- రుతుపవనాలు చురుగ్గా ఉండడంతో అంచనాల్లో సవరణ ఐఎండి వెల్లడి
- రెండు మూడు రోజుల్లో రాష్ట్రంలో తేలికపాటి వార్షాలు: వాతావరణ శాఖ వెల్లడి
హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 31 : ఈసారి జూన్-సెప్టెంబర్ నెలల మధ్య సగటు వర్షపాతం భారత వాతావరణ శాఖ అంచనా కంటే 3 శాతం వరకు ఎక్కువగా కురిసే అవకాశం ఉందని ఐఎండి తెలిపింది. వర్షాకాలంలో సగటు వర్షపాతం దీర్ఘకాల సగటులో 103 శాతం ఉంటుందని వాతావరణ సంస్థ తెలిపింది. తాజాగా రుతుపవనాల కదలికలు చురుగ్గా ఉన్న నేపథ్యంలో అంచనాలను సవరించింది. దేశంలోని చాలా వరకు భూభాగంలో వర్షాలు మెరుగ్గా పడతాయని భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ మోహపాత్ర తెలిపారు. ఈ మేరకు ప్రస్తుత సీజన్‌కు సవరించిన అంచనాల గణాంకాలను వెలువరించారు. జూన్ నుండి సెప్టెంబర్ వరకు రుతుపవనాల ప్రభావంగా కురిసే వర్షాలు ఏప్రిల్‌లో ఐఎండి అంచనా వేసిన దానికంటే ఎక్కువగా కురిసే అవకాశం ఉందని, సంస్థ దీర్ఘకాల సగటులో 99 శాతం నుండి 103 శాతం వరకు అంచనా ఉండవొచ్చని మంగళవారం తెలిపింది.
మధ్య భారతదేశం, దక్షిణ ద్వీపకల్పం, ఈశాన్య భారతదేశం మరియు వాయువ్య భారతదేశం వంటి నాలుగు ప్రాంతాలలో రుతుపవనాల చురుకుదనం వల్ల కూడా విరివిగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మధ్య, ద్వీపకల్ప భారతదేశంలో దీర్ఘకాలంలో సగటుకు 106 శాతం వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఈశాన్య ప్రాంతాల్లో మాత్రం సాధారణం కంటే తక్కువ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని చెప్పారు. సాధారణంగా జూన్ 1న కేరళకు రావాల్సిన నైరుతి రుతుపవనాలు మూడు రోజులు ముందుగానే రావడంతో ఇప్పటికే కేరళలో వర్షాలు ప్రారంభయ్యాయి. మరోవైపు, సోమవారం దేశ రాజధాని దిల్లీని ఉరుములు, పిడుగులు, బలమైన గాలులతో కూడిన వర్షం కుదిపేసింది. తీవ్రమైన ఎండతో వేడెక్కిన నగరాన్ని సోమవారం సాయంత్రం 4 గంటల సమయంలో ఒక్కసారిగా పెనుగాలులు చుట్టుముట్టాయి. గంటకు 100 కి.వి•. వేగంతో తుపానును తలపించాయి. ఆ వెంటనే ఉరుములు..కుండ పోతగా వర్షం… తూర్పు, సెంట్రల్ దిల్లీలోని పలు ప్రాంతాల్లో భీతావహమైన పరిస్థితులు నెలకొన్నాయి. చెట్లు వేళ్లతో సహా పెకిలించుకుపోయి రహదారులపై పడ్డాయి. దేశంలోని పలు ప్రాంతాల్లోనూ వర్షాలు కురుస్తున్నాయి.
రెండు మూడు రోజుల్లో రాష్ట్రంలో తేలికపాటి వార్షాలు: వాతావరణ శాఖ వెల్లడి
రుతుపవనాల ప్రభావంతో పశ్చిమ దిశ నుంచి తెలంగాణ వైపు బలమైన గాలులు వీస్తున్నాయి. మరోవైపు రానున్న మూడు రోజుల్లో రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశమున్నట్లు చెప్పింది. ఇదిలావుంటే రాష్టాన్రికికి వర్ష సూచన చేసింది హైదరాబాద్ వాతావరణశాఖ. వచ్చే మూడ్రోజులు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతాయని తెలిపింది. ఉరుములు, మెరుపులతో వర్షాలు పడుతాయంది. 29న కేరళలో ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు.. ఇవాళ కేరళతో పాటు కర్ణాటకలోకి కొన్ని ప్రాంతాలు, తమిళనాడులోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించాయని తెలిపారు.
వచ్చే రెండు మూడ్రోజులలో కర్ణాటకలోని కొంకన్, గోవా ప్రాంతాలకు రుతుపవనాలు ప్రవేశించే ఛాన్స్ ఉందన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మంగళవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. చండూర్ లో ఈదురుగాలులతో భారీ వర్షం వచ్చింది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని పలు గ్రామాల్లో భారీ వర్షం కురుస్తుంది. సోమవారం అత్యధికంగా సంగారెడ్డి జిల్లా మల్‌చెల్మలో 3.3 సెం.వి•, ఖమ్మం జిల్లా కొణిజర్లలో 3.2 సెం.వి• వర్షపాతం నమోదైందని వాతావరణ అధికారులు తెలిపారు. అత్యధికంగా కోల్‌బెల్ట్ ప్రాంతమైన రామగుండంలో పగటిపూట 44.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందన్నారు.