ట్విట్టర్‌కు భారత్ లీగల్ నోటీసులు
న్యూ దిల్లీ, జూలై 29 : గత ఏడాది జులై నుండి డిసెంబర్ వరకు ప్రముఖ జర్నలిస్టులు, వార్తా సంస్థలు ట్వీట్ చేసిన కంటెంట్లను తొలగించాలని భారత్ నుండి లీగల్ డిమాండ్లు వచ్చాయని ప్రముఖ సోషల్ డియా సంస్థ ట్విట్టర్ వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా లీగల్ డిమాండ్లు అత్యధికంగా భారత్ నుండి వచ్చాయని తాజా నివేదికలో పేర్కొనడం గమనార్హం. ప్రపంచ వ్యాప్తంగా 19 శాతం సమాచారం కోసం సంస్థకు అభ్యర్థనలు రాగా, ఆమెరికా తర్వాత స్థానంలో భారత్ ఉంది. గత ఏడాది జులై-డిసెంబర్ వరకు వినియోగదారులకు సంబంధించిన కంటెంట్‌ను నిలిపివేయాలంటూ ఉత్తర్వులను జారీ చేసిన మొదటి ఐదు దేశాల్లో భారత్ ఉందని తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వెర్గి•డ్ జర్నలిస్టులు, న్యూస్ సంస్థలకు చెందిన 349 ఖాతాలకు చెందిన కంటెంట్‌ను తొలగించేందుకు 326 చట్టపరమైన డిమాండ్లను ట్విట్టర్ అందుకున్నట్లు తెలిపింది.
గత ఆరు నెలల కాలంతో పోలిస్తే (జనవరి-జూన్ 2021) 103 శాతం అదనం. భారత్ 114, టర్కీ 78, రష్యా 55, పాకిస్తాన్ 48 చట్టపరమైన డిమాండ్లు వచ్చాయి. జనవరి-జూన్ 2021లో కూడా ఈ జాబితాలో భారత్ అగ్రస్థానంలో ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఎ•-లాట్‌ఫాం అందుకున్న మొత్తం 231 డిమాండ్లలో 89 భారత్‌ను వచాచయని పేర్కొంది. 021 ద్వితియార్ధంలో వెర్గి•డ్ జర్నలిస్టులు, న్యూస్ సంస్థలకు సంబంధించిన 17 ట్వీట్లు తొలగించగా.. అంతకముందు 11 ట్వీట్లు నిలిపివేయబడ్డాయి. మైనర్‌కు సంబంధిన గోప్యతా సమస్యలకు సంబంధించిన కంటెంట్‌ను తీసివేయాలని భారత్‌లో బాలల హకుకల పరిరక్షణ కోసం జాతీయ కమిషన్ నుండి లీగల్ డిమాండ్ అందుకున్నట్లు తెలిపింది.