ఏం ‌సాధించారని ప్లీనరీలు

ఇక్కడ చేతగాదు గాని దేశం బాగు చేస్తాడట
విద్యా, వైద్యాలను పూర్తిగా భ్రష్టు పట్టించారు
ఫామ్‌హౌజ్‌ ‌కోసమే కాళేశ్వరం నిర్మాణం
లక్ష రూపాయల రుణమాఫీని అటకెక్కించారు
కౌలురైతుకు రైతుబంధును అందించాలి
భట్టి పాదయాత్ర రాష్ట్రమంతా కొనసాగాలి
వి•డియా సమావేశంలో ఎంపి కోమటిరెడ్డి వెంకటర్‌ ‌రెడ్డి

నల్గొండ, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 28 : ‌ప్రత్యేక రాష్ట్రంలో  ఏం సాధించారని ఇప్పుడు దేశాన్ని బాగు చేస్తానంటూ మాట్లాడుతున్నారని కాంగ్రెస్‌ ఎం‌పీ కోమటిరెడ్డి వెంకట్‌ ‌రెడ్డి సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించారు. రాష్ట్రంలో ఏం అభివృద్ధి చేశారని ప్లీనరీ పేరుతో ఉత్సవాలు చేసుకున్నారని కేసీఆర్‌ ‌పై మండిపడ్డారు. హైదరాబాద్‌ ‌హెచ్‌ఐసీసీలో జరిగిన టీఆర్‌ఎస్‌ ‌ప్లీనరీ గురించి ఆయన వి•డియాతో మాట్లాడుతూ…ప్లీనరీ పేరుతో వందల కోట్ల ప్రజా ధనాన్ని టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. ఐకేపీ సెంటర్లలో ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. మల్లన్న సాగర్‌, ‌కొండ పోచమ్మ ద్వారా తన ఫామ్‌ ‌హౌజ్‌కు నీళ్లు తెచ్చుకున్నారే తప్ప ప్రజలకు ఒరిగిందేవి•లేదన్నారు. నార్కట్‌పల్లిలోని బ్రాహ్మణవెళ్లి లిప్ట్ ఇరిగేషన్‌ ‌ప్రాజెక్ట్‌ను ఎప్పుడు పూర్తి చేస్తారని అడిగారు. గజ్వేల్‌, ‌సిద్ధిపేట, సిరిసిల్లాకే కేసీఆర్‌ ‌సీఎం అయినట్లు పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. లక్ష రూపాయల రుణమాఫీ ఏకకాలంలో చేస్తానన్న కేసీఆర్‌…ఇప్పటివరకు ఒక్కరికి కూడా రుణమాఫీ చేయలేదన్నారు. కేసీఆర్‌ ‌హయాంలో విద్య, వైద్యం భ్రష్టుపట్టిందన్న ఆయన…నోటిఫికేషన్ల పేరుతో హడావుడి చేస్తున్నారన్నారు.

ధరణి పేరుతో రైతులను దోచుకున్నారన్న ఆయన…తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ధరణిని ఎత్తేస్తామన్నారు. ధరణి సమస్యలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. టీఆర్‌ఎస్‌ ‌పార్టీ పొత్తు కోసం అడిగినా ఏఐసీసీ హైకమాండ్‌ ఒప్పు‌కోలేదని తెలిపారు. రాష్ట్రంలో రాబోయేది కాంగ్రెస్‌ ‌ప్రభుత్వమే అని స్పష్టం చేశారు. కౌలు రైతులకు రైతుబంధు అమలు చేయాలని కోమటిరెడ్డి డిమాండ్‌ ‌చేశారు. పెట్రో చార్జీలు పెంచుతూ మోడీ, కేసీఆర్‌ ‌ప్రజలను పీల్చిపిప్పి చేస్తున్నారని, ధర్నాల పేరుతో ఒకరినొకరు దూషించుకుంటూ…కేసీఆర్‌, ‌బీజేపీ నాయకులు డ్రామాలాడుతున్నారన్నారు. పట్నం మహేందర్‌ ‌రెడ్డి ఎపిసోడ్‌పై కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందిస్తూ..పట్నం మహేందర్‌ ‌రెడ్డికి కోమటిరెడ్డి మద్దతు పలికారు. పట్నం మహేందర్‌ ‌రెడ్డికి అవమానం జరిగిందని.. ఎమ్మెల్యే కంటే ఎమ్మెల్సీ ప్రోటోకాల్‌ ఎక్కువ అని పేర్కొన్నారు. రాష్ట్రంలో పోలీసులు ఉన్నారా..? డీజీపీ… ఉన్నా లేనట్టే పోలీసుల రాజ్యం తయారైంది. పోలీసులు నిబంధనలు పాటిస్తున్నారా? ఎమ్మెల్యేకి ఐదు ఎస్కార్ట్ ‌వాహనాలు అవసరమా..? పోలీసులు వీటి వి•ద స్పందించాలి. పట్నం మహేందర్‌ ‌బూతులు తిట్టడం తప్పేనని అంటూ.. పోలీసుల పద్ధతి కూడా మారాలని పేర్కొన్నారు. నల్లగొండ జిల్లాలో శుక్రవారం జరిగే టీపీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి కార్యక్రమానికి తాను హాజరుకావడం లేదని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు.

