చట్టాలు ఎవరికి చుట్టమో ప్రజలకు తెలుసు !

 ‌దేశంలో ఇప్పటికీ ఓ వందమంది ప్రముఖులు-న్యాయవాదులు, సామాజిక కార్యకర్తలు, పత్రికా విలేకరులు, సాంఘిక మాధ్యమంలో ప్రముఖులు, కార్మిక నాయకులు, విద్యార్థి నాయకులు, కవులు, రచయితలు, కళాకారులు వంటి వారు-ఏళ్ల తరబడి జైళ్లలో మగ్గుతున్నారు.90 శాతం వికలాంగుడైన ప్రొఫెసర్‌ ‌సాయిబాబా, ప్రముఖ న్యాయవాది సుధా భరద్వాజ్‌, ‌కవి రచయిత వరవర రావు, విద్యావేత్త స్వయానా డాక్టర్‌ ‌బి.ఆర్‌. అం‌బేడ్కర్‌  ‌మనవడు ఆనంద్‌ ‌తెల్తుంబ్డే, రోనా విల్సన్‌, ‌గౌతమ్‌ ‌నవలఖ,
సాగర్‌ ‌గోర్కే, రన్‌ ‌హైదర్‌ ‌వంటి వారి ద పెట్టిన కేసులు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది.

దేశంలో అనేక ఏళ్లతరబడి కేసులు తేలడం లేదు. ఎందుకు తేలడం లేదో పాలకులు గానీ, న్యాయస్థానాలు కాని చెప్పడం లేదు. కేసుల విషయంలో ఏళ్లతరబడి వేచి చూసే కేసులు కోకొల్లలు. సామాన్యులకు సంబంధించిన కేసులు ఏళ్లతరబడి మూలుగుతున్నాయి. ఇకపోతే ఇచ్చిన తీర్పులు కూడా అమలు చేయడంలో పాలకులు కుట్రపూరిత విధానాలు అమలు చేస్తున్నారు. తమకు ఇష్టం లేని తీర్పులను అమలు చేయడం లేదు. దీనిపై కోర్టులు కూడా నిలదీయలేక పోతున్నాయి. మరోవైపు అధికారంలో ఉన్నవారు.. లేదా లేక తమ ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్న పార్టీల నాయకులపై తమ చేతుల్లో ఉన్న నిఘా సంస్థల ద్వారా కేసులు పెట్టడం కూడా గతంలో చూశాం…ఇప్పుడూ చూస్తున్నాం..ఇకముందు కూడా చూస్తాం.. అయితే కేంద్రంలోని బిజెపి సర్కారు పాలనలో ఇది మరింత తీవ్రంగా వుందన్న విమర్శలు ఉన్నాయి. నిఘా సంస్థలను, దర్యాప్తు సంస్థలను బిజెపి దుర్వినియోగం చేస్తోందని విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఈ క్రమంలోనే రాష్టాల్ల్రో ఉన్న పాలకులు కూడా తమ చెప్పు చేతల్లో ఉన్న దర్యాప్తు సంస్థలను కూడా దుర్వినియోగం చేయడం చూస్తూనే ఉన్నాం.
కేంద్రంలో బిజెపి ప్రభుత్వానికి లొంగిపోతే ఫర్వాలేదు. కాని ఏమాత్రం వ్యతిరేకంగా వున్నా వారిపై ఇ.డి, సిబిఐ, ఐ.టి…ఇలా ఎన్నో దాడులు తప్పడం లేదని స్వయానా ఆయా రాష్టాల్ర పార్టీలు, ప్రతిపక్ష పార్టీల నేతలు ఆరోపిస్తున్నాయి. నయా ఉదారవాద విధానాలు వొచ్చాక రాజకీయ నాయకులు, పెట్టుబడిదారుల మధ్య విడదీయరాని బంధం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ప్రత్యర్థులను వేటాడడానికి, లొంగదీసుకోవడానికీ పాలకులు దర్యాప్తు సంస్థలను యథేచ్ఛగా వాడుకుంటు న్నారు. ఏది ఏమైనా ఏ కేసులూ దాదాపు నిలబడడం లేదు. లాలూ యాదవ్‌ ‌కేసునే తీసుకుంటే ఏళ్ల తరబడి దర్యాప్తులు సాగుతున్నాయి. అసలు కేసులే ఏళ్ల తరబడి నడుస్తుంటాయి. తీర్పులు వొచ్చే నాటికి పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. అదే సమయంలో వాటిపై ప్రజల ఆసక్తి కూడా తగ్గిపోతుంది. పాలక పార్టీల కోరిక, ప్రయత్నం కూడా అదేకావడం మనం గమనించవచ్చు. ఈ క్రమంలో చట్టాల గురించి, న్యాయస్థానాల గురించి మధ్యతరగతి, ఉన్నత వర్గాలలో పెద్ద చర్చే జరుగుతుంటుంది. తప్పు చేసిన వాడు ఎన్నటికీ తప్పించుకోలేడని, చట్టం ముందు అందరూ సమానులేనని, కింది కోర్టులో కాకపోతే పైకోర్టులో తప్పక న్యాయం జరుగుతుందని అంతా భావించి సరిపుచ్చుకుంటున్నారు.
