పండగ, పర్వం అంటే శుభవేళ, ఉత్సాహంగా జరుపుకునే ఉత్సవ సమయం అని అర్థం. పండుగలు మానవ జీవన స్రవంతిలో భాగమై, జాతీయతకు, సామూహిక జీవన విధానానికి, సంస్కృతి వికాసానికి దోహదపడుతున్నాయి. పండుగ అనేది ఏ మతానికి సంబంధించినది అయినా సరే, దాని వెనుక ఒక సందేశం, ఒక శాస్త్రీయత, ఒక సదాచారం దాగి ఉంటాయి. పండుగ మానవాళికి హితాన్ని బోధిస్తుంది. ముస్లిములు అత్యంత పవిత్రంగా జరుపుకునే రంజాన్ సైతం ఇదే హితాన్ని మానవాళికి అందిస్తుంది. ముస్లిములు చాంద్రమానం క్యాలెండర్ ను అనుసరిస్తారు. చాంద్రమాన అనుసరణీయ, ఇస్లామీయ క్యాలెండర్ తొమ్మిదవ నెల రంజాన్. క్రమశిక్షణ దాతృత్వం ధార్మిక చింతనల కలయికే రంజాన్ మాసం.
ముస్లిం సోదరులకు పరమ పవిత్రమైన రంజాన్ నెల సందర్భంగా, నెల రోజుల పాటు నిర్వహించనున్న ఉపవాస దీక్షలు… కఠోర నియమాలకు, దీక్షా దక్షతలకు ప్రబల నిదర్శనాలు.దివ్య ఖురాన్ అవతరించిన నెలలో విధిగా ఆచరించవలసిన నియమం ఉపవాస వ్రతం. ఉపవాసాన్ని ‘‘పార్సీ’’ భాషలో ‘‘రోజా’’ అంటారు. పరమ పవిత్రంగా ప్రత్యేక ప్రార్థనలతో, ఉపవాస దీక్ష కంకణులైన ధార్మికులు, భక్తి శ్రద్ధలతో అన్ని అలవాట్లకు దూరంగా ఉంటూ, నెల రోజులు దీక్షలో నిమగ్నమై ఉంటారు. ‘‘రంజాన్’’ పండగ పేరు కాదు. నెల పేరు. ‘‘రంజ్’’ అనగా కాలుట (జ్వలించుట) ఉపవాసము చేయుటచే, మను షులుచేయు పాపమును కాలి పోవునని భావము. నెల అంతయు, ఉదయం నుండి సూర్యా స్తమయం వరకు ఉపవాసం ఉండి, రోజా పాటిస్తూ రోజుకు 5 సార్లు నమాజ్ పఠిస్తూ, మసీదులలో ఎక్కువ సమయం గడుపుతారు.
(సూర్యోదయమునకు పూర్వము) జూహర్ ( మధ్యాహ్నం తర్వాత) అనర్ ( సూర్యాస్త మయానికి పూర్వము) మగరీబ్ (సూర్య సమయానికి ముందు చీకటి పడ్డాక) ఇషా (అర్ధరాత్రికి ముందు చేయాల్సిన సమాజులు. ఈ నెలలో రాత్రి చేయు ప్రత్యేక ప్రార్థనలు ‘‘తరావీహ్’’ అంటారు. నెలలో ఖురాన్ ను పూర్తిగా వరిస్తారు. ముస్లి సిద్ధాంతాలను విశ్వసించి పాటిస్తారు. ఆయన దూతలను హృదయ పూర్వకంగా విశ్వసించడం, రోజు 5 సార్లు నమాజు నమాజు పఠిచడం, పూర్తిగా ఉపవాస దీక్షను పాటించడం, పేదలకు దానం చేయడం మక్కా యాత్ర చేయడం, ప్రధాన సిద్ధాంతాలు. రోజా లో ఉండగా ఉమ్మిని మింగ రాదు. బీడీ, సిగరెట్ లాంటివి కాల్చడం చేయరాదు. మద్యం సేవించ రాదు. మందులు తీసుకొనరాదు. చాడీలు చెప్పుట, ఇతరులను దుర్భాషలాడడం, అబద్ధం చెప్పుట, చెడు పనులు చేయుట నిషిద్దాలు, వీటిని పాటించ కుంటే, అల్లాహ్ దృష్టిలో తాను చేసిన వ్రతమునకు విలువ ఉండదు.
ఈద్ అసలు పేరు ‘‘ఈద్ – ఉద్- ఫితర్’’. ఫితర్ అంటే దానము.
జకాత్ తో పాటు ‘ఫిత్రా దానానికి’’ రంజాన్ నెలలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. మూడు పూటలా తిండికి, ఒంటినిండా బట్టకు నోచుకోని పేదవారు, అభాగ్యులకు, పండగ సందర్భంలో దానం చేయాలని, ఇస్లాం మతం బోధిస్తోంది. ‘‘ఫిత్రా దానం’’ అని పిలుస్తారు. ఉపవాస వ్రతాలు విజయవంతం కావడానికి, దేవుని పట్ల కృతజ్ఞతగా, పేదలకు ఫిత్రా దానం చేయడం.ఫిత్రా దానాన్ని విధిగా నియ మించడానికి కారణం, ఉపవాస వ్రత నియమాన్ని పాటించే సమయంలో హృదయంలో కలిగే చెడు భావనలు, తలంపులు, ఆలోచనలు, నోటి నుండి వెలువడే అసత్యాలు, అనాలోచిత పొరపాటు, అన్నీ క్షమించ బడతాయని, మహమ్మద్ అనుచరుడు అబ్దుల్లా బిన్ మసూద్ ఉవాచ.
– రామ కిష్టయ్య సంగన భట్ల…
9440595494