తన సొంత నియోజకవర్గంలో కేంద్రమంత్రి గడ్కరీ అభివృద్ధి కార్యక్రమాలు ఉండడం వల్ల రేవంత్‌ ‌కార్యక్రమానికి వెళ్లడం లేదని తెలిపారు. నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్‌ ‌పటిష్టంగా ఉందని వేరే నేత వొచ్చి సవి•క్ష జరపాల్సిన అవసరం లేదన్నారు. కాంగ్రెస్‌ ‌పార్టీ వీక్‌గా ఉన్న దగ్గర సమావేశాలు పెట్టుకుంటే మంచిదని సలహా ఇచ్చారు. పీకే గురించి కాదని.. కేసీఆర్‌ని ఎలా పీకాలన్నదే తమ టార్గెట్‌ అని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ ‌పార్టీలో గ్రూపు తగాదాలు సర్వ సాధారణమని చెప్పుకొచ్చారు. పార్టీ మారే ఉద్దేశ్యం లేదని స్పష్టం చేశారు. వొచ్చే ఎన్నికల్లో తనకు టికెట్‌ ఇచ్చే అంశంపై అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూసి కార్యాచరణ ప్రకటిస్తానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు.  సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిశ్రీ పాదయాత్రపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కష్టమైనా నష్టమైనా పాదయాత్రను కొనసాగించాలని భట్టిని కోరారు. దివంగత నేత రాజశేఖర్‌రెడ్డిని స్పూర్తిగా తీసుకోవాలని భట్టికి సూచన చేశారు. రాష్ట్రవ్యాప్త పాదయాత్రకు భట్టి విక్రమార్కకు అనుమతి ఇవ్వాలని సోనియా, రాహుల్‌కు లేఖ రాయనున్నట్లు తెలిపారు. 2004లో సీఎల్పీ నేతగా రాజశేఖరరెడ్డి పాదయాత్ర చేస్తే కాంగ్రెస్‌ అధికారంలోకి వొచ్చిందని ఎంపీ గుర్తుచేశారు.

భట్టి విక్రమార్క పాదయాత్ర చేస్తే కావాల్సిన సహకారం సీనియర్లం అందిస్తామన్నారు. రాహుల్‌ ‌సభకు ఒక వ్యక్తి మాత్రమే లక్షల మందిని ఎలా తీసుకొస్తారని ప్రశ్నించారు. మెడిసిన్‌ ‌విద్యార్థిని తాళ్లపల్లి అనుషకు కాంగ్రెస్‌ ఎం‌పీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆర్థిక సహాయం అందజేశారు. అనుషను దత్తత తీసుకుంటున్నాని – చదువు అంతా తానే చూసుకుంటానని స్పష్టం చేశారు.  డాక్టర్‌ ‌సీటు వొచ్చింది కానీ చదివే స్తోమత లేదని… డబ్బుల కోసం ఉపాధిహావి• కూలీ చేసుకుంటుందని తెలిపారు. అనుషకు కావాల్సిన నిధులు, చదువు పూర్తి అయ్యే వరకు తనదే బాధ్యత అని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యను మూలకు పడేశారని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు అని నాలుగు కట్టడాలు చూపించి అభివృద్ధి అంటున్నారన్నారు. ముఖ్యమంత్రికి కనీస జ్ఞానం ఉండాలని, తెలంగాణ అభివృద్ధి అయిందని దేశాన్ని అభివృద్ధి చేస్తా అంటున్నారని విమర్శించారు. ప్లీనరీలో ముఖ్యమంత్రి ప్రసంగం చూశానని…ప్రభుత్వం విద్యారంగంపై దృష్టి పెట్టాలని సూచించారు. కోట్లు పెట్టినా దొరకని వైద్యసీటు కూలి పనిచేసుకుంటూ అనూషా సాధించిందని కొనియాడారు. 6 వేల స్కూల్స్ ‌మూతపడ్డాయని.. తెలుగు వి•డియంకు దిక్కులేదని.. ఇప్పుడు ఇంగ్లీషు వి•డియం అంటున్నారని ఎంపీ కోమడిరెడ్డి వెంకటరెడ్డి మండిపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page