వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

15 రోజులు ఎన్నిక వాయిదా వేయాలి

April 2, 2019

ఇసికి నిజామాబాద్‌ ‌రైతుల వినతి: నిజామాబాద్‌ ‌లోక్‌సభ నియోజకవర్గంలో పోలింగ్‌ను వాయిదా వేయాలని ఆ స్థానం నుంచి బరిలో ఉన్న రైతు అభ్యర్థులు కోరారు. పోలింగ్‌ను 10 నుంచి 15 రోజుల పాటు వాయిదా వేయాలని కోరుతూ మంగళవారం సాయంత్రం రాష్ట్ర ఎన్నికల సంయుక్త ప్రధానాధికారి ఆమ్రపాలిని కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా వారు డియాతో మాట్లాడుతూ.. పోలింగ్‌ ‌సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో ఇప్పటివరకు ఏ పద్ధతిలో పోలింగ్‌ ‌నిర్వహిస్తారనే అంశంపై తమకు స్పష్టత ఇవ్వలేదన్నారు. వ్యవసాయం తప్ప ఎన్నికల వ్యవహారాలపై ఏ మాత్రం కనీస అవగాహన లేని తమకు సరైన అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఈసీపై ఉందన్నారు. తమకు కేటాయించిన గుర్తులను ఇమేజ్‌ ‌రూపంలో ఇప్పటివరకు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు ఉంటాయి గనక ఈ వ్యవహారంపై తమకు ఉన్న సందేహాలను నివృత్తి చేయాలని కోరారు. ఇందూరులో బ్యాలెట్‌ ‌పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహించాలని కోరినట్టు డియాకు చెప్పారు. అలాగైతే, తమకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నట్టు తెలిపారు. కావాలనే పట్టుబట్టి ఇవిఎలంను తీసుకుని రావడంపై అనుమానాలు వ్యక్తం చేశారు.