‘‘ఆనాడు గెరిల్లా దళాలలో అనేక మంది స్త్రీలు ఆయుధాలు పట్టి పోరాడారు వీరిలో మల్లు స్వరాజ్యం, ఆరుట్ల కమల, అచ్చమాంబ, సాలమ్మ, కమల( వరంగల్ ).. ముఖ్యంగా ఆరుట్ల 1938 ఆంధ్ర మహాసభల్లో చేరింది. 1948 లో ఆయుధంతో అరెస్టయింది. ఈమెను అనేక జైళ్ళల్లో నిర్బంధించారు. నిర్బంధం తీవ్రంగా వున్న పరిస్థితులలో దళాల్లో ఉన్న స్త్రీలు ప్రసివించినవుడు చంటి పిల్లల ఉనికి దళాలమనుగడ కే ప్రశ్నర్షకంగా తయారయింది. అలాంటి సందర్భాలల్లో తమ పిల్లల కంటే ఉద్యమ రక్షణే దళాలకు రక్షణే ప్రధానంగా ఎంచుకొని పసికందులను పోలీస్ క్యాంపుల ముందు వదిలారు. ఇంతరులకు పెంచుకోవటానికి ఇచ్చారు. ఈ విషయంలో కమలమ్మ, పద్మ ప్రదర్శించిన త్యాగనిరతీ, మనో నిబ్బిరం,ఆత్మస్థైర్యం మరువలేనిది.’’
ఆంధ్ర మహాసభ నాయకత్వం లో వెట్టికి వ్యతిరేకంగా, అక్రమ లేవీ ధాన్యం వసూళ్ళకు వ్యతిరేకంగా, ఎదురు తిరగడం మొదలు పెట్టారు. గ్రామ కమిటీలు స్థాపించుకున్నారు. భూస్వాములు అక్రమంగా కాజేసిన బంజర భూముల కోసం పోరాటలు నడిచాయి. ఆ విధంగా వెట్టికి వ్యతిరేకంగా మొదలైన ఉద్యమం 1946 కల్లా సాయుధ రూపం తీసుకుంది
కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో 1946 నుండి 1951 వరకు సాగించిన వీరోచిత ధీరోదాత్త పోరాటమే తెలంగాణ సాయుధ పోరాటం.. అనాటి ఫ్యూడల్ జమిందార్ల మీద రజాకార్ల రాక్షసత్వం మీద 1948 లో ప్రవేశపెట్టిన నెహ్రూ సైన్యం పైనా ఈ పోరాటం నడిచింది. తరతరాలుగా ‘‘ నీ బాంచన్ దొరా’’ అంటూ తలలు వంచి బతికిన పేద ప్రజలు’’ దోపిడీ దౌర్జన్యాలు యిక చెల్లవంటూ’’ ఎదిరించి నిలిచారు జమిందారుల పొలాల్లో గడీలలో పెట్టిచాకిరి చేసిన చేతులే ప్రశ్నల కొడవళ్ళేత్తాయి. ప్రజల రక్తంతో చెమటతో నిర్మించుకున్న భూస్వాముల గడీల పునాదులు కదలడం ప్రారంభించాయి. ఆ నాటి మహత్తర తెలంగాణ సాయుధ పోరాటాల్లో మహిళలు నిర్వహించిన పాత్ర గురించీ.. వారు ప్రదర్శించిన దైర్యం సాహసాల గురించీ.. త్యాగా నిరతి గురించీ ఈనాటి మహిళలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది
తెలంగాణ ప్రాంతంలో ఆ నాడున్న ఫ్యూడల్ వ్యవస్థకు అనుగుణంగానే మహిళల పరిస్థితి ఉంది. భూస్వామ్య ధనిక వర్గాల కుటుంబాలలోని స్త్రీలు తమ గడిల నుండి బయటకు వచ్చే పరిస్థితి ఉండేది కాదు. ఒకవేళ ఎక్కడైనా వెళ్లాల్సి వచ్చినా కచ్చడపు బండ్లకు చుట్టూ పరదాలు కట్టుకొని మాత్రమే బయటకు వచ్చేవారు, వారి కుటుంబ సభ్యులకు తప్పితే యితరులకు కనిపించేవారు కాదు.. మాట్లాడేవారు కాదు. వీరిలో అక్షరాస్యత చాలా తక్కువ. టీచర్లను ఇండ్లకు పిలిపించి ఉత్తరాలు చదువుకునే మేరకు మాత్రమే ఆడపిల్లలను చదివించేవారు.
నిరుపేద కుటుంబాలు ఇండల్లో గడవని పరిస్థితులల్లో ఆకలిని చంపుకోలేక కన్న ప్రేమను చంపుకొని ఆడపిల్లలను అమ్ము కొనేవారు. తెలంగాణ సాయుధ పోరాటంలో చురుకుగా పాల్గొన్న కమలమ్మ (వరంగల్లు ) బానిస కుటుంబం నుండి వచ్చింది. ఈమె తల్లి కట్టుబానిసగా కొంతమంది దొరల ఇండ్లలో పని చేసింది. కమలమ్మ అమ్మ ను ఆమె తల్లి కరువచ్చి ఇంట్లో గడవని పరిస్థితులలో రెండున్నర కిలోల బియ్యం ఒక్క రూపాయికి ఒక బ్రాహ్మణ కుటుంబానికి అమ్మిందట.. కమలమ్మ అమ్మ దగ్గరనుండి మొదలైన మూడు తరాల నుండి దొరల ఇండ్లలో కట్టు బానిసలుగా ఉంటూ వచ్చారు. వీరికి వివాహాలు ఉండేవి కావు నచ్చితే దొరలే వీరిని చేరదీసేవారు.
