సర్దార్ వల్లభభాయ్ పటేల్ పేరు వినగానే- దేశ స్వాతంత్య్రం అనం తరం స్వదేశీ సంస్థానాల విలీనం అంశం ఎవరికైనా గురుకొస్తుంది. 1948 సెప్టెంబర్ 13న హైదరాబాద్ నిజాం పైకి భారత సైన్యంతో దాడి చేయించి, రజాకార్లను పారద్రోలి, ఆ సంస్థానాన్ని ఇండియన్ యూనియన్ లో విలీనం చేసిన పటేల్ ఘనత అందరికీ స్ఫురణకు వస్తుంది. నిజాం నిరంకుశ పాలన నుండి తెలంగాణకు విముక్తి కలిగించి, మీర్ ఉస్మాన్ ఆలీఖాన్ ను లొంగ దీసుకున్న మహా సాహసి మన ‘సర్దార్’. ‘ఉక్కుమనిషి’గా దేశ ప్రజ లంతా కీర్తించిన ఆయనను సెప్టెంబర్ 17 తెలంగాణ విలీన సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం అనివార్యంగా ఉంది. 1875 అక్టోబర్ 31న గుజరాత్ లోని నడియాలో పటేల్ జవేరి భాయ్, లాడ్ దంపతులకు నాలుగవ సంతానంగా జన్మించారు. భారతదేశంలో కలిసేందుకు విముఖంగా ఉన్న, విభేదిస్తున్న పలు రాష్ట్రాలను జాతీయవాది అయిన పటేల్ ఒప్పించి, ఏకం చేసి భారతదేశంలో ఐక్యం చేసిన నేపథ్యంలో ఆయన్ను భారత దేశ ఉక్కు మనిషి (ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా) అని కూడా పిలుస్తుంటారు. ఇంట్లో అన్నలు తనపై అధికారం చెలాయించిన క్రమంలో ఆయన తరుచూ ఎదురు తిరిగేవారు. ఆ మనస్తత్వ ప్రభావమే పెద్దయ్యాక ఆయనలో స్పష్టంగా కనిపించింది. బాల్యంలో ఆకతాయిగా తిరుగుతూ చదువుపై అంతగా ధ్యాస పెట్టని పటేల్ ఏళ్ల వయసులో మాత్రం ఆంగ్లభాషపై మమకారం పెంచుకున్నారు.
నాలు గేళ్లు కష్టించి మెట్రిక్యులేషన్ పూర్తి చేశాక, జిల్లా ప్లీడర్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి న్యాయవాద వృత్తిని చేపట్టారు. లండన్ వెళ్లి ‘బారిస్టర్’ చదవనిదే తనకు గౌరవం దక్కదని భావించి, మూడేళ్ళు శ్రమించి తగిన ధనాన్ని సంపా దించారు. సోదరుడు విఠల్ భాయ్ పటేల్ కోరికపై తాను సంపాదించిన డబ్బుతో అతడిని బారిస్టర్ చదివించారు. అన్న తిరిగి వచ్చాక, మళ్లీ సంపాదించిన డబ్బుతో లండన్ వెళ్లి బారిస్టర్ పూర్తి చేశారు. తాను చదివిన విద్యా.సంస్థలో ఉత్తమ విద్యార్థిగా 57 పౌనుల బహుమానాన్ని పొందారు. స్వదేశం వచ్చాక సూటు, బూటు, హ్యాటు ధరించి అహమ్మదాబాద్ లో గొప్ప క్రిమినల్ లాయర్‌గా పేరుగాంచారు. లో ఒకరోజు స్నేహితులతో కలిసి క్లబ్లో పేకాడుతున్న సమయంలో గాంధీజీ అక్కడికి వచ్చి, జాతీయ పాఠశాలను నెలకొల్పేందుకు సహకరించాలని కోరారు. అపుడు గాంధీజీ వైపు పటేల్ కన్నెత్తైనా చూడలేదు. అయితే, అదే ఏడాది గాంధీజీ అధ్యక్షత వహించిన గుజరాత్ కాంగ్రెస్ సభకు పటేల్ కార్యదర్శిత్వం వహించాల్సి వచ్చింది. అపుడు మహాత్ముని ప్రభావంతో పటేల్ జీవితం దేశానికి అంకితమైంది. 1918లో కైరా జిల్లాలో కరవు కారణంగా పన్ను మినహా యింపుఇవ్వాలని రైతులు చేసిన విజ్ఞప్తిని బ్రిటిష్ ప్రభుత్వం పట్టించు కోలేదు. కైరా సత్యాగ్రహాన్ని పటేల్ విజయ వంతంగా పూర్తి చేయగా, తనకు సరైన అనుచరుడు, కార్యదీక్షా పరుడు లభించాడని గాంధీ ప్రశంసించారు. ఆ తర్వాత అహమ్మదాబాద్ మున్సిపల్ చైర్మన్ గా 1928లో బార్డోలీ సత్యాగ్రహ సారథిగా, 1931లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా, 1932లో క్విట్ ఇండియా ఉద్యమంలో పటేల్ చురుకైన పాత్ర నిర్వహించారు.
