రహస్య పొత్తులంటూ లీకులు
పైకి మాత్రం పోటాపోటీ రంకెలు
సై అంటే సై అంటూ చిందులు
టెన్షన్ పెడుతోన్న హంగ్ వార్తలు
పూర్తి మెజారిటీపై పలు ప్రశ్నలు
అందుకేనట చీకటి ఒప్పందాలు
నోరెళ్లబెడుతున్న ఊసరవెల్లులు
పార్టీల ఎన్నికల ప్రచారం ఉధృతంగా కొనసాగింది. బీఆర్ఎస్ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఉమ్మడి ఖమ్మం జిల్లా అశ్వరావు పేట, భద్రాచలం, పినపాక, వరంగల్ జిల్లా నర్సంపేట నియోజక వర్గాల బహిరంగ సభల్లో పాల్గొన్నారు. ‘‘దళితుల కోసం స్వాతంత్య్రం వొచ్చిన నాటి నుంచే స్పెషల్ గ్రోత్ ఇంజన్లు పెట్టి ఉంటే వాళ్ల బతుకులు ఇట్ల ఉండేది కాదు. వారిని వృద్ధిలోకి తెచ్చుకునేందుకే దళితబంధు పథకం తెచ్చినాం.10 సంవత్సరాల పరిస్థితి, బీఆర్ఎస్ పాలన మీ కండ్ల ముందు ఉంది …విచక్షణతో వోటు వేయాలని కేసీఆర్ సూచించారు. తన స్వంత నియోజకవర్గం కొడంగల్ ఎన్నికల ప్రచారం సందర్భంగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ ఇచ్చిన హామీలను బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని మండిపడ్డారు. పేదలపై వరాలు జల్లు కురిపించారు.