వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

‘గంగా’ నదీ ప్రక్షాళన.. ఖర్చు కాని నిధులు 82%

April 8, 2019

గంగా ప్రక్షాళన నిధులు ఖర్చు కాక పోవడానికి ప్రధాన కారణం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ ‌జైట్లీ నేతృత్వంలోని గంగా శుద్ధి నిధి(సిజిఎప్‌) ‌కమిటీ 2015 నుంచి ఇప్పటి వరకూ రెండు సార్లు మాత్రమే సమావేశమైంది. అదీ అసలు కారణమని సమాచార హక్కు చట్టం కింద హక్కుల ఉద్యమ కార్యకర్త ఒకరు అడిగిన ప్రశ్నకు లభించిన సమాధానం.గంగా ప్రక్షాళన నిధి ఏర్పాటు కోసం కేంద్ర మంత్రివర్గం 2014 సెప్టెంబర్‌లో ఆమోదాన్ని తెలిపింది. చివరికి ఆ నిధిని 2015 జనవరిలో ఏర్పాటు చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల నుంచి నిధులు సేకరించడం లక్ష్యంగా కార్యక్రమాన్ని రూపొందించారు. ప్రవాస భారతీయుల నుంచి కూడా నిధులు సేకరించాలని నిర్ణయించారు.
ఆ సంస్థ ఏర్పడిన నాటి నుంచి 2018 డిసెంబర్‌ ‌వరకూ ఈ నిధికి 243.27 కోట్ల రూపాయిలు విరాళాల రూపంలో వచ్చాయి. ఇంతవరకూ గంగానది ప్రక్షాళనకు 45.26 కోట్లను మాత్రమే ఖర్చు చేశారు. అంటే సేకరించిన మొత్తంలో 18 శాతం అన్న మాట.
గంగా ప్రక్షాళన కార్యక్రమంపై కంప్ట్రోలర్‌ అం‌డ్‌ ఆడిటర్‌ ‌జనరల్‌ ఆఫ్‌ ఇం‌డియా (కాగ్‌) ‌తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. వసూలు అయిందే కొద్ది మొత్తం. అందులో కూడా 18 శాతాన్ని కూడా ఖర్చు చేయలేకపోవడాన్ని ఆ శాఖ తప్పు పట్టింది. ఈ నిధి మొత్తాన్ని పెంచడానికీ, ఖర్చు చేయడానికి ఒక ప్రణాళికను రూపొందించాల్సిందిగా నేషనల్‌ ‌మిషన్‌ ‌ఫర్‌ ‌గంగా క్లీన్‌(ఎన్‌ఎం‌సిజి)ని కాగ్‌ ఆదేశించింది. ఈ సంస్థ పాలక మండలి(బోర్డు) ట్రస్టీలు తరచూ కలుసుకోకపోవడమే ఈ పథకం మూలబడటానికి ప్రధాన కారణం. ఈ బోర్డుకు ఆర్థిక మంత్రి అరుణ్‌ ‌జైట్లీ అధ్యక్షుడు కాగా, ఆర్థిక వ్యవహారాలు, నీటి వనరులు, నదుల అభివృద్ది, ప్రవాస భారతీయుల శాఖ కార్యదర్శులు, సీఈఓలు సభ్యులు. క్లీన్‌ ‌గంగా ప్రాజెక్టులను ఆమోదించడం ఈ బోర్డు బాధ్యత. ట్రస్టీల సమావేశం జరగలేదని ఆర్టీఐ చట్టం ప్రకారం అడిగిన ప్రశ్నకు లభించిన సమాధానం. ట్రస్టీల సమావేశాలు జరగకపోవడం వల్ల గంగ శుద్ది ప్రాజెక్టులకు ఆమోదం లభించడం లేదు. నిధులు అందడం లేదు. ట్రస్టీల తొలి సమావేశం 2015 మే 29వ తేదీన జరిగింది. ఆ తర్వాత మళ్ళీ 2018 మే నాలుగవ తేదీన జరిగింది.
ఈ మధ్య కాలంలో ట్రస్టీలు అందుబాటులో లేకపోవడం వల్ల సమావేశాలు జరగలేదని అందిన సమాచారంలో స్పష్టం అయింది. ఆర్థిక మంత్రికి తీరిక లేకపోవడం వల్ల బోర్డు సమావేశం జరగలేదని స్పష్టం అయింది. పాలనా పరమైన కారణాల వల్ల మాత్రం కాదని కూడా స్పష్టం అయింది. నిబంధనల ప్రకారం ప్రతి మూడు నెలలకు ఓ సారి బోర్డు సమావేశం జరగాలి. అంతేకాక, బోర్డు సభ్యుల్లో మెజారిటీ సభ్యులు హాజరైనప్పుడు మాత్రమే సమావేశాన్ని నిర్వహించాలి.
