- అన్న కాంగ్రెస్.. బిజేపీ తమ్ముడు కి వోటెయ్యమంటడు..
- మునుగోడు టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో హైదరాబాదులో మంత్రి హరీష్ రావు సమావేశం
రాజీనామా ఎందుకు చేసిండు రాజీనామా ఎందుకు చేశాడో మళ్లీ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేస్తున్నాడు రాజగోపాల్ రెడ్డికి తెలియదు.. ఎవరి ప్రయోజనాల కోసం ఈ రాజీనామా..అని మంత్రి హరీష్ రావు ప్రశ్నిస్తూ.. అన్న కాంగ్రెెస్ లో ఉంటడు…తమ్ముడికి ఓటేయండి నేను పీసీసీ ప్రెసిడెంట్ అవుత అంటడు..ఇంత దిక్కు మాలిన రాజకీయమా… సీదా సీదా ఉండి కొట్లాడాలే..అని బిజేపీ పై నిప్పులు చెరిగారు.కోమటి రెడ్డి బ్రదర్సే కదా మంత్రులుగా ఎంపీలుగా, ఎమ్మెలుగా ఉన్నది. ఇన్నేళ్లు అధికారంలో ఉండి ఏం చేస్తున్నరు..అని ప్రశ్నిస్తూ.. “ఫోరైడ్ సమస్యకు పరిష్కారం చూపలేకపోయారు. .కృష్ణా నీటిని మిషన్ భగీరథ ద్వారా తెచ్చి శుద్ది చేసిన జలాలను మునుగోడులో ప్రతీ ఇంటికి ఇస్తోంది టీఆర్ఎస్ ప్రభుత్వం..బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండి ఏం చేసింది.
400 రూ. గ్యాస్ సిలిండర్ ను 1200 కు పెంచింది..డిజిల్, పెట్రోల్ ను 100 రూ దాటించింది..బీఎస్ఎన్ ఎల్ లో 75 వేల ఉద్యోగులను తొలగించింది..Lic, రైల్వే, విమానాశ్రయాలు, ఎయిర్ ఇండియా వంటి సంస్థలను తెగనమ్ముతోంది..నిరుద్యోగం పెంచింది..పేదల బతులను దుర్భరం చేసింది.. కులం మతం పేరుతో రెచ్చగొట్టి లబ్ధి పొందుతుంది తప్ప ఏ మేలు చేయలేదు..టీఆర్ఎస్‌ప్రభుత్వం రైతులకు ఉచిత విద్యుత్, రైతు బందు, రైతు బీమా, కల్యాణ లక్ష్మి, 2016 ఆసరా పెన్షన్, పది కేజీల ఉచిత బియ్యం, ఇలా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేసింది..అని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి , ఇతర నేతలు పాల్గొన్నారు.