 న్యాయస్థానాలు స్వతంత్రంగా వ్యవహరిస్తుంటాయని, రాజకీయ ప్రలోభాలకు లోనుకావని… ఇలా అనేక వాదనలు ముందుకు వొస్తున్నాయే తప్ప అసలు ఏం జరుగుతుందో తప్ప ఎవ్వరికీ అంతు చిక్కడం లేదు. దేశంలో ఇప్పటికీ ఓ వందమంది ప్రముఖులు-న్యాయవాదులు, సామాజిక కార్యకర్తలు, పత్రికా విలేకరులు, సాంఘిక మాధ్యమంలో ప్రముఖులు, కార్మిక నాయకులు, విద్యార్థి నాయకులు, కవులు, రచయితలు, కళాకారులు వంటి వారు-ఏళ్ల తరబడి జైళ్లలో మగ్గుతున్నారు. 90 శాతం వికలాంగుడైన ప్రొఫెసర్‌ ‌సాయిబాబా, ప్రముఖ న్యాయవాది సుధా భరద్వాజ్‌, ‌కవి రచయిత వరవర రావు, విద్యావేత్త స్వయానా డాక్టర్‌ ‌బి.ఆర్‌. అం‌బేద్కర్‌ ‌మనవడు ఆనంద్‌ ‌తెల్తుంబ్డే, రోనా విల్సన్‌, ‌గౌతమ్‌ ‌నవలఖ, సాగర్‌ ‌గోర్కే, రన్‌ ‌హైదర్‌ ‌వంటి వారి ద పెట్టిన కేసులు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ప్రభుత్వాలను కూలదోసేవారుగా, ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకో బడ్డ ప్రభుత్వాలను తుపాకీతో స్వాధీనం చేసుకుంటారని వారిపై ప్రధాన అభియోగం మోపారు.
రాజద్రోహం కేసులను ఆపాదించారు. రాజకీయ నాయకుల ద పెట్టిన అభియోగాలు వేలకోట్ల రూపాయల ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశారని కేసులు పెడుతున్నారు. కానీ అణగారిన, దళిత, గిరిజన, మైనారిటీ, మహిళల గురించి మాట్లాడే వాళ్లు, రాసేవాళ్లు కనిపించరు. ఇదంతా ఒక ఎత్తయితే అన్యాయంగా కేసుల్లో ఇరికించి జైళ్లకు తోసేసిన వారు వేలాదిమంది ఉన్నారు. వారికి విచారణ, బెయిల్‌ ‌లాంటివి దక్కడం లేదు. వారిగురించి ప్రస్తావించే పాలకులు కానరారు. వారికి జరుగుతన్న అన్యాయాన్ని ప్రశ్నించేదెవర్నదే ప్రశ్న. గత కొద్ది నెలల క్రితం తమిళనాడు మంత్రి సెంథిల్‌ ‌బాలాజీ, అంతకుముందు దిల్ల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్‌ ‌సిసోడియా కూడా జైలుకు వెళ్లారు. తెలంగాణలో ముఖ్యమంత్రి కుమార్తె, ఎమ్మెల్సీ కవిత విషయంలోనూ అరెస్టుపై హైడ్రామా నడుస్తోంది. నిజానికి ఇటువంటి రాజకీయ కక్షలు, కేసులు పెట్టుకోవడం, కోర్టుల చుట్టూ తిప్పడం, మన దేశానికి, రాష్ట్రానికి కొత్తే కాదు. అధికారంలో ఉన్న పార్టీలు ప్రతిపక్షాలలో ఉన్న ప్రముఖ నాయకుల ద కేసులు పెట్టడం, కేంద్రంలో అధికారంలోకి వొచ్చిన వారు రాష్టాల్ల్రో ఉన్న నేతలపైనా కేసులు మామూలయి పోయాయి.
ఇలా తలా తోకలేని కేసులు పెట్టడం, ఏళ్ల తరబడి బెయిల్‌ ఇవ్వకుండా, అసలు విచారణె లేకుండా జైల్లో దుర్భరమైన పరిస్థితులకు వారి జీవితాలకు బలి చేయడం సాధారణ వ్యవహారంగా మారింది.  ఇదంతా చూస్తుంటే ఆర్థిక నేరగాళ్లకు, అందులో వారు పాలక వర్గాలకు చెందినవారైతే ..పరిస్థితి వేరుగా ఉంటోంది.ఈ చట్టం ఎవరికీ చుట్టం కాదనేది ఒక నానుడి మాత్రమే. పాలక పార్టీలు తిట్టుకోవడానికి ఉపయోగ పడే నినాదం మాత్రమే. చట్టం లేక రాజ్యం పాలకవర్గానికి కచ్చితంగా చుట్టమేనని దేశంలో జరుగుతున్న పై వివరాలను బట్టి అర్థం చేసుకోవచ్చు. చట్టాలను నిక్కచ్చిగా అమలు చేయగలగాలి. చట్టం ఎవరికీ చుట్టం కాదన్న నినాదం నిజం కావాలి. అప్పుడే భారతీయ చట్టాలపై నమ్మకం కలుగుతుంది.
-ప్రజాతంత్ర డెస్క్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page