కామారెడ్డి ఘటనలో పోస్ట్ ‌మార్టమ్‌ పూర్తి

బంధువులకు శవాలు అప్పగింత
ఘటనపై స్పీకర్‌, ‌మంత్రి వేముల, ఎంఎల్‌సి కవిత దిగ్భ్రాంతి
ప్రమాద మృతులకు 2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని మోడీ

కామారెడ్డి, ప్రజాతంత్ర, మే 9 : కామారెడ్డిలో ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారికి పోస్టుమార్టం పూర్తయింది. పోస్టుమార్టం అనంతరం 9 మృతదేహాలనూ పోలీసులు వారి కుటుంబీకులకు అప్పగించారు. ప్రమాదంలో గాయపడ్డవారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండగా.. మిగిలిన 14 మందికి స్థానిక ప్రభుత్వ హాస్పిటళ్లలో చికిత్స అందిస్తున్నారు. ఆదివారం సాయంత్రం కామారెడ్డి జిల్లా అసన్‌పల్లి గేట్‌సవి•పంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో మృతి చెందిన వారికి బాన్సువాడ ఏరియా హాస్పిటల్‌ ఆవరణలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం పోలీసులు.. వారి వారి బంధువులకు మృతదేహాలను అప్పగించారు. దుర్ఘటనతో హాస్పిటల్‌ ‌వద్ద బంధువుల రోదనలు మిన్నంటాయి. పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు మృతదేహాలను అప్పగించిన అనంతరం ఎస్పీ శ్రీనివాస రెడ్డి వి•డియాతో మాట్లాడుతూ.. ప్రయాణాలు చేసేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రైవేటు వాహనాల కంటే ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణాలు శ్రేయస్కరమైనవని పేర్కొన్నారు.

ఆదివారం  పిట్లం మండలం చిల్లర్గి నుంచి టాటా ఏస్‌లో 25 మంది ఎల్లారెడ్డి వెళ్లారు. అక్కడ సవి•ప బంధువు దశదిన కర్మ అనంతరం అంగడిదింపుడుకు వెళ్లి….తిరిగి వొస్తుండగా ప్రమాదం జరిగింది. అనంతరం తిరుగు ప్రయాణంలో డ్రైవర్‌ ‌వాహనం వేగంగా నడపటంతో… ఎదురుగా వొస్తున్న లారీని ఢీకొట్టింది. ఆటోను ఢీకొన్న తర్వాత లారీ పక్కన ఉన్న రేకుల షెడ్డులోకి దూసుకెళ్లింది. ఘటనాస్థలంలో డ్రైవర్‌ ‌సాయిలు, లచ్చవ్వ అక్కడిక్కడే చనిపోయారు. క్షతగాత్రులను ఎల్లారెడ్డి, బాన్సువాడ, నిజామాబాద్‌ ‌హాస్పిటళ్లకు తరలించారు. చికిత్స పొందుతూ అంజవ్వ, వీరమణి, సాయవ్వ, వీరవ్వ, గంగామణి మరణించారు. బాన్సువాడ హాస్పిటల్‌ ‌నుంచి నిజామాబాద్‌కు తరలిస్తుండగా ఎల్లయ్య, పోచయ్య మార్గమధ్యలో ప్రాణాలు విడిచారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అతివేగం, డ్రైవర్‌ ‌నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక కామారెడ్డి జిల్లా ఘోర రోడ్డు ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. మృతుల కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన ప్రధాని.. బాధిత కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున, క్షతగాత్రులకు రూ.50 వేలు పరిహారం ప్రకటించారు. దుర్ఘటనపై రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

మృతుల కుటుంబాలకు సాయం ప్రకటించారు. ఒక్కో కుటుంబానికి రూ.2 లక్షల ఆర్థిక సాయం, క్షతగాత్రులకు రూ.50 వేలు ప్రకటించారు. శాసనసభ స్పీకర్‌ ‌పోచారం శ్రీనివాస్‌ ‌రెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్‌ ‌రెడ్డి, ఎమ్మెల్సీ కవిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడి బాన్సువాడ ఏరియా దవాఖానలో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను స్పీకర్‌ ‌పోచారం ఆదేశించారు. వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని కవిత హావి• ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page