కేంద్ర మంత్రి బిశ్వేశ్వర్‌వి పార్లమెంటు సాక్షిగా పచ్చి అబద్ధాలు

  • గిరిజనుల మనోభావాలను దెబ్బతీశారు
  • అసెంబ్లీలో బిల్లు ఆమోదించినప్పుడు కిషన్‌ ‌రెడ్డి,  ఉత్తమ్‌ ‌కూడా ఉన్నారు
  • గిరిజనులపై ప్రేమ ఉంటే రాజ్యాంగ బద్దంగా రిజర్వేషన్లు కల్పించాలి
  • వైద్య,ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌ ‌రావు

ప్రజాతంత్ర , హైదరాబాద్‌ : ‌గిరిజనుల రిజర్వేషన్ల పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతిపాదనలు కేంద్ర మంత్రి బిశ్వేశ్వర్‌ ‌పార్లమెంటు సాక్షిగా పచ్చి అబద్దాలు ఆడారని రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీష్‌ ‌రావు అన్నారు. కేంద్ర మంత్రి భారత పార్లమెంటరీ వ్యవస్థను, రాజ్యాంగాన్ని అవమానపరిచారని విమర్శించారు. ఈమేరకు మంగళవారం హరీష్‌ ‌రావు తెలంగాణ భవన్‌లో మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. కేంద్ర మంత్రి మాటలు తెలంగాణ రాష్ట్ర గిరిజనుల మనోభావాలను అవమానపరిచే విధంగా ఉన్నాయనీ, తెలంగాణ వచ్చిన తొలి నాళ్లలోనే గిరిజనుల రిజర్వేషన్ల బిల్లును అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపడం జరిగిందని తెలిపారు. పార్లమెంటులో ప్రశ్న అడిగిన ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డికి సోయి లేదనీ, అసెంబ్లీలో గిరిజన బిల్లును ఆమోదించినప్పుడు ఆయన పీసీసీ అధ్యక్షుడనీ, ఎమ్మెల్యేగా ఉన్నారనీ, ఈ బిల్లుకు కాంగ్రెస్‌ ఆమోదం తెలిపిందని గుర్తు చేశారు. బిల్లులో భాగస్వామి అయిన ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి పార్లమెంటులో అడగడం సిగ్గుమాలిన చర్య లనీ, ఇది దిక్కుమాలిన ప్రశ్న అని మండిపడ్డారు. ఎప్పటిలోగా గిరిజన బిల్లును ఆమోదిస్తారని అడగాల్సింది పోయి సోయి తప్పి గిరిజన బిల్లు పెంపు ప్రతిపాదన మీకు వచ్చిందా అని అనుమానాస్పదంగా ఇవ్వడం శోచనీయమన్నారు.

ఇదే విషయంపై కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉత్తర  ప్రత్యుత్తరాలు కూడా జరిగాయనీ, ఇదే విషయాన్ని స్వయంగా సీఎం కేసీఆర్‌ ‌కూడా ప్రధాన మంత్రికి రాతపూర్వకంగా విజ్ఞప్తి చేయడం జరిగిందన్నారు. మంత్రి సత్యవతి రాథోడ్‌ ‌రెండు సార్లు లేఖ రాశారనీ, కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి కూడా ఈ బిల్లలో భాగస్వామి అనీ, బీజేపీ పక్ష నేతగా ఆయన కూడా మత్దతు పలికి ఆమోదించారని గుర్తు చేశారు. రాష్ట్ర అసెంబ్లీలో ఏకగ్రీవంగా బిల్లు ఆమోదించిన తరువాత మే 29 2017న శాసన సభ నుంచి కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు పంపించడం జరిగిందన్నారు. బీజేపీ ప్రభుత్వం ఐదేళ్లుగా గిరిజనుల హక్కులను కాలరాస్తున్నదనీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సీఎంపై పిచ్చి ప్రేలాపనలు, సొల్లు పురాణం మాట్లాడటం కాదు, చిత్తశుద్ధి ఉంటే గిరిజనుల బిల్లును ఆమోదింపజేయాలని ఈ సందర్భంగా మంత్రి హరీష్‌ ‌రావు సవాల్‌ ‌విసిరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page