ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 12 : గృహనిర్బంధాలతో ఉద్యమాలను ఆపలేరని బహుజన్ సమాజ్ పార్టీ, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డా. ఆర్. ఎస్. ప్రవీణ్ కుమార్ ను అక్రమంగా గృహ నిర్భంధం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని బీఎస్పీ కల్వకుర్తి తాలూకా అధ్యక్షుడు బి. చందు అన్నారు. శనివారం ఆమనగల్ మండల అధ్యక్షుడు కొప్పు శ్రీశైలం ఆధ్వర్యంలో ఆమనగల్ పట్టణంలో హైదరాబాద్ శ్రీశైలం జాతీయ రహదారిపై నిరసన కార్యక్రమం చేశారు. ఈ సందర్భంగా చందు మాట్లాడుతూ తెలంగాణలో 6లక్షల మంది గ్రూప్-2 నిరుద్యోగ అభ్యర్థులకు న్యాయం చేయడం కోసం – సత్యాగ్రహా దీక్ష చేయడం తప్పా..? అని ప్రశ్నించారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో త్యాగం ఎవరిది భోగం ఎవరిదని ప్రశ్నించారు. ఒకే సమయంలో ఇన్ని పరీక్షలు పెడితే అభ్యర్థులు ఎలా ప్రిపేర్ అవుతారని ప్రశ్నించారు. తెలంగాణలోని యువత అంతా వచ్చే ఎలక్షన్లో ఆర్ఎస్పి కీ అండగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో తలకొండపల్లి మండల అధ్యక్షులు పబ్బతి శ్రీశైలం, వెల్దండ మండల అధ్యక్షుడు అనిల్, మాడుగుల మండల అధ్యక్షుడు కొండల్ యాదవ్, తలకొండపల్లి మండలం ఉపాధ్యక్షుడు తోటపల్లి మల్లేష్, సీనియర్ నాయకులు బద్ది వెంకటేష్, దన్నారం బాలు, బద్దిరాజు అసెంబ్లీ కన్వీనర్ గోరటి శ్రీశైలం, కోకన్వీనర్ మస్కరాజు, కొప్పు రాజు, గిరి, శంకర్ తదితరులు పాల్గొన్నారు.