కెసిఆర్‌పై పోటీ చేసి గెలుస్తా
ఓటమి భయంతో బిఆర్ఎస్ దుష్పచ్రారం
కామారెడ్డి,ప్రజాతంత్ర,అక్టోబర్
ఇద్దరు ప్రజాక్షేత్రంలో నిలబడితే ప్రజలే నిర్ణయిస్తారని అన్నారు. కేసీఆర్ అధర్మయుద్ధం చేస్తున్నారన్న షబ్బీర్ అలీ, నా నిజాయితీ నిరూపించుకుంటానన్నారు. కామారెడ్డి నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు షబ్బీర్ అలీ ఆసక్తి చూపడం లేదని, మరో నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారంటూ కొన్ని రోజుల నుంచి ప్రచారం జరుగుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ కామారెడ్డి నుంచి బరిలోకి దిగడంతో నియోజకవర్గం మారుతున్నారన్న విమర్శలు వచ్చాయి. కామారెడ్డిని వదిలేసి ఎల్లారెడ్డి నుంచి పోటీ చేసేందుకు షబ్బీర్ అలీ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారని ప్రచారం జరిగింది.
కొన్ని రోజుల వస్తున్న పుకార్లకు షబ్బీర్ అలీ తాజాగా చెక్ పెట్టారు. కేసీఆర్ పోటీ చేసినా సరే కామారెడ్డి నుంచే బరిలోకి దిగుతానని స్పష్టం చేశారు. కామారెడ్డి నియోజకవర్గం నుంచి షబ్బీర్ అలీ రెండు సార్లు కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తొలిసారి 1989 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి యుసుఫ్ అలీపై గెలుపొందారు. 2004 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఉప్పునూతల మురళీధర్ గౌడ్ పై విజయం సాధించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తొలి కేబినెట్లో విద్యుత్ శాఖా మంత్రిగా పని చేశారు.