీయ సమైక్యత దినం పేరుతో కొత్త డ్రామాలు

ఒవైసీని కంట్రోల్‌ ‌చేయలేని చేతగాని దద్దమ్మ సర్కార్‌

‌ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బండి సంజయ్‌ ‌‌ఫైర్‌

‌సికిందరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 16 : ‌ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌కంటోన్మెంట్‌ ‌నియోజకవర్గం అభివృద్ధిని పూర్తిగా గాలికొదిలేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ ‌కుమార్‌ ‌ధ్వజమెత్తారు. ‘‘కంటోన్మెంట్‌ ‌ప్రజలు ఏమైనా పాకిస్తాన్‌, ‌బంగ్లాదేశ్‌ ‌వాళ్ళా? రోడ్లు, డ్రైనేజీ సమస్యలతోపాటు ఆఖరుకు మంచి నీళ్ల లేక అల్లాడుతుంటే ఎందుకు పట్టించుకోవడం లేదు?’’ అని ప్రశ్నించారు. ‘‘కేంద్రం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నా కంటోన్మెంట్‌కు వర్తింపజేయడం లేదు. ఆ సంక్షేమ పథకాలను కంటోన్మెంట్‌కు ఇవ్వకూడదని నీకేమైనా రాసిచ్చారా కేసీఆర్‌?’’అని నిలదీశారు. ఆర్మీ నుంచి కంటోన్మెంట్‌కి రావలసిన రూ.700 కోట్ల నిధులు తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటా..ముందు నువ్వు కంటోన్మెంట్‌కి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వు’’అని సవాల్‌ ‌విసిరారు. కంటోన్మెంట్తో నాకేంటి సంబంధం అంటున్న కేసీఆర్‌కి ప్రజలే బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా శుక్రవారం కంటోన్మెంట్‌ ‌నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న బండి సంజయ్‌ ‌కుమార్‌ ‌మారేడ్‌ ‌పల్లిలోని డబుల్‌ ‌బెడ్రూమ్‌ ‌హౌజింగ్‌ ‌కాలనీ వద్ద ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఈ నెల 12న నాలుగో విడత ‘‘ప్రజా సంగ్రామ యాత్ర’’ను ప్రారంభించాం. అన్ని బస్తీలు, కాలనీలు, డివిజన్లలో తిరుగుతూ…. ప్రజా సమస్యలను తెలుసుకుంటున్న. ప్రజా సమస్యలను తెలుసుకోడానికే… పాదయాత్ర చేయమని నన్ను మోదీ ఆదేశించారు. ప్రజలకు కేంద్రం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుంది…కేంద్రం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందుతున్నాయా… లేదా… అనేది తెలుసుకోవడానికి పాదయాత్ర చేస్తున్న. సంవత్సరం నుంచి కుటుంబాన్ని వదిలి, పాదయాత్ర చేస్తున్నాం. ఈ నెల 22 వరకు 4వ విడత పాదయాత్ర చేస్తా. ప్రతినెల 20 రోజులపాటు పాదయాత్ర చేస్తా..జిహెచ్‌ఎం‌సి, కంటోన్మెంట్‌లలో ఎక్కడికి వెళ్లినా ప్రజలు తమ సమస్యలు, బాధలను చెప్పుకుంటున్నారు. కంటోన్మెంట్‌ ఏరియాలో జాగాలు కబ్జా చేయడానికి లేదు కాబట్టే, కంటోన్మెంట్‌ ఏరియా కేంద్రానిది…నాది కాదు అని కేసీఆర్‌ అం‌టున్నాడు. కేసీఆర్‌ ‌దిల్లీ వెళ్లి కేంద్ర పెద్దల వద్ద వంగివంగి దండాలు పెడతాడు. మోడీ నిద్రాహారాలు మాని 18 గంటలు పనిచేస్తే…కెసిఆర్‌ 18 ‌గంటలు పడుకుంటాడు. కంటోన్మెంట్‌ అభివృద్ధిని కేసీఆర్‌ ‌పూర్తిగా వదిలేశాడు. రోడ్లు, డ్రైనేజీ సహా కనీస సౌకర్యాల్లేక జనం అల్లాడుతున్నరు. ఈ ప్రాంతానికి రోజూ 90 లక్షల గ్యాలన్ల మంచి నీళ్లు అవసరమైతే… అందులో సగం కూడా ఇవ్వడం లేదు. కంటోన్మెంట్‌ ‌వాళ్లు ఏమైనా పాకిస్తాన్‌, ‌బంగ్లాదేశ్‌ ‌వాళ్ళా కేసీఆర్‌? ఎం‌దుకు కంటోన్మెంట్‌ ‌వాళ్లకు నీళ్లు ఇవ్వడం లేదు? ..