తమను తెలంగాణలో కలపాలని పురుషోత్తపట్నం గ్రామ పంచాయతీ ప్రజలు మంగళవారం ఐటీడీఏ రోడ్డులో భారీ ధర్నా నిర్వహించారు.పురుషోత్తపట్నం గ్రామ ప్రజలకు సీపీఐ పార్టీ భద్రాచలం పట్టణ కార్యదర్శి ఆకోజు సునీల్ మద్దతు తెలిపారు.ఈ సందర్భంగా సునీల్ మాట్లాడుతూ మొదటి నుండి ఈ పంచాయతీల ప్రజలు తెలంగాణలో కలపాలని ఉద్యమం చేస్తున్నారని వెంటనే ఏపీ,కేంద్ర ప్రభుత్వం స్పందించి ఈ ఐదు గ్రామ పంచాయతీలను తెలంగాణలో కలపాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ పట్టణ కార్యదర్శి బల్లా సాయి కుమార్, సీపీఐ ఐదు పంచాయతీల కన్వీనర్ దారపునేని రమేష్,కొల్లిపాక శివ.బాలరాజు. పురుషోత్తపట్నం గ్రామ పంచాయతీ ప్రజలు గార్లపాటి చంద్రశేఖర్, రేగుల చంటి,మణికంఠ,నాగేష్ రామారావు,సమ్మయ్య, లక్ష్మణ్,కేశవ్,నరేష్,తదితరులు పాల్గొన్నారు.