కాంగ్రెస్ మేనిఫెస్టో అబయ హస్తం కాదు భస్మాసుర హస్తం

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, నవంబర్ 18 : కాంగ్రెస్ మేనిఫెస్టో అబయ హస్తం కాదు భస్మాసుర హస్తం అని బిఅరెస్ రాష్ట్ర నాయకులు జగదీశ్వర్ రావు ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ రిలీజ్ చేసిన మేనిఫెస్టో కాదు మ్యానిప్లేటెడ్ పేపర్స్ అని, తలా తోక లేకుండా ఉందన్నారు. ఈ మేరకు శనివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మేనిఫెస్టో కాదు మ్యానిప్లేటెడ్ పేపర్స్ శాస్త్రీయంగా, అవగాహన లేకుండా ఉందన్నారు. ఇది సిఎం కేసీఆర్ ను బద్నామ్ చేయడానికి చేసిన మేనిఫెస్టో అన్నారు. రాష్ట్ర బడ్జెట్ పై అవగాహన లేకుండా మేనిఫెస్టో ఉందన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టో ఆదాయానికి మించి ఉందన్నారు. సిఎం కేసీఆర్ పథకాలు ఆదాయాన్ని సృష్టించి కేసీఆర్ పథకాలు అమలు చేస్తున్నారని స్పష్టం చేశారు. శాస్త్రీయంగా కాల్యూక్లేషన్ లేకుండా ప్రజలను మభ్యపెట్టడానికి 6 గ్యారంటీలు తెచ్చారని అన్నారు. కర్ణాటకలో అమలుకని 6 గ్యారంటీలు తెలంగాణలో ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు. 40 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారన్న రేవంత్ రెడ్డి, 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చి మిగతవారి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఉద్యమకారులను అదుకుంటామన్న కాంగ్రెస్ పార్టీ 14 సం.లు ప్రభుత్వంలో ఉందని, 400 మంది అమరులైతే వారిని ఎందుకు ఆదుకోలేదని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం కోసం అమరుడైన శ్రీకాంతాచారి తల్లికి టికెట్ ఇచ్చి ఎందుకు గెలిపించలేక పోతున్నారని అన్నారు. మీరు ఇంటికి రెండు టికెట్లేల తీసుకున్నారని ప్రశ్నించారు. బిసిలకు బిఆరెస్ కంటే ఎక్కువ ఇస్తామన్న రేవంత్ రెడ్డి బిఅరెస్ కంటే 1 సీటు తక్కువ ఇచ్చి అందులో గెలవని ఓల్డ్ సిటీలో బిసిలకు టికెట్లు ఇచ్చి మోసం చేశారన్నారు. గత జూన్ నెలలో ఆన్ లైన్ లో రాజీవ్ గాంధీ క్విజ్  కంపిటేషన్ ప్రతి అస్సాంబ్లీలో మహిళలకు స్కూటీ, లాప్ టాప్స్, మొబైల్స్ ఇస్తానని కాంగ్రెస్ మోసం చేసిందన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ మేనిఫెస్టోకు పొసపోయిన అక్కడి ప్రజలు, ఇక్కడ మోసపోవొద్దని కోరారు. అభివృద్ధి దశలో ఉన్న తెలంగాణను ఆగం చేసుకోకుండా బిఆరెస్ కారు గుర్తుకే ఓటు వేసి గెలిపించి, భవిష్యత్ తరాలకు మరింత అభివృద్ధిని అందించలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page