కేంద్రం ఇస్తున్న సంక్షేమ పథకాలను కంటోన్మెంట్‌కు ఇవ్వకూడదని నీకు ఏమైనా రాసి ఇచ్చారా కేసీఆర్‌?. ఆర్మీ నుంచి కంటోన్మెంట్‌కి రావలసిన డబ్బులు రప్పించే ప్రయత్నం చేస్తా. ముందు నువ్వు కంటోన్మెంట్‌కి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వు. ఇంకో 30 సంవత్సరాలు మోడీ ప్రభుత్వం పక్కా. కంటోన్మెంట్తో నాకేంటి సంబంధం అంటున్న కేసీఆర్‌కి ప్రజలే బుద్ది చెప్పాలి. కెసిఆర్‌ ‌ఝూటా మాటలు, బట్టేబాజ్‌ ‌మాటలు అన్నీ పోవాలి. జిహెచ్‌ఎం‌సిలో కెసిఆర్‌ ‌లక్ష ఇండ్లు కట్టిస్తా అన్నాడు. కెసిఆర్‌కు ఎన్ని దరఖాస్తులు వొచ్చాయి? ఇప్పటివరకు ఎన్ని ఇండ్లు కట్టించాడో సమాధానం చెప్పాలని డిమాండ్‌ ‌చేస్తున్నా…తెలంగాణకు కేంద్రం 2,40,000 ఇండ్లను మంజూరు చేసింది. కేంద్రం మంజూరు చేసిన ఇండ్లను కేసీఆర్‌ ఎం‌దుకు కట్టించడం లేదు? కేంద్రం ఇచ్చిన ఇండ్లను కేసీఆర్‌ ‌కట్టిస్తే… మరో ఐదు లక్షల ఇండ్ల వరకైనా కేంద్రం నుంచి మంజూరు చేయిస్తానని నేను ప్రకటించాను. అయినా కేసీఆర్‌ ఎం‌దుకు స్పందించడం లేదు?.. పేదలకు డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ఇం‌డ్లు కట్టించని కేసీఆర్‌… ‌తాను మాత్రం 100 రూములతో ఇల్లు కట్టుకున్నాడు. దళిత బంధు, కొత్త పెన్షన్లు కొత్త రేషన్‌ ‌కార్డులు ఏమయ్యాయి? ..దిల్లీ లిక్కర్‌ ‌స్కామ్‌లో కెసిఆర్‌ ‌కూతురు ప్రమేయం ఉందన్న వీడియో బయటపడటంతోనే….కేసీఆర్‌ అం‌బేద్కర్‌ ‌నామస్మరణ చేస్తున్నాడు. అందుకే సచివాలయానికి ‘అంబేద్కర్‌’ ‌పేరు అంటూ రాజకీయాలు చేస్తున్నాడు. దమ్ముంటే టీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్నంత వరకు ముఖ్యమంత్రి సీటులో దళితుడిని కూర్చోబెట్టాలి. కొత్త సచివాలయంలో సీఎం కుర్చీలో దళితుడినే కూర్చోబెట్టే దమ్ముందా కేసీఆర్‌. ‌ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి. జీహెచ్‌ఎం‌సీ కార్మికులు ఎన్నో సమస్యలతో బాధపడుతున్నారు. డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ఇం‌డ్లు, రేషన్‌ ‌కార్డు, పెన్షన్‌, ఉద్యోగాలు..ఇలా ఏది కావాలన్నా….కేసీఆర్‌ ‌కుటుంబానికి లంచం ఇవ్వాల్సిందే. సెప్టెంబర్‌ 17‌న పరేడ్‌ ‌గ్రౌండ్స్‌లో…కేంద్ర బలగాల పరేడ్తో అధికారికంగా ‘తెలంగాణ విమోచన దినోత్సవాన్ని’ నిర్వహిస్తున్నాం. ఉదయం ఎనిమిది గంటలకు పరేడ్‌ ‌నిర్వహిస్తున్నాం…8 సంవత్సరాల నుంచి ఎందుకు తెలంగాణ స్వాతంత్ర దినోత్సవాన్ని కేసీఆర్‌ ‌జరపడం లేదు? బిజెపి తెలంగాణ విమోచన దినోత్సవం జరుపుతుందని ప్రకటించిన తర్వాతే…బీజేపీకి భయపడి, ఇప్పుడు ‘జాతీయ సమైక్యత దినోత్సవం’ జరుపుతున్నాడు. ఓవైసీకి భయపడే జాతీయ సమైక్యత దినం అంటున్నాడు. దారుస్సలాం నిర్ణయాలను తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్‌ అమలు చేస్తున్నాడు. సొంత నిర్ణయాలను అమలు చేసే దమ్ము, ధైర్యం కేసిఆర్‌కు లేదు. నిజాం మెడలు వంచి తెలంగాణకు స్వాతంత్రం తెచ్చిన ఘనత సర్దార్‌ ‌పటేల్‌. ఉఫ్‌ అం‌టే ఊడిపోయే పార్టీ, టిఆర్‌ఎస్‌ ‌పార్టీ. వెంటిలేటర్‌పై ఉన్న పార్టీ టిఆర్‌ఎస్‌. ఎక్కడికి వెళ్లినా పైసలు దండుకుండే కేసీఆర్‌ ‌నైజం..అని ధ్వజమెత్తారు.

