ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 5 : కందుకూరు నుంచి కడ్తాల నుండి ఆమనగల్లు వరకు మెట్రో సేవలు విస్తరించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సానుకూలంగా స్పందించడం అభినందించదగ్గ విషయమని ఆమనగల్లు మండల వైస్ ఎంపీపీ జక్కు అనంత్ రెడ్డి అన్నారు. శనివారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కల్వకుర్తి ఎమ్మెల్యే అభివృద్ధి ప్రదాత జైపాల్ యాదవ్ ముఖ్యమంత్రి కేసీఆర్ ని కలిసి కందుకూరు, కడ్తాల నుంచి ఆమనగల్లు వరకు మెట్రో సేవలు విస్తరించాలని కోరడంతో మెట్రో ఎండికి దీనికి సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించడం అభినందనీయమన్నారు. ఆమనగల్ మున్సిపాలిటీ అభివృద్ధికి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఎనలేని కృషి చేస్తున్నారని అన్నారు. పట్టణంలో ప్రభుత్వ డిగ్రీ, జూనియర్, పాలిటెక్నిక్ కళాశాల తో పాటు గ్రంథాలయ భవన నిర్మాణం, ఇంటిగ్రేట్ మార్కెట్, ఏడీఈ కార్యాలయం ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. భవిష్యత్తులో కల్వకుర్తి వలే ఆమనగల్లు మరి ఎంతో అభివృద్ధి చెందుతుందనీ అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి అనురాధపత్యానాయక్, టిఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి గండికోట శంకర్, ఉపాధ్యక్షులు పరమేష్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ సుభాష్, నాయకులు రూపం వెంకటరెడ్డి, పంతు, వెంకటయ్య, జంగయ్య, విజేందర్, వెంకటయ్య, కుమార్, నరేందర్, బాలరాజ్, మధు తదితరులు పాల్గొన్నారు.