దేశ విభజన సమయంలో, భారత రాజ్యాంగ నిర్మాణంలో సంస్థానాల విలీనంలో పటేల్ నాయకత్వ పటిమ ఉపయోగ.పడిరది. గాంధీజీ సహచరుడిగా, జైలులో ఆయనకు సంరక్షకునిగా వ్యవహరించిన పటేల్ వాస్తవ దృక్పథంతో ఆలో చిస్తూ, అరుదైన వ్యక్తిత్వంతో దేశానికి సేవలం దించారు. ఒకసారి కోర్టులో వాదిస్తున్న సమయంలో ఆయనకు టెలిగ్రాం రాగా, దానిని చదువుకుని కొద్దిసేపు కళ్లు మూసుకొని, ఏమీ కానట్లు తన వాదనను కొనసాగిం చారు. ఆ తర్వాత అందరికీ తెలిసింది …ఆయన భార్య మరణించినట్లు టెలిగ్రాంలో వర్తమానం ఉందని. దేశ విభజన వేళ- ‘కుళ్లిన అవ యవాన్ని ఖండిరచి, మిగిలిన శరీరాన్ని కాపాడడమే మన కర్తవ్యం. దేశ విభజ నకు ఒప్పుకోకుంటే స్వాతంత్య్రం వచ్చే అవకాశమే ఉండదు. మొత్తాన్ని కోల్పోవడం కంటే కొంత వదులుకోవడానికే నేను ఇష్టపడతాను’ అని ఆయన చెప్పేవారు. బార్డోలి సత్యాగ్రహం సందర్భంగా… ‘తక్కువ మాట్లాడండి, ఎక్కువ సాధించండి, విప్లవం.. అని కేకలు వేయకండి, అలా కేకలు వేసే నాయకులకు కొదవ లేదు. క్రమశిక్షణాశీలురైన అనుచరులు లేనిదే పోరాటం విజయవంతం కాదు.
మంచి సైనికులుగా తయారుకండి’ అని పటేల్ పిలుపు నిచ్చారు. కాగా, జాతీయోద్యమ సమయాన పటేల్ నెహ్రూతో విభేదించారు. 1938 నాటి కాంగ్రెస్ సదస్సులో నెహ్రూ ప్రవచించిన సోషలిజాన్ని పటేల్ వ్యతిరేకించారు. సంస్థానాల విలీనంలో నెహ్రూ శాంతి కాముకతను కాదని, సైనిక చర్యలు చేపట్టి సర్దార్ విజయం సాధించారు. పాకిస్తాన్ కు 55 కోట్ల రూపాయలు ఇవ్వరాదని నెహ్రూతో వాదించారు. తొలి రాష్ట్రపతి ఎన్నికలలో నెహ్రూ రాజగోపాలా చారిని సమర్ధించగా, పటేల్ రాజేంద్ర ప్రసాద్ ను ప్రతిపాదించి సఫలీకృతులైనారు. భారత రాజ్యాంగం డ్రాఫ్టింగ్ కమిటీ అధ్యక్షునిగా అంబేద్కర్‌ను నియమించడంలో పటేల్ కీలక పాత్ర పోషించారు. 1950లో కాంగ్రెస్ అధ్యక్షునిగా నెహ్రూ కృపలానీని సమర్ధించగా, పటేల్ పురుషోత్తమ్ దాస్ టాండన్ ను గెలిపించారు. కేంద్ర హోం మంత్రిగా, ఉప ప్రధానిగా 1947 నుండి 1950 డిసెంబర్ 15న మరణించే వరకు పదవిలో ఉన్నారు. పటేల్ సేవలకు గుర్తింపుగా 1991లో ‘భారతరత్న’ పురస్కారం ప్రకటించింది.
అఖండ భారతావని సమగ్రతకు సమైక్యతకు చిత్త శుద్ధితో కృషి సల్పిన సర్దార్ పటేల్ ఖ్యాతిని అంతర్జాతీయంగా చిరస్థాయిగా నిలపాలని నరేంద్రమోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భారీ పటేల్ విగ్రహం ఏర్పాటుకు సంకల్పించి శ్రీకారంచుట్టారు. విగ్రహాన్ని గుజరాత్లో నర్మదానది మధ్యలో సర్దార్ సరోవర్ డ్యాంకు మూడు కిలోమీటర్ల దూరంలో నిర్మించేందుకు నిర్ణయించి నరేంద్రమోడీ శంకుస్థాపన చేశారు. ఈ విగ్రహం నిర్మాణం అక్టోబర్ 2014లో ప్రారం భించి అక్టోబర్ 2018 లో అంటే 4 సంవత్సరాల కాలంలోనే పూర్తి చేశారు. ఐక్యతా ప్రతిమను సర్దార్ వల్లభభాయి పటేల్ 143వ జయంతి సందర్భంగా 2018 అక్టోబర్ 31వ తేదీన భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించి జాతికి అంకితం చేశారు. గుజరాత్లో 182 నియోజక వర్గాలున్న నేపథ్యంలో పటేల్ విగ్రహం ఎత్తు 182 మీటర్లు ఉండేట్లుగా నిర్మించారు. ఈ విగ్రహం ఎత్తు 597 అడుగుల ఎత్తుతో 19వేల చదరపు కిలోమీటర్ల వ్యాసార్ధంలో 3000 కోట్ల భారీ ఖర్చుతో పటేల్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దీని కోసం 75వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్, 5వేల 700 టన్నుల ఉక్కు, 18వేల 500 టన్నుల స్టీలు రాడ్లు, 22వేల 500 టన్నుల రాగి షీట్లు వినియోగించారు. 2500 మందికి పైగా కార్మికులు పనిచేశారు. అమెరికాలోని స్టాట్యూ ఆఫ్ లిబర్టీ విగ్రహానికి రెండిరతలు పెద్దదిjైున సర్ధార్ పటేల్ ఐక్యత స్మారక చిహ్నం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహం కావడం భారతీయులకు గర్వకారణం.
– రామ కిష్టయ్య సంగన భట్ల…
9440595494