పటాన్ చెరు,ప్రజాతంత్ర, సెప్టెంబర్ 14: ఈ నెల 17వ తేదీ హైదరాబాద్ నగరంలోని తుక్కుగూడలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా నిర్వహించే కాంగ్రెస్ పార్టీ విజయభేరి సభకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు భారీగా తరలిరావాలని, సభను విజయవంతం చేయాలని టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి (జగ్గారెడ్డి) పిలుపునిచ్చారు. రామచంద్రాపురం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పటాన్ చెరు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గస్థాయి ముఖ్య జన సమీకరణ, అలాగే సభ విజయవంతం చేయడానికి టీపీసిసి వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డికి 5 నియోజకవర్గాలు ఇంచార్జిగా ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా జగ్గారెడ్డి రామచంద్రాపురం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కాట శ్రీనివాస్ గౌడ్ తో పాటు ముఖ్యనాయకులతో, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ… తుక్కుగూడలో జరిగే విజయభేరిసభకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వేలాదిగా తరలిరావాలని, సభను విజయవంతం చేయాలని అన్నారు. పటాన్ చెరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, కార్యకర్తలు బలంగా ఉన్నారనీ అన్నారు. పటాన్ చెరు నియోజకవర్గం నుండి శక్తి మేరకు కాంగ్రెస్ శ్రేణులను పెద్ద ఎత్తున సభకు జన సమీకరణ చేయాలని, చేస్తారన్న నమ్మకం నాకు ఉందని, ధీమా వ్యక్తం చేశారు. పటాన్ చెరు నియోజకవర్గం నుండి విజయభేరి సభకు జన సమీకరణ తరలింపు కోసం తన వంతుగా తెల్లాపూర్ మున్సిపాలిటీ నాయకులు అరుణ్ .పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కాట శ్రీనివాస్ గౌడ్ కి ఒక లక్ష రూపాయల చెక్ అందచేశారు. అనంతరం ఈ సందర్భంగా పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కాట శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ… విజయభేరి సభను విజయవంతం చేయాలని, రాబోయే రోజుల్లో పటాన్ చెరు గడ్డపైన కాంగ్రెస్ జెండా ఎగరవేయడం ఖాయమని ఈ సందర్భంగా ఆయన భీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పటాన్ చెరు కో- ఆర్డినేటర్ శ్యామ్ గౌడ్, మాజీ కార్పొరేటర్ సఫానదేవ్, పీసీసీ సభ్యులు కొత్తపల్లి శ్రీనివాస్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండలాల అధ్యక్షులు సుధాకర్ గౌడ్, వడ్డె క్రిష్ణ, పుట్ట నర్సింగ్, టౌన్ ప్రెసిడెంట్ నరసింహ రెడ్డి, మున్సిపాలిటీ అధ్యక్షులు పట్లోళ్ల శశిధర్ రెడ్డి, జైపాల్ రెడ్డి, సి.ప్రభాకర్ రెడ్డి, డివిజన్ ప్రెసిడెంట్స్ ఈశ్వర్ సింగ్, శ్రీనివాస్, స్టేట్ ఎస్ సి సెల్ ప్రెసిడెంట్ నరసింహ, సంగారెడ్డి జిల్లా మైనారిటీ ప్రెసిడెంట్ హబీబ్ జానీ, సంగారెడ్డి జిల్లా ఎస్సి సెల్ ప్రెసిడెంట్ యాదగిరి, అసెంబ్లీ ఎస్సి సెల్ ప్రెసిడెంట్ కొనింటి మహేష్, యూత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నరేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ అధ్యక్షులు, కె ఎస్ జి యువసేన సభ్యులు, తదితరులు పాల్గొన్నారు..