ఓటమి భయంతోనే సింగరేణి కార్మిక ఎన్నికలు వాయిదా

సంఘాల నిర్వీర్యానికి కేసిఆర్‌ ‌కుట్ర
కేసిఆర్‌ ‌చెప్పేదొకటి…చేసేది మరొకటి
మట్టి తీసేది…బొగ్గు తోడేది ప్రైవేటోళ్ళే
సొమ్ము తెలంగాణది, సోకు ఓబి కాంట్రాక్టర్లది
రాష్ట్ర బిజెపి ఎన్నికల కమిటి చైర్మన్‌ ఈటల రాజేందర్‌

‌కొత్తగూడెం, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 23 : ఓటమి భయంతోటే సింగరేణిలో కార్మిక ఎన్నికలు నిర్వహించట్లేదని, స్వార్థ ప్రయోజనాల కోసం సింగరేణి సంస్థను టెండర్లలో పాల్గొనకుండా అడ్డుకుని ప్రైవేటు వ్యక్తులకు కట్టాబెట్టారని రాష్ట్ర బిజెపి ఎన్నికల కమిటీ చైర్మన్‌ ఈటల రాజేందర్‌ ‌విమర్శించారు. చుంచుపల్లి మండలంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కెవి రంగా కిరణ్‌ ‌నివాసంలో శనివారం ఏర్పాటు చేసిన అల్పాహార విందులో పాల్గొన్న అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ…ప్రజలను చైతన్యపరిచే ప్రజా, కార్మిక, కుల సంఘాల ఉనికినే ప్రశ్నించి అవహేలన చేసి, వాటిని అనగతొక్కే ప్రయత్నం కెసిఆర్‌ ‌మానుకోవాలని హెచ్చరించారు. సింగరేణి సంస్థ వద్ద డబ్బులేకనా..అనుభవం, ప్రతిభ ఉన్న కార్మికులు లేరనా టెండర్లలో పాల్గొనకుండా అడ్డుకుని కార్మికులను మోసం చేశారని ధ్వజమెత్తారు. అనాడు ఉత్తర తెలంగాణను బొందల గడ్డగా మార్చారని పాద యాత్ర చేసి గర్జించామని, కానీ నేడు స్వరాష్ట్ర పాలనలో అధికార మదంతో కెసిఆర్‌ ‌కూడా ఆదే తోవలో పోతున్నారని మండిపడ్డారు.

తెలంగాణ రాష్ట్రంలో 12 ఓసిలు ప్రారంభించారని గుర్తుచేశారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకం అని ప్రగల్భాలు పలికే  కెసిఆర్‌ ‌సింగరేణి సంస్థను అనధికారికంగా ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతున్నారని ఘాటుగా విమర్శించారు. సింగరేణి సంస్థలో మట్టి తీసేది..బొగ్గు తోడేది ప్రైవేటు సంస్థలే అని, 1000 మంది కార్మికులు పనిచేసే చోట వందల సంఖ్యతో పూర్తిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టెంటర్లలో పాల్గొనకుండా సింగరేణి సంస్థను అడ్డుకుని బొగ్గు టెండర్‌ను శరత్‌చంద్ర అనే ఓ ప్రైవేటు వ్యక్తికి కట్టబెట్టారని ఆరోపించారు. ఇరిగేషన్‌ ‌ప్రాజెక్టుల విషయంలో ఉమ్మడి ఆంధప్రదేశ్‌ అసెంబ్లీలో చర్చ జరిగన సమయంలో అప్పటి సిఎం కాంట్రాక్టర్లు సేవ చేయడానికి సామాజిక కార్యకర్తలు కాదని, లాభాల కోసమే కాంట్రాక్టర్లు పనిచేస్తారని సమాధానం ఇచ్చారని గుర్తుచేశారు. ఈ విషయంపై తెలంగాణ సిఎంకు సోయి లేదా అని ప్రశ్నించారు. సింగరేణి సంస్థలో రాష్ట్ర వాటా 51 శాతం వాటా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుకోడంలో చిత్తశుద్ధి లేదన్నారు. దీనితో కార్మికులు, సంస్థ అభివృద్ధి కుంటుపడుతుందన్నారు.

కల్వకుంట్ల కుటుంబం కోసం కల్పతరువులాంటి సింగరేణి సంస్థ ఉనికి ప్రమాదంలో పడిందని, తెలంగాణ ప్రజలు ఆలోచించాలని విజ్జప్తి చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో గత ప్రభుత్వాలు తెలంగాణలో ఓపెన్‌ ‌కాస్ట్‌ల పేరుతో బొందల గడ్డగా తయారు చేసిందన్న కెసిఆర్‌ 12 ఓపెన్‌ ‌కాస్ట్ల నుండి 20 ఓపెన్‌ ‌కాస్ట్లకు పెంచింది బిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు. ఇచ్చేది ఆయన..పుచ్చుకునేది వారు..మధ్యల ఈ సంఘాల గోల ఎందుకని…సంఘాల ఉనికినే అవహేలన చేసి సంఘాలను నిర్వీర్యం చేశాడని ఆగ్రహించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే జైల్లో పెడతా అంటూ ఫోర్త్ ఎస్టేట్‌ అయిన మీడియాను సైతం బ్లాక్‌ ‌మేయిల్‌ ‌చేయడం సిఎం స్థాయికి తగదని, ఇకనైనా కెసిఆర్‌ ‌స్వార్థం వీడి తలెంగాణ ప్రజల కోసం పనిచేయాలని హితవు పలికారు. తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా కెసిఆర్‌ ‌ప్రభుత్వం పతనం తప్పదని, ప్రజలు కేసిఆర్‌  ‌ప్రభుత్వాన్ని గద్దె దించడానికి  సిద్ధంగా ఉన్నారని ఈటల రాజేందర్‌ అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యదర్శి కుంజా సత్యవతి, బిఎంఎస్‌ ‌నాయకులు మాధవ నాయక్‌, ‌బిజెపి జిల్లా ఇంచార్జ్ ‌రుక్మారావు, ఓబీసీ జిల్లా అధ్యక్షులు ఆకుల నాగేశ్వరరావు గౌడ్‌, ‌చుంచుపల్లి మండల అధ్యక్షుడు రాయుడు నాగేశ్వరరావు, నాళ్ళ సుందర్‌, ‌తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page