‘‘సమైక్యత’’ ఉత్సవాల పేరుతో కుళ్లిన ఆహార ప్యాకెట్లు…!

కమీషన్ల కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడతారా?

ఇదో డూప్‌ ‌సర్కార్‌….‌బతుకమ్మ చీరెలు సహా కేసీఆర్‌ ‌చేసేవన్నీ నాసిరకం, డూప్‌ ‌పనులే

టీఆర్‌ఎస్‌ ‌సర్కార్‌ ‌తీరుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్‌ ‌ఫైర్‌

‌తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల వేడుకల పేరుతో ప్రభుత్వ నిధులను కొల్లగొట్టేందుకు ప్రజల ప్రాణాలతో టీఆర్‌ఎస్‌ ‌నేతలు చెలగాటమాడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్‌ ‌కుమార్‌ ‌మండిపడ్డారు. కంటోన్మెంట్‌ ‌నియోజకవర్గ పరిధిలో వజ్రోత్సవాల పేరుతో కమీషన్ల కోసం కుళ్లిపోయిన భోజన ప్యాకెట్లును అందించి చిన్నారులతో సహా ప్రజల ఆరోగ్యంతో ఆటలాడటం సిగ్గు చేటన్నారు.

శుక్రవారం మధ్యాహ్న భోజన శిబిరం వద్ద తనను కలిసిన మీడియాతో మాట్లాడుతూ..స్పందిస్తూ కుళ్లిపోయిన వేలాది ఆహార ప్యాకెట్లను పిల్లలు వదిలేయడం… వాటిని చెత్త కుప్పలో పడేస్తున్న దృశ్యాలు బయటపడిన అంశాన్ని ప్రస్తావిస్తూ తీవ్రంగా స్పందించారు. ‘‘ఇదో డూప్‌ ‌ప్రభుత్వం. పైసలు దండుకోవడం కోసం అన్నీ నాసిరకం, డూప్‌ ‌పనులే చేస్తుంది. బతుకమ్మ చీరలు నాసిరకమే. నియోజకవర్గాల్లో జరిగే పనులన్నీ నాసిరకమే. మొత్తంగా ఈ ప్రభుత్వమే డూప్‌ ‌ప్రభుత్వం’’అని దుయ్యబట్టారు. కంటోన్మెంట్‌లో అభివృద్ధి చేయరు. రోడ్లు వేయరు. డ్రైనేజీ సమస్యను పరిష్కరించరు.

ఇండ్లు ఇవ్వరు..తాగడానికి మంచినీళ్లు కూడా సరఫరా చేయరు. చివరకు కమీషన్ల కోసం కుళ్లిన భోజనాన్ని పంపి ఇక్కడి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. కేసీఆర్‌ ‌తీరును చూస్తుంటే ఆయన దృష్టిలో కంటోన్మెంట్‌ ‌ప్రజలను అసలు మనుషులుగా కూడా గుర్తించడం లేన్నట్లుంది’’అని మండిపడ్డారు. ‘‘‘బీజేపీ ఈ సమస్యలన్నీ ప్రస్తావిస్తుంటే…కంటోన్మెంట్‌లో రోడ్లు, ఫ్లైఓవర్లు  వేద్దామన్నా, సచివాలయం నిర్మాణానికి కేంద్రం భూములు ఇవ్వడం లేదని కేసీఆర్‌, ‌ట్విట్టర్‌ ‌టిల్లు దుష్ప్రచారం చేస్తున్నరు. ఈ సందర్భంగా వాళ్లకు నేను సవాల్‌ ‌చేస్తున్నా..కంటోన్మెంట్‌ ‌నియోజకవర్గంలోని  బైసన్‌ ‌పోలో, పరేడ్‌ ‌గ్రౌండ్‌, ‌జింఖాన్‌ ‌గ్రౌండ్‌ ‌భూములివ్వడానికి 4 ఏళ్ల క్రితమే కేంద్రం సిద్ధమైంది. 2018 ఆగస్టు 5న ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌ప్రధాని నరేంద్రమోదీని కలిసిన అనంతరం కేంద్రం విడుదల చేసిన నోట్‌ ఇది (నోట్‌ను చూపిస్తూ..). ఈ అంశంపై దమ్ముంటే చర్చకు సిద్ధమా?‘‘అని బండి సంజయ్‌ ‌సవాల్‌ ‌విసిరారు. ఆ భూములిస్తే ఏటా కంటోన్మెంట్‌ ‌బోర్డు ప్రజలకు 30 కోట్ల రూపాయల సర్వీస్‌ ‌ట్యాక్స్ ‌చెల్లించాల్సి వొస్తుందనే భయంతో కేసీఆర్‌ ‌ప్రభుత్వం వెనక్కు తగ్గి కేంద్రంపై అభాండాలు వేస్తుందని మండిపడ్డారు. ఇప్పటికైనా కంటోన్మెంట్‌ ‌ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని, లేనిపక్షంలో ప్రజలు తగిన బుద్ధి చెబుతారని కేసీఆర్‌ను హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page