ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 4 : కల్వకుర్తి తాలూకా ముదిరాజ్ సంఘం ప్రధాన కార్యదర్శిగా తలకొండపల్లి మండల కేంద్రానికి చెందిన పద్మ అనిల్ ముదిరాజ్ ( ఉప సర్పంచ్) ఎన్నికయ్యారు. ఈ మేరకు నియామక పత్రాన్ని ముదిరాజ్ సంఘం తాలూకా అధ్యక్షులు శేఖర్ ముదిరాజ్ చేతుల మీదుగా పద్మ అనిల్ తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాపై నమ్మకంతో ముదిరాజ్ సంఘంలో ప్రధానమైన బాధ్యత అప్పగించిన కుల పెద్దలకు, ముదిరాజు సంఘానికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం కల్వకుర్తి తాలూకా అధ్యక్షులు పుట్ట శేఖర్ ముదిరాజ్,తాలూకా వర్కింగ్ ప్రసిడెంట్ బండారి శ్రీనివాస్ ముదిరాజ్, కల్వకుర్తి యువ నాయకులు చందు ముదిరాజ్, ముదిరాజ్ సంఘం యువజన తలకొండపల్లి మండల అధ్యక్షులు పుట్ట నాగరాజు మదిరాజ్ పాల్గొన్నారు.