అప్రమత్తం అయిన కేంద్ర ప్రభుత్వం
కేసుల పెరుగుదల, జీనోమ్ సీక్వెన్సీ, ఇన్‌ఫెక్షన్‌లపై దృష్టి
ఈ మూడింటిపై నిఘా పెట్టాలని కేంద్ర మంత్రి మాండవీయ సూచన
న్యూ దిల్ల్లీ,మార్చి17: చైనాలో మళ్లీ కొరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. కేంద్ర కుటుంబ సంక్షేమ, ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఆరోగ్య శాఖ కార్యదర్శి, ఎన్‌సీడీసీ చీఫ్, డ్రగ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా, డీబీటీ సెక్రెటరీ తదితరులు హాజరయ్యారు. ముఖ్యంగా మూడింటిపై దృష్టి సారించాలని మాండవీయ అధికారులను ఆదేశించారు. కేసుల పెరుగుదల, జీనోమ్ సీక్వెన్సీ, ఇన్‌ఫెక్షన్ పెరుగుదల.. ఈ మూడింటిపై నిఘా పెట్టాలని కేంద్ర మంత్రి మాండవీయ అధికారులను సూచించారు. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్నది. ఇటీవల తగ్గుతూ వచ్చిన మహమ్మారి తీవ్రత గత కొద్ది రోజులుగా పెరుగుతుండడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నది. ఒమిక్రాన్ సబ్ వేరియంట్ ముప్పు పెరుగు తున్నది. ఈ సబ్ వేరియంట్‌పై చైనా ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తున్నది. మంగళవారం 24 గంటల్లో 5,280 కొత్త కొరోనా కేసులు నమోదయ్యాయి. ఇదిలాఉంటే..
దేశంలో వ్యాక్సినేషన్ పక్రియ కూడా ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు దేశంలో 1,80,60,93,107 టీకా డోసులను పంపిణీ చేసినట్లు కేంద్రం వెల్లడించింది. 2020 ఫిబ్రవరి 12న చైనాలో అత్యధికంగా 14వేలకుపైగా కేసులు నమోదవగా.. రెండు రోజుల కిందట భారీ సంఖ్యలో కొత్త కేసులు నమోదవడం భయాందోళనకు గురి చేస్తున్నది. దేశ వ్యాప్తంగా నిన్న 7,52,818 కొరోనా నిర్దారణ పరీక్షలు చేశారు. వాటితో కలిపి ఇప్పటివరకు దేశంలో 78.05 కోట్ల పరీక్షలు చేసినట్లు వైద్య శాఖ తెలిపింది. చైనాతో పాటు పశ్చిమ యూరప్, బ్రిటన్, అమెరికాలో కేసులు కొత్త కేసులు పెరుగుతున్నాయి. కొరోనా కేసులు పెరుగుతున్నాయని వియత్నాం, జర్మనీ, దక్షిణ కొరియా, ఫ్రాన్స్‌లో కేసులు ఇప్పటికే ధ్రువీకరించాయి. ఇక్కడ రోజువారీ కేసులు ఒక్కసారిగా పెరుగుతున్నాయి. కేంద్రం మరోసారి అలర్ట్ ప్రకటించింది.స్కూల్స్ రీ ఓపెనింగ్, ఆఫీసులకు తిరిగి వెళ్తుండడం, మాస్క్ నిబంధనల సడలింపు కారణాల అయి ఉండొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. దీనికి తోడు వేడిమి పరిస్థితులతో జనాలు బయటే ఎక్కువగా తిరుగుతున్నారు. ఈ తరుణంలో.. వైరస్ విజృంభిస్తోందని అంచనా వేస్తున్నారు.