చట్టబద్దంగానే విద్యుత్‌ కొనుగోళ్లు

 రాష్ట్రంలో నిరంతర విద్యుత్‌ కోసం కృషి
 ఈఆర్‌సి నిబంధనలు కాదని కమిషన్‌ వేయడం చట్టవిరుద్ధం
 మా ప్రభుత్వానికి దురుద్దేశాలు అంటకట్టే ప్రయత్నాలు సరికాదు
 కమిషన్‌ ముందుకు వొచ్చి వివరణ ఇవ్వాల్సిన పనిలేదు
 వీలైతే మీరు రాజీనామా చేసి వెళ్లిపోండి
 జస్టిస్‌ ఎల్‌. నర్సింహారెడ్డి కమిషన్‌కు కేసీఆర్‌ లేఖ

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 15 : విద్యుత్‌ కొనుగోలు, పవర్‌ ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో అన్ని రకాల చట్టాలు, నిబంధనలు పాటిస్తూ ముందుకెళ్లామని బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ తెలిపారు. కేంద్ర, రాష్ట్ర అనుమతులు సాధిస్తూ ముందుకెళ్లామని చెప్పారు. ఈఆర్‌సీ సంస్థలు వెలువరించిన తీర్పులపై కమిషన్లు వేయకూడదన్న విషయం కూడా రేవంత్‌ రెడ్డి ప్రభుత్వానికి తెలియదా అని ప్రశ్నించారు. కమిషన్‌ చట్టవిరుద్ధమని ప్రభుత్వానికి సూచించకుండా బాధ్యతలు స్వీకరించడం విరుద్ధమని చెప్పారు. రాజకీయ కక్షతోనే విచారణ కమిషన్‌ ఏర్పాటు చేశారన్నారు. విద్యుత్‌ కొనుగోలు విషయంలో జస్టిస్‌ ఎల్‌. నర్సింహారెడ్డి కమిషన్‌కు కేసీఆర్‌ వివరణ ఇచ్చారు. ఈమేరకు కమిషన్‌కు కెసిఆర్‌ రాసిన 12 పేజీల లేఖలో…రాష్ట్రం ఏర్పడినప్పుడు విద్యుత్‌ రంగం సంక్లిష్ట పరిస్థితుల్లో ఉందని, కరెంటు సరిగా లేక లక్షలాదిగా వ్యవసాయ పంపుసెట్లు కాలిపోయిన పరిస్థితి ఉందని, పారిశ్రామిక రంగంలో ప్రతి వారంలో కొన్ని రోజులు పవర్‌ హాలిడే ప్రకటించారని, విభజన చట్టం ప్రకారం తెలంగాణకు ఇచ్చిన కరెంటు ఏమాత్రం సరిపోదని, తెలంగాణ విద్యుత్‌ పంపిణీ వ్యవస్థ పటిష్ఠానికి నిర్మాణాత్మక చర్యలు తీసుకున్నామని, అన్ని రకాల అనుమతులు పొంది మందుకు పురోగమించడం జరిగిందని, రాజకీయ కక్షతో తనను, అప్పటి ప్రభుత్వాన్ని అప్రతిష్టపాల్జేయడానికే కమిషన్‌ వేశారని ఆరోపించారు.

తమ ప్రభుత్వం గణనీయ మార్పుతో కరెంటు ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందేనని, తమ మార్పును తక్కువ చూపించేందుకే ప్రస్తుత ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందని అన్నారు. పత్రికా విలేకఖరుల సమావేశంలో కమిషన్‌ ఇష్టమొచ్చినట్లు మాట్లాడిరదని, విచారణ అనేది ఒక పవిత్రమైన బాధ్యత అని, ఇరుపక్షాల మధ్య మధ్యవర్తిగా నిలిచి నిజాలు నిగ్గుతేల్చాలని, అన్ని కోణాల్లో సమగ్రంగా పరిశీలించి నిర్ణయాలు వెల్లడిరచాలని, కానీ ఈ కమిషన్‌ గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా రిపోర్టు ఇవ్వాలని మాట్లాడుతున్నట్లుందని కెసిఆర్‌ పేర్కొన్నారు. ఇప్పటికే నష్టం జరిగినట్లు.. ఆర్థిక    నష్టాన్ని లెక్కిస్తున్నట్లు వారి మాటలు ఉన్నాయని, విచారణలో నిష్పాక్షికత ఎంతమాత్రం కనిపించట్లేదని, తాను కమిషన్‌ ముందు హాజరై ఏం చెప్పినా ప్రయోజనం ఉండదని, తాము చెప్పిన అంశాలను పరిగణనలోకి తీసుకుని వైదొలిగితే మంచిదని కెసిఆర్‌ తన లేఖలో తెలిపారు. వారు కమిషన్‌ బాధ్యతల నుంచి వైదొలగాలని వినయ పూర్వకంగా కోరుతున్నానంటూ కేసీఆర్‌ లేఖలో పేర్కొన్నారు.  పరిస్థితులను గమనించే నాటి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ విద్యుత్తు అవసరాల దృష్ట్యా విభజన చట్ట ప్రకారం తెలంగాణకు ఇచ్చిన కరెంటు ఎంతమాత్రం సరిపోదని, 2014 నాటి వినియోగాన్ని బట్టి దాదాపు 2,700 మెగావాట్ల కొరత ఉంది.

