చంద్రశేఖర్‌ ‌గురూజీ హత్యపై సమగ్ర దర్యాప్తు

  • ఇప్పటికే ఇద్దరునిందితుల పట్టివేత
  • కారాణలపై లోతుగా అధ్యయనం చేస్తున్న పోలీసులు

బెంగళూరు, జూలై 6 : అందరూ చూస్తుండగానే వాస్తు నిపుణుడుగా పేర్కొనే చంద్రశేఖర్‌ ‌గురూజీ కర్ణాటకలోని ఓ హోటల్‌లో మంగళశారం దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటనపై పోలీసులు ముమ్మర దర్యాప్తు చేపట్టారు. ఆయనను ఎందుకు హత్యచేసి ఉంటారన్న దానిపై కూపీ లాగుతున్నారు. ఆయన ఉంటున్న  హోటల్‌కి వచ్చినవారు చూస్తుండగా కత్తులతో ఇద్దరు వ్యక్తులు ఆయనను పొడిచి చంపారు. హోటల్‌లోని సిసిటివిలో రికార్డయిన ఈ వీడియో సోషల్‌‌డియాలో వైరల్‌గా మారింది. హుబ్లి జిల్లాలోని ఒక ప్రైవేట్‌ ‌హోటల్‌లో మంగళవారం ఈ ఘటన జరిగింది. నిందితులకోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వాస్తు నిపుణుడి కోసం కోసం భక్తుల్లా వేచిచూస్తున్న ఇద్దరు వ్యక్తులు కత్తులతో పొడిచి చంపారు.

అనంతరం హోటల్‌ ‌నుండి పారిపోయారు. బాగల్‌ ‌కోట్‌కు చెందిన చంద్రశేఖర్‌ ‌వ్యక్తిగత పనుల నిమిత్తం హుబ్లికి వచ్చినప్పుడు ఈ దారుణం జరిగింది. సరళవాస్తు ద్వారా రాష్ట్రంతో పాటు పలు రాష్టాల్ల్రో ఖ్యాతి పొందిన చంద్రశేఖర్‌ ‌గురూజీ దారుణ హత్య కలకలం రేపింది. ఆయన శిష్యులే ఈ ఘాతుకానికి పాల్పడ్డారా అన్నది కూడా దర్యాప్తు చేస్తున్నారు. అయితే చంద్రశేఖర్‌ ‌దగ్గర పని చేస్తున్న మహంతేష్‌ ‌శిరూర్‌, ‌మంజునాథలను నిందితులుగా గుర్తించారు. వీరిలో గురూజీకి ఒకరు కాళ్లకు మొక్కుతున్నట్లుగా నటించగా, మరొకరు చాకుతో పొడిచాడు. కిందకు పడినా కూడా వదలకుండా సుమారు 40 సార్లకు పైగా కత్తితో పొడిచి హోటల్‌ ‌నుంచి తప్పించుకున్నారు.  పోలీసులు వెంటాడి బెళగావి జిల్లా రామదుర్గ వద్ద  ఈ ఇద్దరు నిందితులను అరెస్ట్ ‌చేశారు. హత్య జరిగిన 4 గంటల్లోనే నిందితులు పట్టుబడ్డారు. హుబ్లీ పోలీస్‌ ‌కమిషనర్‌ ‌లాభురాం మాట్లాడుతూ గురూజీ ప్రెసిడెంట్‌ ‌హోటల్లో బస చేశారు. ఇద్దరు వ్యక్తులు వచ్చారని తెలిసి వారిని కలవడానికి లాబీలోకి వచ్చారు.

ఈ సమయంలో కత్తితో దాడి చేసి పరారయ్యారు అని చెప్పారు. ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. హత్య దృశ్యాలు హోటల్‌ ‌సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. హత్యకు ఆస్తి వివాదమే కారణమని చెబుతున్నారు. చంద్రశేఖర్‌ ‌గురూజీ శిష్యుల పేరిట బినా ఆస్తులు పెట్టారని, నిందితుడు మహంతేష్‌ ‌పేరున కోట్లాది రూపాయల ఆస్తి చేశారని చెబుతున్నారు. ఉద్యోగం నుంచి తొలగించాక తన ఆస్తిని తిరిగి ఇచ్చేయాలని గురూజీ ఒత్తిడి చేసేవాడు. అయితే తిరిగి ఇవ్వడం కుదరదని మహంతేష్‌ ‌తెగేసి చెప్పాడు. ఇదే విషయమై మాట్లాడడానికి హోటల్‌కు వచ్చి ఆయన్ను హత్య చేశారు.  యూట్యూబ్‌లో ఆయన వీడియోలకు లక్షలాది వ్యూస్‌ ‌రావడం బట్టి ఆయన ప్రజాదరణ ఏమిటో అర్థమవుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page