కూకట్ పల్లి, ప్రజాతంత్ర, డిసెంబర్ 20 : కాంగ్రెస్ పార్టీ కుకట్ పల్లి ఇన్చార్జిగా బండి రమేష్ నియమితులైన సందర్భంగా అభినందనలు వెల్లువత్తాయి. బుధవారం కూకట్పల్లి నియోజకవర్గం చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు మియాపూర్ లోని తన పార్టీ కార్యాలయంలో బండి రమేష్ ను కలిసి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీనీ అధికారంలో తీసుకు వచ్చేందుకు కృషిచేసిన నాయకులకు, కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ప్రతి కార్యకర్త కృషి చేయడం వల్లే నేడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. అదే స్థాయిలో రెట్టింపు పనిచేసి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థిని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలకు అందే విధంగా చూసే బాధ్యత కూడా ప్రతి కార్యకర్తపై నాయకులపై ఉందని ఈ సందర్భంగా తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో కొప్పిశెట్టి దినేష్, గంటా శ్రీనివాస్, రేష్మ, నలిని కాంత్, రాజేష్, కర్రమ్మ, స్వరూప, వాజిద్ పాషా, నహీం, మహమ్మద్ కాజా, రామ్ మోహన్ రావు, నాగేశ్వరరావు, యాదగిరి, చంద్ర, భాస్కర్, భరత్, పని కుమార్, మధు, రమేష్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.