హిమాయత్ నగర్, ప్రజాతంత్ర, అక్టోబర్ 04 : ఆటోమోటివ్ మాన్యుఫాక్చరర్స్ ప్రైవేట్ లిమిటెడ్(ఏఎంపీఎల్) తన అత్యాధునిక సర్వీసు కేంద్రాన్ని తెలంగాణలోని పాల్వంచలో ప్రారంభించినట్లు ఆటోమోటివ్ మాన్యుఫ్యాక్చరర్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజీవ్ సంఘ్వి బుధవారం నగరంలో విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, ఉత్తర్‌ప్రదేశ్ సహా ఆరు రాష్ట్రాలలో విస్తరించిన 105 సర్వీస్ టచ్ పాయింట్ల విస్తృతమైన నెట్ వర్క్ తో అశోక్ లేలాండ్ సంస్థకు సంబంధించిన అతి పెద్ద డీలర్లలో ఆటోమోటివ్ ఒకటి అన్నారు. ఆటోమోటివ్ మాన్యుఫాక్చరర్స్ ఈ ప్రాంతంలోని వినియోగదారులకు అసాధారణ సేవలను అందించడంలో తన నిబద్ధతను కొనసాగిస్తోందన్నారు. ఛత్తీస్‌గఢ్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ లాంటి ప్రధాన రాష్ట్రాల నుంచి వెళ్ళే వాహనాలకు కీలకమైన స్టాప్‌గా పనిచేస్తుందని అన్నారు.