దేశం మెచ్చిన నేత సీఎం కేసీఆర్‌

  • రాష్ట్ర వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు
  •  కొల్లూరు నూతన పోలీస్‌ ‌స్టేషన్‌ ‌ప్రారంభం
  • మల్లికార్జున స్వామి, బీరప్ప స్వామి, విశ్వకర్మ దేవాలయాలకు భూమి పూజ

పటాన్‌ ‌చెరు,ప్రజాతంత్ర,జూన్‌ 10:‌తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలతో దూసుకు వెళుతుందని, దేశం మెచ్చిన నేత సీఎం కేసీఆర్‌ అని రాష్ట్ర వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు అన్నారు. శనివారం తెల్లాపూర్‌ ‌మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూరు నూతన పోలీస్‌ ‌స్టేషన్‌ ‌ను స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌ ‌రెడ్డితో కలిసి మంత్రి హరీష్‌ ‌రావు ప్రారంభోత్సవం చేశారు. మల్లికార్జున స్వామి, బీరప్ప స్వామి, విశ్వకర్మ దేవాలయాలకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌ ‌రావు మాట్లాడుతూ.. మూడేండ్ల కృషితో బీరప్ప దేవాలయ నిర్మాణ కల నెరవేరబోతుందని తెలిపారు. పార్టీలకు అతీతంగా దేశం మెచ్చిన నేతగా కేసీఆర్‌ ‌చేస్తున్న సంక్షేమ పథకాలు అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాయన్నారు. గొల్ల, కుర్మలకు ఐదు వందల కోట్ల విలువైన భూమిని అందించి ఆత్మగౌరవ భవనాలను నిర్మిస్తున్నాం అని తెలిపారు.

విశ్వ బ్రాహ్మణుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. చేతి వృత్తులు చేస్తున్న బడుగు, బలహీన వర్గాలకు రూ.లక్ష అందిస్తున్న ఏకైక ప్రభుత్వం బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వమే అని స్పష్టం చేశారు. తెల్లాపూర్‌లో విశ్వ బ్రాహ్మణ దేవాలయ నిర్మాణానికి ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌ ‌రెడ్డి రూ. 50 లక్షలు ప్రకటించటం అభినందనీయం అని మంత్రి అన్నారు. తెల్లాపూర్‌ ‌మునిసిపాలిటీకి అన్ని సౌకర్యాలు, హంగులు సమకూర్చడంతో పాటు త్వరలోనే మునిసిపాలిటీ భవనం, వ్యవసాయ మార్కెట్‌, ‌పెండింగ్‌లో ఉన్న పలు అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. తెల్లాపూర్‌ ‌మున్సిపల్‌ ‌పరిధిలోని మౌలిక వసతుల కల్పనకు మరిన్ని నిధులు కేటాయిస్తామని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ ‌శరత్‌, ‌మున్సిపల్‌ ‌చైర్మన్‌ ‌లలితా సోమిరెడ్డి, సైబరాబాద్‌ ‌పోలీస్‌ ‌కమిషనర్‌ ‌స్టీఫెన్‌ ‌రవీంద్ర, మున్సిపల్‌ ‌వైస్‌ ‌చైర్మన్‌ ‌రాములు గౌడ్‌, అమీన్‌ ‌పూర్‌ ‌మున్సిపల్‌ ‌చైర్మన్‌ ‌తుమ్మల పాండురంగారెడ్డి, కార్పొరేటర్లు సింధు ఆదర్శ్ ‌రెడ్డి, పుష్ప నగేష్‌, ‌కౌన్సిలర్లు కోఆప్షన్‌ ‌సభ్యులు వివిధ శాఖల అధికారులు, బీఆర్‌ఎస్‌ ‌పార్టీ మున్సిపల్‌ అధ్యక్షుడు దేవేందర్‌ ‌యాదవ్‌, ‌తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page