ఉరి వేసుకుని భార్య…అనంతరం రివాల్వర్‌తో కాల్చుకుని ఎస్సై మృతి
జనగామ, ప్రజాతంత్ర, ఏప్రిల్ 06 : భార్య మరణాన్ని జీర్ణించుకోలేక ఓ ఎస్సై తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన జనగామ జిల్లాలో గురువారం చోటుచేసుకుంది. జనగామ పట్టణ ఎస్సైగా కాసర్ల శ్రీనివాస్ విధులు నిర్వహిస్తున్నారు. ఎస్సై దంపతుల మధ్య మధ్య ఆర్థిక ఇబ్బందుల వలన గొడవలు రావడంతో మనస్థాపం చెంది ఎస్సై భార్య స్వరూప గురువారం ఉదయం బాత్రూమ్లో స్నానానికి వెళ్లి చున్నీతో వెంటిలేటర్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. రోజు మాదిరిగానే పాలు పోసే వ్యక్తి ఎంత పిలిచినా బయటికి రాకపోవడంతో పక్కింటి వారిని పిలిచి చెప్పడంతో వారు వొచ్చి చూడడంతో బాత్రూమ్లో ఉరి వేసుకుని మృతి చెందడంతో పెద్దగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై శ్రీనివాస్ ఇంట్లో పడుకుని ఉండడంతో తన డోర్ కొట్టి పిలవడంతో బయ•కు రావడం జరిగింది. భార్య మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరైన ఎస్సై తలను గోడకేసీ కొట్టుకుని రోదించాడు. దీంతో గమనించిన చుట్టుపక్కల వారు, స్థానికులు ఎస్సైను ఓదార్చారు. అనంతరం డీసీపీ సీతారామ్ సంఘటనా స్దలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి ఎస్సైను ఓదార్చారు.
ఏసీపీ కొత్త దేవేందర్‌రెడ్డి, సీఐ నాగబాబు, ఎస్సైలు సృజన్, రఘుపతి, స్థానిక కౌన్సిలర్ జక్కుల అనిత వేణుమాదవ్, మల్లిగారి చంద్రకళరాజులు ఎస్సై శ్రీనివాస్‌ను ఓదార్చి పక్కకు జరిగి మాట్లాడుకుంటున్న సమయంలో అక్కడనే ఉన్న వేణుమాదవ్‌ను బాత్రూమ్లోకి వెళ్లి వొస్తానని చెప్పి బెడ్రూంలోని బాత్రూమ్లోకి వెళుతున్న తరుణంలో డెస్క్‌లో ఉన్న సర్వీస్ రివాల్వర్‌ను వెంట తీసుకెళ్లడం వేణుమాదవ్ గమనించలేదు. డోర్ దగ్గరేసుకుని ఆయనకు ఆయన కాల్చుకోవడంతో పెద్ద శబ్దం వినిరాగానే అయ్యో ఏమో జరిగిందని అందరు బాత్రూమ్ వైపు వెళ్లగా తుపాకీ తూటా దిగినందున విపరీతమైన రక్త స్రావం జరగడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అప్పటికే అక్కడ గుమిగూడిన జనమంతా అయ్యో ఇక మనకు శ్రీనివాస్ లేడని బాధను వ్యక్తం చేసారు. అందరితో మంచిగా ఉండి పేరు సంపాదించుకున్న ఎస్సై మృతి జిల్లా కేంద్రంలో విషాదచాయలు అలుముకున్నాయి.
విషయం తెలుసుకున్న వెంటనే డీసీపీ హుటాహుటిని సంఘటన స్దలాన్ని చేరుకుని బాధను వ్యక్తం చేయడం జరిగింది. ఎస్సై తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్‌లోకి వెళ్లి కన్నీరుమున్నీరయ్యారు. మృతదేహాలను జనగామ ప్రభుత్వ హాస్పిటల్‌కి తరలించి పోస్టుమార్టం నిమిత్తం స్వగ్రామానికి తరలించారు. వీరికి ఇద్దరు కుమారులు రవితేజ, బబ్లులు ఉన్నారు. గత మూడు నెలల క్రితమే పెద్ద కుమారుడు రవితేజ వివాహాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా డీసీపీ సీతారామ్ మాట్లాడుతూ గత కొంతకాలంగా కుటుంబంలో ఎస్సై దంపతులకు మధ్య గొడవలు జరుగుతున్నాయన్నారు. ఈ గొడవల వలన ఎస్సై భార్య ఆత్మహత్యకు పాల్పడిందని, భార్య చావును జీర్ణించుకోలేక ఎస్సై కూడా రివాల్వర్‌తో కాల్చుకుని చనిపోవడం జరిగిందన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుందన్నారు.