ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 11 : ఇటీవల వెలువడిన ఎస్సై ఫలితాలలో ఎంపికైన అభ్యర్థులు ఉన్నత లక్ష్యం, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతూ జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని ఎల్బీనగర్ ట్రాఫిక్ డిసిపి వి. శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం ఆమనగల్ పట్టణంలోని మాస్టర్ డిగ్రీ కళాశాలలో స్నేహ హస్తం ఫౌండేషన్ వ్యవస్థాపకులు నల్లగొండ విజిలెన్స్ సిఐ గజ్జె చరమంద రాజు ఆధ్వర్యంలో ఎస్సై లుగా ఎంపికైన ఆమనగల్లు, కడ్తాల్ మండలాలకు చెందిన కె. మధు, యు. రాకేష్, ఎన్. దేవేందర్, యు. సునీత, జి. లింగం గౌడ్, శ్రీకాంత్, సిహెచ్ శ్రీనులను స్నేహ హస్తం ఫౌండేషన్ ఆమనగల్లు ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎల్బి నగర్ ట్రాఫిక్ డిసిపి వి. శ్రీనివాసులు, స్నేహ హస్తం ఫౌండేషన్ వ్యస్థాపక అధ్యక్షులు నల్గొండ జిల్లా విజిలెన్స్ సీఐ గజ్జె చరమందరాజు గౌడ్ లు హాజరయ్యారు. ఈ సందర్బంగా డిసిపి శ్రీనివాసులు మాట్లాడుతూ విద్యార్థినీ విద్యార్థులు ఉన్నత లక్ష్యాలు ఏర్పరచుకొని, ప్రణాళికతో, ఆత్మవిశ్వాసంతో జీవితంలో ఆటుపోట్లను ఎదుర్కొని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఫౌండేషన్ వ్యస్థాపక అధ్యక్షులు గజ్జె చరమందరాజు మాట్లాడుతూ తమ ఫౌండేషన్ ఉద్యోగార్ధులకు ఉద్యోగ సాధనలో సహాయం అందించడానికి ఎల్లప్పుడూ మందుంటుందని పేర్కొన్నారు. అనంతరం ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ అధ్యక్షులు తల్లోజు చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి పెరికేటి యాదయ్య, కోశాధికారి లింగంపల్లి ఆనంద్, కార్యవర్గ సభ్యులు పున్న వెంకటేష్, విడియాల ఆనంద్, సిరందాసు జగదీశ్వర్, ధనరాజ్ మరియు కళాశాల సిబ్బంది చందు, శివలింగం, విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.