కేటీఆర్ తండ్రిని అడ్డం పెట్టుకొని రాజకీయాలకు వొచ్చారని, అలాంటివారు తమపై మాట్లాడితే పట్టించుకోమని కేంద్ర మంత్రి, బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లాలో మోదీ బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించిన కిషన్ రెడ్డి కేటీఆర్‌పై ఫైరయ్యారు. కెసిఆర్, కేటీఆర్‌లు రాష్ట్రాన్ని పరిపాలించలేని దద్దమ్మలని అన్నారు.
వారు ఇచ్చే సర్టిఫికెట్లు తమకు అవసరం లేదని, తమకు ప్రజలే సర్టిఫికెట్లు ఇచ్చారని అన్నారు. కెసిఆర్ కుటుంబానికి తొత్తులుగా ఉండేవారు, ఉండేటటువంటి వారు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా పనికి రారని గవర్నర్ తీసుకున్న నిర్ణయం మంచి నిర్ణయమని కిషన్ రెడ్డి అన్నారు. కవులు, కళాకారులు లాంటి వాళ్లని గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలుగా పెట్టాలి గానీ కెసిఆర్ అడుగులకు మడుగులొత్తే వారిని పెట్టకూడదనీ కిషన్ రెడ్డి మండిపడ్డారు.