పాతపద్దతినే మేమూ కొనసాగిస్తున్నాం
అభివృదింద్ధి చెందుతున్న దేశానికి అనుగుణంగా బడ్జెట్
విూడియా సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ
న్యూ దిల్లీ, జనవరి 31 : కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పూర్తి స్థాయి బ్జడెట్‌ను ప్రవేశపెడతామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయిన క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్ ముందు విూడియాతో మాట్లాడుతూ…భారత్ రోజురోజుకీ అభివృద్ధి దిశగా ముందడుగు వేస్తుందని, ఈ మధ్యంతర బడ్జెట్ అందుకు తగ్గట్టుగానే ఉంటుందని తెలిపారు. ప్రజల ఆశీర్వాదాలతో ఈ ప్రయాణం ఇలాగే కొనసాగుతుందని స్పష్టం చేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక పూర్తి స్థాయిబడ్జెట్‌ని ప్రవేశపెట్టే సంప్రదాయాన్నీ తాము అనుసరిస్తామని వివరించారు. మామూలుగా కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక పూర్తి స్థాయి బడ్జెట్‌ని ప్రవేశపెడతారని, తామూ అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నామని తెలిపారు. దేశానికి కొత్త దిశానిర్దేశం చేసే విధంగా ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఈ పద్దుని తయారు చేశారన్నారు.
రోజురోజుకీ భారత్ అభివృద్ధి దిశగా ముందడుగు వేస్తుందని తాను బలంగా విశ్వసిస్తున్నానని, సమ్మిళిత అభివృద్ధి కనిపిస్తుందన్నారు. ప్రజల ఆశీర్వాదాలతో ఇది కచ్చితంగా కొనసాగుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇదే సమయంలో నారీశక్తి గురించి ప్రధాని ప్రస్తావిస్తూ…రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంతో సమావేశాలు ప్రారంభం కావడం..నిర్మలా సీతారామన్ బ్జడెట్ ప్రవేశపెట్టడం నారీశక్తికి గొప్ప ఉదాహరణ అని అన్నారు. తొలిసారి కొత్త పార్లమెంట్ బిల్డింగ్‌లో బ్జడెట్ సమావేశాలు జరుగుతున్నాయని, నారీశక్తికి ఈ సమావేశాలు అద్దం పట్టనున్నాయని, జనవరి 26వ తేదీన రిపబ్లిక్ డే పరేడ్‌లోనే ఇది కనిపించిందని మోదీ అన్నారు. నిర్మలా సీతారామన్ చేతుల విూదుగా బ్జడెట్ ప్రవేశపెట్టడం నారీశక్తికి మరో సాక్ష్యమని అన్నారు. గత పార్లమెంట్ సమావేశాల్లో సభలో గందరగోళం సృష్టించిన ఎంపీలు ఓసారి ఆత్మపరిశీలన చేసుకోవాలని ఆయన సున్నితంగా హెచ్చరించారు. ప్రజాస్వామ్యాన్ని ముక్కలు చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. గత పార్లమెంట్ సమావేశాల్లో కొందరు ప్రతిపక్ష ఎంపీలు సభలో గందరగోళం సృష్టించారని, సభ సజావుగా సాగకుండా అడ్డుకున్నారని, అలాంటి వాళ్లంతా ఆత్మపరిశీలన చేసుకోవాలని, అలాంటి వాళ్లను ప్రజలు ఏ మాత్రం గుర్తు పెట్టుకోరని, ఈ సమావేశాలు సజావుగా సాగాలని కోరుకుంటున్నానని ప్రధాని మోదీ తెలిపారు.