వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

కేంద్ర రాజకీయాలు గతి తప్పాయి

April 3, 2019

16సీట్లు గెలిపిస్తే …దేశారాజకీయాలకు దిక్సూచి..!
అల్లాదుర్గ్ ‌సభలో సిఎం కెసిఆర్‌‌తెలంగాణలో 16 లోక్‌సభ సీట్లు గెలిపిస్తే కేంద్రంలో సరికొత్త రాజకీయాలకు దారిచూపడానికి తన శక్తిని వినియోగిస్తానని టిఆర్‌ఎస్‌ అధినేత, సిఎం కెసిఆర్‌ అన్నారు. గతితప్పిన కేంద్ర రాజకీయాలను దారికి తెచ్చుకుని అభివృద్దికి బాటలు వేస్తామని అన్నారు. సంగారెడ్డి జిల్లా అల్లాదుర్గంలో జహీరాబాద్‌ ‌పార్లమెంటరీ నియోజకవర్గ ఎన్నికల ప్రచార సభలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌మాట్లాడుతూ తెలంగాణలో అనేక సంక్షేమ,అభివృద్ది కార్యక్రమాలతో కొత్త ఒరవడిని చూపామని అన్నారు. దేశంలో ఏ నాయకుడు రైతుల గురించి పట్టించుకోలేదని సీఎం కేసీఆర్‌ ‌మండిపడ్డారు. అనుకున్న స్థాయిలో దేశం బాగుపడటం లేదు. ఈ దేశంలో మంచి జరగాలంటే మంచి ప్రభుత్వం రావాల్సి ఉందన్నారు. కాంగ్రెస్‌, ‌బీజేపీ ఒకరినొకరు నిందించుకుంటున్నారు. ఒకరు చోర్‌ అం‌టే ఇంకొకరు బడా చోర్‌ అం‌టరు. నరేంద్రమోదీపై కూడా ప్రజలకు చాలా ఆశ ఉండే. కానీ ఆయన కూడా అట్టర్‌ ‌ఫ్లాపయిండు. గత ఐదేళ్లు సంపూర్ణమైన మెజార్టీతో ఉన్న మోదీ ప్రభుత్వం ప్రజలకు ఏం చేసిందని సీఎం కేసీఆర్‌ ‌ప్రశ్నించారు. ఐదేళ్ల క్రితం తెలంగాణ ఎలా ఉందో ఇప్పుడెలా ఉందో చర్చ చేయాలన్నారు. ఎవరు ఏం చెప్పినా విని మంచి ఆలోచన చేయాలని సీఎం సూచించారు. కరెంట్‌ ‌కోసం చాలా బాధలు పడ్డం. ఆనాడు కరెంట్‌ ‌కష్టాలు ఎలా ఉండేవి. ఇపుడెలా ఉన్నాయి..దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. మిషన్‌ ‌భగీరథ పూర్తి కావొస్తుంది. తెలంగాణ రాష్ట్రం రాక పోతే..టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం రాకపోయి ఉంటే రైతు బంధు, రైతు బీమా ఉండేవికావన్నారు. రైతు బంధు కింద ఇక నుంచి ఏడాదికి రూ.10వేలు ఇస్తామన్నారు. చిన్నాపెద్దా అని తేడా లేకుండా రైతు బీమా అమలు చేస్తున్నమని చెప్పారు. ఎన్నికలు అనగానే ఆగమాగం కావొద్దని సూచించారు. 15 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నం. ఎన్నికలు చాలా వస్తయి..చాలా మందిని గెలిపించాం. ఏం జరిగితే రాష్ట్రానికి, దేశానికి మంచి జరుగుతుందో ఊరిలో చర్చ చేయాలన్నారు. ఆందోల్‌ ‌నియోజకవర్గంలో 40 వేల ఎకరాలకు సింగూరు నీళ్లిచ్చినట్లు వెల్లడించారు. నేను కూడా ఈ మట్టిలో పుట్టిన బిడ్డనే. ఆందోల్‌ ‌నియోజకవర్గంలో నేను ఎన్నిసార్లు పాదయాత్ర చేశానో ఇక్కడి ప్రజలకు తెలుసు. కరెంట్‌ ‌సమస్య తీరింది..తాగునీటికి కొరత లేదు. ఎర్ర నేలలు, నల్లనేలలు కలిగిన ప్రాంతమైన జహీరాబాద్‌ ‌లో మంచి పంటలు పండుతాయి. జహీరాబాద్‌ ‌నిమ్జ్ ‌పూర్తయితే 2 లక్షల మందికి ఉద్యోగాలు వస్తయి. నిమ్జ్ ‌పూర్తయితే జహీరాబాద్‌ ‌పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. జహీరాబాద్‌ ‌నియోజకవర్గంలో 7లక్షల ఎకరాలకు కాళేశ్వరం నీళ్లు వస్తాయని సీఎం తెలిపారు. సింగూరు ద లిప్ట్‌లు పెట్టి జహీరాబాద్‌ ‌లో లక్ష ఎకరాలు, నారాయణఖేడ్‌ ‌లో లక్ష ఎకరాలకు నీళ్లు ఇస్తం. ఆందోల్‌లో యువ జర్నలిస్టు క్రాంతి కిరణ్‌ ‌ను రు గెలిపించారు. ఆయనతోపాటు అందరూ ఉత్సాహంగా పనిచేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పంపూర్ణ మెజార్టీతో గెలిపించి అధికారమిచ్చారని సీఎం పేర్కొన్నారు. మాకు తెలంగాణ ప్రజలే బాసులు. వాళ్ల అవసరాలే మా ఎజెండా అని సీఎం కేసీఆర్‌ అన్నారు. జహీరాబాద్‌ ఎం‌పీ అభ్యర్తి బీబీ పాటిల్‌ ‌సౌమ్యుడు, విద్యావంతుడు, వివాదాలకు పోయే వ్యక్తి కారు.. అవినీతికి దూరంగా ఉండే వ్యక్తి. కేందప్రభుత్వంపై కూడా పోరాటం చేసే వ్యక్తి. బీబీ పాటిల్‌ను పెద్ద ఎత్తున వోట్లేసి భారీ మెజార్టీతో గెలిపించాలని సీఎం కేసీఆర్‌ ‌కోరారు. 16 ఎంపీ స్థానాల్లో టీఆర్‌ఎస్‌ను గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌, ఎం‌పి అభ్యర్థి బిబి పాటిల్‌ ‌తదితరులు పాల్గొన్నారు.