తెలంగాణలో మద్యం అమ్మకాల్లో రికార్డు

హైదరాబాద్‌,జనవరి1 : పండగ ఏదైనా తెలంగాణలో బీర్లు పొంగాల్సిందే. ఇక న్యూఇయర్‌ అయితే అమ్మకాలు ఏ రేంజ్‌లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నూతన సంవత్సర వేడుకల సందర్బంగా మద్యం అమ్మకాల్లో తెలంగాణ దుమ్మురేపింది. ఆదివారం ఒక్కరోజే 19 ప్రభుత్వ డిపోల నుంచి లక్ష 30 వేల కేసుల లిక్కర్‌, లక్ష 35 వేల కేసుల బీర్‌ అమ్మకాలు జరిగాయట. నిన్న ఒక్కరోజే ప్రభుత్వానికి రూ.125 కోట్ల ఆదాయం సమకూరిందని సమాచారం. ఈ సారి డిసెంబర్‌ 31 ఆదివారం కావడంతో మధ్యాహ్నం నుంచే వైన్స్‌ల వద్ద రద్దీ కనిపించింది. మూడు రోజుల్లో లిక్కర్‌ అమ్మకాలు ఆకాశాన్నంటాయి. డిసెంబర్‌ 29, 30, 31వ తేదీల్లో రూ.658 కోట్ల లిక్కర్‌ అమ్మకాలు జరిగినట్లు సమాచారం. మొత్తంగా 3 రోజుల్లో 4.76 లక్షల లిక్కర్‌ కేసులు… 6.31 లక్షల బీర్‌ కేసులు అమ్ముడ య్యాయి.

ఈ మూడు రోజుల్లో ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయం వచ్చింది. ఇకపోతే తెలంగాణలో మందుబాబులు గత ఏడాది తెగతాగేశారు. డిసెంబర్‌ నెలలో అయితే రికార్డులు సృష్టించారు. కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకు ఆదాయం చేకూర్చింది. తెలంగాణలో డిసెంబర్‌ చివరి వారంలో రికార్డు స్థాయిలో మద్యం విక్రయాలు జరిగాయని లెక్కలు చెబుతున్నాయి.తెలంగాణలో న్యూ ఇయర్‌ సందర్భంగా లిక్కర్‌ సేల్స్‌ జోరుగా సాగాయిన్యూ ఇయర్‌ సందర్భంగా అర్ధరాత్రి 12 గంటల వరకు లిక్కర్‌ షాపులు, వైన్స్‌కి అనుమతి ఇవ్వడం, బార్‌లకు ఒంటి గంట వరకు ఓపెన్‌ ఉండడంతో మందుబాబులు పండగ చేసుకున్నారు.

డిసెంబర్‌ 28న రూ.133 కోట్లు, 29న రూ.179 కోట్లు, 31న అత్యధికంగా రూ.313 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి. న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్‌ పేరుతో తెలంగాణలో మద్యం ఏరులై పారింది. వేడుకల పేరుతో జనం విచ్చలవిడిగా మద్యం కొనుగోలు చేశారు. 2023 డిసెంబర్‌ 31న పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ చేసుకున్నసంబరాలు ప్రభుత్వ ఖజానను నింపాయి. తెలంగాణలో ఒక్కరోజే 313కోట్ల రూపాయల లిక్కర్‌ అమ్ముడైంది. ఒక్కరోజులో మద్యం విక్రయాలు జరిగిన తీరు ఇప్పుడు అందర్ని ముక్కున వేలేసుకునేలా చేస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page