భూస్వాములకు నచ్చిన వారికంట్లో పడిన ఏ స్త్రీనీ వదిలేవారు కాదు. వారి ఊర్లోకి వచ్చారంటే అందరూ తలుపులు వేసుకునేవారు. స్త్రీలకు మంచి బట్టలు కట్టు కోవడానికి గానీ పూలు పెట్టుకోవడానికి గానీ ధైర్యం చాలేది కాదు. వీరు భయపడటనికి కారణం భూస్వాముల ప్రవర్తన పరమ కర్కోటంగా ఉండటమే .. వారిని కాదని తిరస్కరించి బతికి బట్టకట్టినవారు లేరు. ఆనాడు నైజాం నవాబుకు 360 మంది భార్యలుండేవారని చెప్పుకుంటారు దీన్నిబట్టి ఆనాడు మహిళల పరిస్థితి ఎంత దారుణంగా దయనీయం గా ఉండేదో ఊహించుకోవచ్చు.
తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న మహిళ ల్లో భర్తల ద్వారాగానీ తమ అన్నల ద్వారాగానీ వచ్చిన వారే ఎక్కువమందని చెప్పుకోవచ్చు సామాన్య చదువులతో కమ్యూనిస్టు పార్టీలో చేరిన మహిళలు మార్కసట్ సాహిత్యాన్ని అధ్యయనం చేసి అభివృద్ధి అయ్యారు. ఉద్యమంలోకి మహిళలను సమీకరించారు.. ఉద్యమ ప్రభావంతో అనేకమంది మహిళలు కమ్యూనిస్టు పార్టీలో పనిచేయడానికి ఆసక్తి చూపేవారు కానీ మహిళలు కమ్యూనిస్టు పార్టీలో చేర్చుకోవడానికి కొంత వెనుకాడే వారు లేదా ఒకటి పదిసార్లు ఆలోచించి మాత్రమే మహిళలను చేర్చుకునేవారు దానికి కారణం శత్రువర్గాల దుష్ప్రచారం సహజంగానే ఎదురయ్యేకొన్ని సమస్యలను దృష్టిలోకి తీసుకని ఆ విధంగా చేసేవారు.
ఆంధ్ర మహాసభ బలవంతపు వివాహాలు చేయరాదని తీర్మానించింది.. ఆంధ్ర మహాసభ తీర్మానాన్ని అమలు చేసిన కమ్యూనిస్టు పార్టీ వారిని హర్షించాలి గానీ ‘‘నిందించడం మంచిది కాదని ‘‘అన్నారు. ఫ్యూడల్ సాంప్రదాయాలకూ పద్ధతులకూ ఆచారాలకూ భిన్నంగా స్త్రీలు స్వేచ్ఛగా తమకు యిష్టం వచ్చిన వారిని పెళ్లి చేసుకోవడాన్ని పార్టీ సమర్థించింది.. ప్రోత్సహించింది. బలవంతపు పెళ్లిలను వ్యతిరేకించింది.
స్త్రీల రక్షణ విషయంలో కమ్యూనిస్టు పార్టీ ఆలోచించి స్త్రీలు తమను తాము ఎలా రక్షించుకోవాలో తర్షీదునిచ్చింది. గ్రామ సంఘాల్లో వలంటీర్లలో స్త్రీలను చేర్చుకుని వారిని నాయకత్వంలో భాగస్వాములను చేసింది. గ్రామ సంఘాల్లోఒకరొయిద్ధరో మహిళలు ఉండేట్టు ఏర్పాటు చేశారు. అయితే ఆ వాలంటీర్ దళాల్లో మహిళలను చేర్చుకోడానికి కొన్ని యిబ్బందులను కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. యువకులే ఎక్కువమంది ఉండడంతో యువతీ యువకులు కలిసి ఒకే వాలంటీర్ దళంలో పనిచేయడం అలాంటి పరిస్థితులల్లో సాధ్యం కాలేదు. దానితో ప్రత్యేకంగా మహిళలతో వలంటీరు దళాల నిర్మిణం చేశారు. ఇది కొన్ని చోట్ల సాధ్యం అయిన కొన్నిచోట్ల సాధ్యం కాకపోయినప్పటికీ కొన్నిచోట్ల మాత్రం వాలంటీర్ దళాలు నిర్మాణమయ్యాయి. ఆనాటికీ పార్టీలో ఐదారుగురు మహిళ కార్యకర్తలు వుండే వారు.. వారిలో మహిళలను ఆర్గనైజు చేయడంలో శ్రద్ధ తీసుకునే వారు. పార్టీ వారికి కావలసిన శిక్షణ సూచనలు యిచ్చి గ్రామాలల్లో పనిచేయటానికి పంపించింది. సూచనలను వారు గ్రామాలల్లో అమలు జరిపేవారు.
తెలంగాణ సాయుధ పోరాట గుర్తుకు రాగానే చిట్యాల ఐలమ్మ గుర్తుకు వస్తుంది. భూస్వాముల ఎదుట నిలబడటమే గగనమైన అలాంటి పరిస్థితులల్లో తన కుటుంబాన్ని లొంగదీసుకోవటానికి భూమిని కా జేయడానికి భూస్వాములు ప్రయత్నించినప్పుడు ఎదురు తిరిగిన మొట్టమొదటి మహిళ ఐలమ్మ.. భర్త, కొడుకు, అల్లుడు అందరిని జైలులో బంధించిన మగదిక్కు లేకుండా చేసినా కూడా భూస్వాములకు లొంగలేదు. పాలకుర్తి గ్రామంలో ఐలమ్మ యిల్లే కమ్యూనిస్టు పార్టీ కేంద్రంగా ఉండేది.