వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

దేశమంతా హిందీ భాష నేర్చుకోవాలి

September 14, 2019

ఐక్యంగా ఉంచగల భాష హిందీ మాత్రమే
కేంద్ర అర్థి క శాఖ మంత్రి అమిత్‌ ‌షా
అమిత్‌షా వ్యాఖ్యలపై మండిపడ్డ అసదుద్దీన్‌, ‌స్టాలిన్‌
దేశమంతా హిందీ భాష నేర్చుకోవాలని, భారత దేశాన్ని ఏకతాటి పైకి తేగల సత్తా హిందీకి మాత్రమే ఉందని కేంద్ర •ంమంత్రి అమిత్‌ ‌షా పేర్కొన్నారు. శనివారం హిందీ దివస్‌ ‌సందర్భంగా ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమలో ఆయన మాట్లాడారు. ప్రపంచ వ్యాప్తంగా ఒక దేశానికి తనదైన గుర్తింపు ఉండాలంటే అందరికీ ఓ భాష తెలిసి ఉండడం అత్యావశ్యకమని ఆయన అన్నారు. మన దేశం విభిన్న భాషలకు నిలయన్న అమిత్‌షా, ప్రతి భాషకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉందన్నారు. అయితే మొత్తంగా అందరికీ ఒక భాష తెలిసి ఉండడం చాలా అవసరమన్నారు. నేడు దేశాన్ని ఐక్యంగా ఉంచగల భాష ఏదైనా ఉందంటే అది అత్యధికంగా మాట్లాడే హిందీ మాత్రమే అని పేర్కొన్నారు. భారత్‌లోని ఉత్తరాది, ఈశాన్య రాష్టాల్రన్నింటా ప్రతి పిల్లాడికీ హిందీ బోధించడం జరుగుతుందని అమిత్‌ ‌షా
ఈ సందర్భంగా గుర్తుచేశారు. ప్రజలంతా తరచూ హిందీ మాట్లాడేందుకు ప్రయత్నం చేయాలనీ, తద్వారా మహాత్మాగాంధీ, సర్దార్‌ ‌పటేల్‌ ‌కలలు గన్న ఒకే దేశం, ఒకే భాష నినాదాన్ని నిజం చేయాలని ఆయన కోరారు.
మన దేశపు బహుళత్వ అందం కు కనిపించడం లేదా? – ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ
అమిత్‌షా వ్యాఖ్యలపై ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. భారత్‌ ‌హిందీ, హిందూ, హిందుత్వ అనే ఆలోచనల కంటే చాలా పెద్దదని ఒవైసీ తెలిపారు. హిందీ భాష ప్రతీ భారతీయుడి మాతృభాష కాదని ఆయన స్పష్టం చేశారు. ‘రు(అమిత్‌ ‌షా) కనీసం మన దేశపు బహుళత్వపు అందాన్ని, పలు మాతృభాషలు ఉండటాన్ని హర్షించరా? భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 29 ‌ప్రతీ భారతీయుడికి భాషా, సాంస్క•తిక హక్కును కల్పిస్తోంది’ అని ఒవైసీ ట్వీట్‌ ‌చేశారు.
హిందీ భాషను బలవంతంగా రుద్దడం తగదు – స్టాలిన్‌
‌దేశమంతా ఒకే భాష ఉండాలంటూ కేంద్ర •ం మంత్రి అమిత్‌ ‌షా చేసిన ప్రకటనపై డీఎంకే అధినేత స్టాలిన్‌ ‌తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందీ భాషను బలవంతంగా రుద్దడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని ఆయన వ్యాఖ్యానించారు. ఇలాంటి ప్రకటనలు దేశ ఐక్యతను దెబ్బతీస్తాయన్నారు. అమిత్‌ ‌షా తన ప్రకటనను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ ‌చేశారు. తమ పార్టీ నాయకులతో సమావేశమై .. భవిష్యత్‌ ‌కార్యాచరణను ప్రకటిస్తామని స్టాలిన్‌ అన్నారు.