మహేశ్వరం అర్బన్, ప్రజాతంత్ర డిసెంబర్ 20: వంట గ్యాస్ కోసం కేవైసీకి వివరాలు సమర్పించేందుకు వినియోగదారులు అనవసరంగా కంగారు పడవద్దని గడువులోగా సమర్పించే అవకాశం ఉందని
పౌరసరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసిల్దార్ మాచన రఘునందన్ స్పష్టం చేశారు. బుధవారం ఆయన తుక్కుగూడ వురపాలక కేంద్రంలో జాతీయ రహదారిపై ఉన్న
వినియోగదారుల సేవా కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈసందర్భంగా రఘునందన్ మాట్లాడుతూ ఉజ్వల గ్యాస్ వినియోగదారుల కేవైసీ నమోదుకు ఈనెల డిసెంబరు ఆఖరు వరకు గడువు
ఉందని తెలిపారు. అలాగే సాధారణ గ్యాస్ వినియోగదారులు వచ్చే ఏడాది మార్చి వరకు తమ వివరాలు సమర్పించే వెసులుబాటు ఉందన్నారు. కేవైసీ కి ఎటువంటి రుసుము
చెల్లించనవసరం లేదని స్పష్టం చేశారు. ఒక వేళ ఎవరైనా ఎక్కడైనా అక్రమంగా డబ్బు వసూలు చేస్తే పోలీసులకు స్థానిక తహసీల్దార్‌కు ఫిర్యాదు చేయాలని డిటీ రఘునందన్ సూచించారు.