నా చదువంతా రాష్ట్రంలోనే…పక్క రాష్ట్రాలకు పోలేదు

నేను బాగానే చదువుకున్నా
రెండు డిగ్రీలు చేసి ..ఉద్యోగం కూడా చేశా
సిఎం రేవంత్‌ రెడ్డి ఏం చదివాడో తెలియదు
చదువులపై సిఎం రేవంత్‌, కెటిఆర్‌ల మధ్య పరస్పర విమర్శలు


హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 31 : తాను కొండారెడ్డిపల్లి, తాండ్ర, వనపర్తి, హైదరాబాద్‌లో ప్రభుత్వ విద్య అభ్యసించానని, తానేం జ్ఞానం కోసం పక్క రాష్ట్రాలకు పోలేదని, గుంటూరు కూడా పోలేదని సిఎం రేవంత్‌ రెడ్డి కెటిఆర్‌ను ఉద్దేశించి చురకలంటించారు. బుధవారం అసెంబ్లీలో సిఎం రేవంత్‌, కెటిఆర్‌ల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. ఈ సందర్భంగా సిఎం రేవంత్‌ మాట్లాడుతూ…610 జీవో, ముల్కీ రూల్స్‌ అప్లై చేసినా..తెలంగాణలోని ప్రతి ఉద్యోగానికి తనకు అర్హత ఉందని జవాబిచ్చారు.
మరి గుంటూరులో చదువుకున్న వారికి అర్హత ఉందో లేదో తెలియదని రేవంత్‌ వ్యాఖ్యానించారు. దానిపై కేటీఆర్‌ స్పందిస్తూ.. గుంటూరులో 11, 12 చదివానని, విజ్ఞాన్‌లో చదివాననే విషయం చెబుతూనే ఉన్నానని, దాచడం లేదని, కానీ ప్రయివేటు రంగంలో ఉద్యోగం సంపాదించానని, 610 జీవో ప్రయివేటు రంగంలో వర్తించదని, కేవలం ప్రభుత్వ రంగంలోని ఉద్యోగాలకు మాత్రమే వర్తిస్తుందన్న విషయం గ్రహించాలని రేవంత్‌ రెడ్డికి కేటీఆర్‌ కౌంటర్‌ ఇచ్చారు.
అంతకు ముందు శాసనసభలో ద్రవ్య వినియమ బిల్లుపై చర్చ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ…తనది ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అన్నారని, ఎవరి ఇంటెలిజెన్స్‌ ఏంటో ప్రజలు తేల్చుతారన్నారు. తాను చదువుకుని వొచ్చానని, రెండు మాస్టర్‌ డిగ్రీలు చదివానని, పుణెలో మాస్టర్స్‌లో బయోటెలక్నాలజీ చేశానని, న్యూయార్క్‌ వెళ్లి ఎంబీఏ చేశానని, గుంటూరులో కూడా ఇంటర్‌ చదివానని, అంతటా చదివానని, సర్టిఫికెట్లు చూపే పరిస్థితి నాకుందని తెలిపారు. ఇక రేవంత్‌ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడుతూ…వారు ఎక్కడ చదువుకున్నారో తనకు తెల్వదని, ఏం చదువుకున్నారో తెల్వదని, తాను కష్టపడి ఉద్యోగం సంపాదించానని, అదే ఉద్యోగం విూద ఇండియాకు వొచ్చానని అన్నారు.
తనకు ఇంటెలిజెన్స్‌ ఉందా లేదా అంటే తాను పోటీ పరీక్షలు రాశానని, ఇంటర్వ్యూలు అటెండ్‌ అయ్యానని, కానీ ముఖ్యమంత్రి గతం గురించి తనకు తెల్వదని, కానీ ఆయన గురించి రకరకాలుగా చెప్తారని ఎద్దేవా చేశారు. ఎవరి ఇంటెలిజెన్స్‌ ఏందో అందరూ విన్నారని కేటీఆర్‌ పేర్కొన్నారు. ఇక రేవంత్‌ రెడ్డి చాలా అదృష్టవంతులని, చిన్న వయసులోనే సీఎం అయ్యారని, ఆయన గురించి గొప్పగా చెబుతున్నానని అన్నారు. రేవంత్‌ రెడ్డి దాదాపు 18 ఏండ్ల నుంచి తనకు తెలుసునని, మంచి మిత్రులని, చాలాసార్లు బయట మాట్లాడుకున్నానని, అయితే అది గత 10 ఏండ్లలో చెడిరదని, అది వేరే విషయం అని కేటీఆర్‌ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page