ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 15 : కడ్తాల గ్రామపంచాయతీ కు స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ్ -2023 అవార్డు లభించింది. ఈ మేరకు శుక్రవారం కొంగరకలాన్ లోని రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో సర్పంచ్ లక్ష్మీనరసింహారెడ్డి కు అవార్డు ప్రదానం చేశారు. ఇందులో భాగంగా కడ్తాల ఉత్తమ గ్రామపంచాయతీ – 2023 గా ఎంపికైందని సర్పంచ్ తెలిపారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా పరిషత్ చైర్మన్ తీగల అనిత రెడ్డి, ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి చేతుల మీదుగా కడ్తాల్ సర్పంచ్ గూడూరు లక్ష్మీనరసింహారెడ్డిని శాలువాతో సత్కరించి ప్రశంసా పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ చైర్మన్ వెంకటరమణారెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేష్, డిపిఓ శ్రీనివాసరెడ్డి, డిఆర్డిఓ ప్రభాకర్, కడ్తాల్ ఎంపీడీవో రామకృష్ణ, ఎంపీపీ కమ్లిమోత్యా నాయక్ తదితరులు పాల్గొన్నారు.