నాటి ఆంధప్రదేశ్‌ కరెంట్‌ సరఫరాను ఎగవేయడం వల్ల 1,500 మెగావాట్లు, గ్యాస్‌ ఆధారిత విద్యుత్తు రాకపోవడం వల్ల 900 మెగావాట్లు కలిపి మరో 2,400 మెగావాట్ల లోటు ఏర్పడిరదని, మొత్తవ్మిద సుమారు 5,000 మెగావాట్ల కొరతతో తెలంగాణలోని విద్యుత్తు రంగంలో తీవ్ర సంక్షోభం ఏర్పడిరదని, విద్యుత్తు సంక్షోభం నుంచి గట్టెక్కడానికి శాశ్వత ప్రయోజనాల కోసం విద్యుత్తు పంపిణీ వ్యవస్థను పటిష్ఠపరచామని, ఫలితంగానే రాష్ట్రం ఆవిర్భవించినప్పుడు 7,778 మెగావాట్లుగా ఉన్న రాష్ట్ర స్థాపిత విద్యుత్తు, తర్వాత సుమారు 20,000 మెగావాట్లపైచిలుకుకు చేరిందని, దేశంలోనే నాణ్యమైన నిరంతరాయ కరెంటు అన్ని రంగాలకూ సరఫరా చేసిన ఏకైక రాష్ట్రంగా మారిందని కెసిఆర్‌ వివరించారు  2014 నాటికి తెలంగాణ తలసరి విద్యుత్తు వినియోగం 1,196 యూనిట్లు ఉండగా, పదళ్లలో అది 2,349 యూనిట్లకు పెరిగిందని, ఈ విజయాలు ఆషామాషీగా సాధించలేదని, విద్యుత్తు కొనుగోళ్ల విధానంలో, నూతన విద్యుదుత్పత్తి కేంద్రాల ఏర్పాటులో చట్టాలను, నిబంధనలను పాటించామని, ఎలక్ట్రిసిటీ యాక్ట్‌ 2003ను అనుసరిస్తూ అవసరమైన అన్ని రకాల అనుమతులను పొంది ఎస్‌ఇఆర్‌సి తీర్పులకు లోబడే చర్యలూ తీసుకున్నామని, దీనిపై అభ్యంతరాలు ఉంటే ఇఆర్‌సిలో ఫిర్యాదు చేయవొచ్చునని, దీనిపై తీర్పు నచ్చకుంటే అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌కు అప్పీలు చేసుకోవచ్చునని కెసిఆర్‌ తన లేఖలో పేర్కొన్నారు.

ఛత్తీస్‌గఢ్‌ నుంచి రాష్ట్ర విద్యుత్తు సంస్థలు కరెంటు కొనుగోలు చేయడంపై నాటి తెలుగుదేశం ఎమ్మెల్యేగా రేవంత్‌ రెడ్డి తెలంగాణ ఇఆర్‌సికి అభ్యంతరాలు చెప్పారని, వాటిని పరిశీలించిన తర్వాతే తెలంగాణ విద్యుత్తు సంస్థలు చేసిన ప్రతిపాదనలకు ఇఆర్‌సి ఆమోదముద్ర వేసిందని, అప్పుడు అభ్యంతరం ఉండి ఉంటే అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌కు లేదా ఇతర కోర్టులకు వెళ్లే స్వేచ్ఛ ఉందని, కానీ ఆయన ఆనాడు ఎలాంటి అప్పీలుకూ వెళ్లిన దాఖలాలు చేయలేదని, రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత విద్యుత్తు విజయాలను సాధించిన గత ప్రభుత్వానికి దురుద్దేశాలను ఆపాదిస్తూ శ్వేతపత్రాలు విడుదల చేశాని, వాటిపై చర్చలు జరిగాయని తెలిపారు. రెగ్యులేటరీ సంస్థల తీర్పులపై విచారణ చేయొద్దన్న ఇంగితం లేకండా కమిషన్‌ ఏర్పాటు చేశారని, హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించిన వ్యక్తి కూడా న్యాయ ప్రాధికార సంస్థల తీర్పులపై ఎంక్వైరీ చేయొద్దని సూచించకుండా బాధ్యతలు స్వీకరించడం విచారకరమని, చట్టవిరుద్ధంగా విచారణ ప్రారంభించి, అనేక విషయాలను సమగ్రంగా పరిశీలించకుండానే, పరిగణనలోకి తీసుకోకుండానే పలు అంశాలపై అసంబద్ధమైన వ్యాఖ్యలు చేశారని, వాటిపై తన అభ్యంతరాలను వారికి తెలియజేస్తున్నానని కెసిఆర్‌ తన లేఖలో వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page