- మోకాళ్ళ చికిత్సకు, చిప్పల మార్పిడికి తొలి అడుగు సిద్ధిపేట నుండే..
- మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలో నేడు రాఘవాపూర్‌లో హెల్త్ క్యాంప్
- హెల్త్ క్యాంప్‌ను సద్వినియోగం చేసుకోవాలి
- వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు
సిద్దిపేట, మార్చి 25(ప్రజాతంత్ర బ్యూరో) : ప్రభుత్వం ఆరోగ్య తెలంగాణ దిశగా ఆలోచన చేస్తూ..ప్రజలు ప్రభుత్వ హాస్పిటళ్లలో కార్పోరేట్ స్థాయిలో మెరుగైన వైద్య సదుపాయాలు అందిస్తూ..ప్రభుత్వం అందించే వైద్యం అంటే ఒక నమ్మకాన్ని కలిగిస్తూ మరో అడుగు ముందుకు వేసింది. సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఆరోగ్య శాఖ మంత్రిగా హరీష్ రావు ఇటీవల ప్రకటించిన మోకాళ్ళ చిప్పల మార్పిడి ప్రభుత్వ హాస్పిటల్లోనే జరుగుతయన్నారు. మోకాళ్ళ చిప్పల మార్పిడి అనేది కార్పోరేట్ స్థాయి హాస్పిటల్లో జరుగుతాయ్ అనే నానుడి నుండి ప్రభుత్వ హాస్పిటల్లోనే జరిగేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ దిశగా సిద్ధిపేట నుండే ఈ కార్యక్రమానికి తొలి అడుగు పడింది.. మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్న వారికి శుభవార్త చెప్పారు.
దేశములో క్యాన్సర్ వ్యాధి గ్రస్థులు వృద్ధి రేటు పెరగడంతో ఆ దిశగా ప్రభుత్వం కాన్సర్ పేషేంట్స్లను దృష్టిలో పెట్టుకొని కాన్సర్పై ప్రత్యేక క్యాంప్‌లు ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు నేడు శనివారం రోజున మంత్రి హరీష్ రావు ఆదేశాలకు సిద్దిపేట రూరల్ మండలం రాఘవాపూర్ గ్రామంలో ఎంఎన్జి హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో, కాన్సర్ పరీక్షలు మరియు సిద్ధిపేట ప్రభుత్వ వైద్య కళాశాల ఆధ్వర్యంలో మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్న వారి గురించి ప్రత్యేక హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. శనివారం ఉదయం 8 గంటల నుండి ఈ హెల్త్ క్యాంప్ మొదలుతువుతుంది. హెల్త్ క్యాంపులో అనుభవజ్ఞులైమా ఆర్థోపెడెక్ డాక్టర్లచే పరీక్షలు, ఎక్స్‌రేలు కూడా నిర్వహిస్తారు.
మోకాళ్ళ మార్పిడికి అవసరం ఉంటే హైదరాబాద్ గాంధీ, ఉస్మానియా హాస్పిటళ్లకు రిఫర్ చేసి ఆపరేషన్ కూడా ఉచితంగా చేయిస్తారు. అదే విధంగా కాన్సర్ హాస్పిటల్ నుండి ప్రముఖ వైద్య నిపుణులతో కాన్సర్ పరీక్షలు చేస్తారు. ఆపరేషన్ అవసరం చికిత్స ఉంటే హైదరాబాద్‌కు రిఫర్ చేయించి చికిత్స అందిస్తారు. ఈ ఉచిత హెల్త్ క్యాంప్ ను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి హరీష్ రివు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.