ట్రూ అప్ ఛార్జీల భారం తప్పదని నిపుణుల ఆందోళన
ప్రజలకు జగన్ ప్రభుత్వం గట్టి షాక్ ఇవ్వనున్నారు. రాష్ట్రంలో వ్యవసాయ పంపుసెట్లకు స్మార్ట్ ప్రీపెయిడ్ టర్లు రానున్నాయి. ఆ రెండూ సామాన్యుడి నెత్తిన పిడుగులా మారడం ఖాయమని నిపుణులు అంటున్నారు. ఈ మీటర్ల కోసం భారీగానే డిస్కంలు పెడుతున్న వ్యయమే… అంటే ట్రూ అప్ చార్జీల పేరుతో ఆ మొత్తాన్ని వినియోగదారుల నుంచే వసూలు చేస్తారు. గతంలో నెలకు 5 వందల యూనిట్లకు పైబడి మాత్రమే ప్రీపెయిడ్ మీటర్లను మారుస్తామని డిస్కంలు చెప్పాయి. ఇప్పుడు కనెక్షన్ లోడ్ 25 కేవీ దాటిన వారందరికీ ఈ మీటర్లను బిగిస్తామని చెబుతున్నాయి. అంటే దాదాపుగా వినియోగదారులందరినీ ప్రీపెయిడ్ మీటరు పరిధిలోకి తెస్తున్నట్టే. గతంలో మాదిరిగా నెలవారీ బిల్లులు రావు.
టెలికాం సంస్థల తరహాలో ముందస్తుగా డబ్బులు చెల్లించి విద్యుత్‌ను కొనుక్కోవాలి. దానికి కూడా ఒకే ధర ఉంటుందన్న గ్యారంటీ డిస్కంలు ఇవ్వడంలేదు. ఒక ధర చెల్లిస్తే దానికి తగినన్ని యూనిట్లు కేటాయిస్తామని డిస్కంలు చెప్పడంలేదు. ప్రజలకు ప్రీపెయిడ్ మీటర్ల పనితీరును వివరించడం సంగతి ఎలా ఉన్నా.. వాటి పనితీరును రాష్ట్ర విద్యుత్ వినయోగదారుల హక్కుల పరిరక్షణ కోసం ఏర్పాటైన రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలికి కూడా విధివిధానాలు వివరి ంచకపోవడంపై ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి.
గతంలో డిస్కంలకు ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్లుగా ఐఏఎస్ అధికారులు బాధ్యతల నిర్వహించేవారు. కానీ ఇప్పుడు ఏపీలోని మూడు డిస్కంలకు నాన్ ఐఏఎస్‌లే సీఎండీలుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. దీనివల్ల వేలకోట్ల టర్నోవర్ సహా విధానపరమైన నిర్ణయాలతో ముడిపడిన వ్యవస్థలు మార్గదర్శకాన్ని కోల్పోతున్నాయన్న అభిప్రాయం ఉంది. ఈ పరిస్థితిలోనే మొత్తం ఒకేసారి వినియోగదారులపై మోయలేనంత ట్రూ అప్ చార్జీల భారాన్ని వేసేందుకు డిస్కంలు సిద్ధమవుతున్నాయి.