ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 3 : ఆమనగల్ మున్సిపాలిటీలోని రెండవ అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి మున్సిపాలిటీ కోఆప్షన్ నెంబర్ ఆసియా పర్వీన్ హాజరై మాట్లాడుతూ చిన్నారులకు తల్లిపాల ప్రాముఖ్యతను వివరించాలని సూచించారు. తల్లిపాలకు మించిన ఆహారం మరొకటి లేదని తల్లిపాల వల్ల పిల్లలకు రోగ నిరోధక శక్తి పెరుగుతుందని ప్రతి తల్లి ముర్రిపాలు పట్టించాలని ఆమె కోరారు. బిడ్డ పుట్టిన వెంటనే ముర్రిపాలు తాగించడం వల్ల వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుందన్నారు. ఆరు నెలల వయసు వరకు కేవలం తల్లిపాలు మాత్రమే తాగించాలని సూచించారు. అదేవిధంగా జాతీయ నూలు పురుగు నివారణ దినోత్సవం సందర్భంగా అంగన్వాడి విద్యార్థులకు మాత్రలను తినిపించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్త లక్ష్మి కాలనీ ప్రజలు పాల్గొన్నారు.