వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

తెలంగాణ దేశానికే ఆదర్శం..!

April 1, 2019

మాజీ మంత్రి హరీష్ రావు

మాజీ మంత్రి సునితా ల‌క్ష్మారెడ్డి చేరిక సంద‌ర్భంగా హ‌రీశ్ రావు మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ… సునితాల‌క్ష్మారెడ్డి చేరిక‌తో మెద‌క్ జిల్లాలో టీఆర్ఎస్ మ‌రింత బ‌లోపేత‌మైంది. కాంగ్రెస్ నాయ‌కుల‌కు నాయ‌క‌త్వంపై విశ్వాసం పోయింది. రోజుకో కాంగ్రెస్ నేత టీఆర్ఎస్‌లో చేరుతున్నారు. రాష్ట్రంలో ఉండేది టీఆర్ఎస్ పార్టీ మాత్ర‌మే అన్ని రంగాల్లో తెలంగాణ దేశానికి ఆద‌ర్శంగా నిలిచింది. గ‌తంలో బెంగాల్‌, గుజ‌రాత్ రాష్ట్రాల గురించి చెప్పుకునే వారు. ఇప్పుడు దేశ ప్ర‌జ‌లు తెలంగాణ మోడ‌ల్ గురించే మాట్లాడుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీని ప్ర‌జ‌లు ప‌ట్టించుకోవ‌డం లేదు. కాంగ్రెస్ పార్టీకి కార్య‌క‌ర్త‌లు క‌రువ‌య్యారు. మిష‌న్ కాక‌తీయ‌, మిష‌న్ భ‌గీర‌థ‌, రైతుబంధు, రైతు బీమా ప‌థ‌కాలు దేశానికే ఆద‌ర్శంగా నిలిచాయి. దేశంలోనే కేసీఆర్ నెంబ‌ర్ వ‌న్ ముఖ్య‌మంత్రి. కేంద్రంలో మంత్రిప‌ద‌వి ఇవ్వ‌కుండా తెలంగాణ‌ను బీజేపీ చిన్న‌చూపు చూసింది. కేంద్రం నుంచి మ‌న‌కు రావాల్సిన వాటా కోసం 16 ఎంపీ స్థానాల్లో టీఆర్ఎస్ పార్టీ గెలుపు సాధించాలి. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీ 103 స్థానాల్లో డిపాజిట్ కోల్పోయింది. రాష్ట్ర బీజేపీ అధ్య‌క్షుడు, శాస‌న‌స‌భా ప‌క్ష‌నేత‌లు కూడా చిత్తుగా ఓడిపోయారని ఎద్దేవా చేశారు