2018 మే 4వ తేదీన జరిగిన బోర్డు సమావేశంలో 29.99 లక్షల వ్యయాన్ని ఆమోదించారు. నేషనల్‌ ‌మిషన్‌ ‌ఫర్‌ ‌గంగా క్లీన్‌ ‌డైరక్టర్‌ ‌జనరల్‌ ‌విదేశీ పర్యటనలో ఉన్నందున ఇందుకు సంబంధించిన వివరాలను తాను తెలియజేయలేనని ఆ సంస్థ కమ్యూనికేషన్‌ ‌విభాగానికి చెందిన సంజమ్‌ ‌చీమా అన్నారు.
నీటి వనరుల శాఖ నుంచి అందిన సమాచారం ప్రకారం ప్రభుత్వరంగ సంస్థలు ఈ నిధికి పెద్ద మొత్తంలో విరాళాలు ఇచ్చాయి. వచ్చిన విరాళాల్లో 83 శాతం అంటే 202.31 కోట్లు ప్రభుత్వ రంగ సంస్థల నుంచే వచ్చాయి. మరో వంక ప్రైవేటు సంస్థల నుంచి 26.12 కోట్లు మాత్రమే వచ్చాయి. ఈ నిధికి అతి తక్కువ విరాళం ప్రవాస భారతీయుల నుంచి. వీరి నుంచి 3 కోట్ల 89 లక్షలు విరాళంగా ఇచ్చాయి. విదేశాల్లో స్థిరపడిన ప్రవాస భారతీయుల నుంచి విరాళాలను సేకరించాలన్నది ఈ సంస్థ ముఖ్యోద్దేశ్యం. విదేశాంగ శాఖతో కలిసి ఎన్నారైల నుంచి విరాళాల సేకరణ కార్యక్రమాన్ని రూపొందిస్తున్నట్టు కాగ్‌కు నేషనల్‌ ‌మిషన్‌ ‌ఫర్‌ ‌గంగా క్లీన్‌ ‌డైరక్టర్‌ ‌జనరల్‌ ‌తెలిపారు. విదేశాల్లో నిధుల సేకరణ కోసం ఒక నిధిని ప్రభుత్వం ఇంత వరకూ ఏర్పాటు చేయలేదు. పలు ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నా గంగ శుద్ధికి ప్రభుత్వం ఖర్చు చేయడం లేదు. ఉత్తరా ఖండ్‌, ఉత్తర ప్రదేశ్‌, ‌జార్ఖండ్‌, ‌బీహార్‌, ‌పశ్చిమ బంగాలలో గంగానది ఒడ్డున సామాజిక అడవుల పెంపకానికి 87.84 కోట్లను ఖర్చు చేశారు. ఐదు డ్రెయిన్ల క్షాళనకు 19 కోట్లు ఖర్చు చేశారు. నది పరీవాహక ప్రాంతంలో గట్లను పటిష్టం చేయడానికి 98.30 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఉత్తరాఖండ్‌ ‌పర్యాటక శాఖ నిర్వహించే గౌరీ కుండ్‌ ‌ప్రాజెక్టుకు కూడా నిధులు ఖర్చు చేయాలని నిర్ణయించారు.
ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఈ ప్రాజెక్టుపై శ్రద్ధ తీసుకోవడం లేదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆయన అధ్యక్షతన గంగ ప్రక్షాళన బోర్డు సమావేశం ఒక్కటి కూడా జరగలేదు. నిబంధనల ప్రకారం ఏడాదికి ఒక్క సారైనా ఈ బోర్టు సమావేశం కావాలి. నీటి వనరుల శాఖ ఉన్నతాధికార కమిటీ రెండు సార్లు మాత్రమే సమావేశం అయింది. మోడీ ప్రభుత్వం ఐదేళ్ళ కాలంలో గంగానది ప్రక్షాళన గురించి పెద్దపెద్ద కబుర్లయితే చెప్పింది కానీ, ఈ కార్యక్రమం ఒక్క అడుగూ ముందుకు పడలేదు.
కాలుష్య నివారణ విషయంలోనూ శ్రద్ధ తీసుకోవడం లేదు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి 2017-18 నివేదికను విడుదల చేసింది. గంగ కాలుష్య నియంత్రణ కార్యక్రమాలు ఆశించిన రీతిలో సాగడం లేదని ఆ నివేదికలో మండలి అంగీకరించింది.

– ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్