సిఎంకు శుభాకాంక్షల వెల్లువ
హైదాబాద్, ప్రజాతంత్ర, జనవరి 1 : రాజ్ భవన్లో గవర్నర్ తమిళిసైకి సీఎం రేవంత్ రెడ్డి న్యూ ఇయర్ విషెస్ చెప్పారు. రాజ్ భవన్లో నిర్వహించిన ఓపెన్ హౌస్ కార్యక్రమానికి హాజరైన రేవంత్ గవర్నర్ దంపుతలకు పుష్ఫగుచ్చం ఇచ్చి విషెస్ చెప్పారు. సీఎంగా రేవంత్ రాజ్ భవన్‌కు వెళ్లడం ఇదే తొలిసారి. రేవంత్ వెంట మంత్రులు కొండా సురేఖ, సీతక్క, స్పీకర్ గడ్డం ప్రసాద్ ఉన్నారు.
అంతకుముందు సెక్రటేరియట్లో కొత్త ఏడాది హంగామా కనిపించింది. సీఎం రేవంత్ రెడ్డిని కలిసి విషెస్ చెప్పారు మంత్రులు. మంత్రి సీతక్క రేవంత్‌ను కలిసి విషెస్ చెప్పారు. ఇందిరాగాంధీ ఫోటోను రేవంత్‌కు బహుమతిగా ఇచ్చారు. అధికారులు, మినిస్టర్స్, పరస్పరం న్యూఇయర్ విషెస్ చెప్పుకున్నారు. మరోవైపు సీఎంను కలిసేందుకు జనం క్యూకట్టారు. సెక్రటేరియట్ చుట్టూ సీఎం రేవంత్ కటౌట్స్ ఏర్పాటు చేశారు.