నిబద్ధతకు ప్రతిరూపం రాఘవాచారి

నేడు సంపాదక ‘‘చక్రవర్తుల’’ వర్ధంతి

నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి,  విలువలు, నిబద్దతతో కూడిన జర్నలిజానికి మారుపేరుగా నిలిచిన పాత్రికేయులు, సంపాదకులు  చక్రవర్తుల రాఘవాచారి. నిరంతరం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎనలేని సేవలు చేశారు. రాఘవాచారి స్వస్థలం వరంగల్‌ ‌జిల్లా పాలకుర్తి మండలం శాతాపురం. 1939 సెప్టెంబరు 10న ఆయన జన్మించారు. నిబద్ధతత, విలువలతో కూడిన జర్నలిజానికి మారుపేరుగా నిలిచారు. తెలుగు పబ్లిక్‌ ‌రచయితల్లో నిరుప మానమైన మేధావి చక్రవర్తుల రాఘవాచారి, తెలుగు, ఇంగ్లీష్‌ ‌సంస్కృత భాషల్లో  పండితులు. పాత్రికేయుడు, సీనియర్‌ ‌జర్నలిస్ట్. 1972 ‌నుండి 2005 వరకు విశాలాంధ్రలో సంపాదకుడిగా పనిచేశారు. ఆయన మూర్తీభవించిన నిజాయితీ పరుడు. ఆయన వృత్తిలోనూ, వ్యక్తిగత జీవితంలోనూ ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. సాంప్రదాయక  బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. అయిదో ఏటి నుంచి ప్రబంధాలు, ప్రాచీన కావ్యాలు రామాయణ మహా భారతాలు చదివారు. ఆయనకు ఇంగ్లీష్‌, ‌తెలుగు, ఉర్దూ నేర్పడానికి ముగ్గురు ఉపాధ్యాయులను నియ మించారు. సంస్కృతం నేర్చు కోవడానికి ఆయనను ఆంధ్ర ప్రాంతంలోని పొన్నూరు పంపించారు. వరంగల్‌ ‌జిల్లా పాలకుర్తి మండలం శాతా పురం గ్రామంలో జన్మించిన రాఘవాచారి సికింద్రాబాద్‌ ‌సమీపంలోని లాలాగూడ రైల్వే పాఠశాలలో 11వ ఏట అయిదో తరగతిలో చేరారు. 1953 నుంచి విశాలాంధ్ర చదవడం ప్రారంభించారు. నిజాం కళాశాలలో పి.యు.సి.లో చేరి, ఉస్మానియా విశ్వవిద్యాలయం 6వ ర్యాంకు సాధించారు. ఉస్మానియా విశ్వ విద్యాలయం ఇంజనీరింగ్‌ ‌కాలేజీలో చేరారు.

కానీ ఇంజనీరింగు రెండో సంవత్సరంలోకి వచ్చేటప్పటికి ఆయనకు చదువు మీద ఆసక్తి తగ్గింది. వరంగల్‌ ‌వెళ్లి బీఎఎస్సీలో చేరారు. కమ్యూనిస్టు పార్టీ అనుబంధ విద్యార్థి సంఘంలో చేరారు. కళాశాల విద్యార్థి సంఘం ప్రధాన కార్యదర్శి పదవికి పోటీ చేసి అద్భుతమైన మెజారిటీతో గెలిచారు. పట్టభద్రుడైన తరువాత హైదరాబాద్‌ ‌వచ్చి న్యాయశాస్త్రం చడివారు. అఖిల భారత విద్యార్థి సమాఖ్య ప్రతినిధిగా లా  కళాశాల విద్యార్థి సంఘం అధ్యక్ష  స్థానానికి పోటీ చేశారు. అప్పుడు విశ్వ విద్యాలయంలో ఎం.ఎ. ఇంగ్లిష్‌ ‌చదువుతున్న ఎస్‌. ‌జైపాల్‌ ‌రెడ్డి వంటి వారు తీవ్రమైన వ్యతిరేక ప్రచారం చేసినా రాఘవాచారి అఖండ విజయం సాధించారు. న్యాయ శాస్త్రంలో పట్ట భద్రుడైన తరువాత ఎల్‌.ఎల్‌.ఎం. ‌చేశారు. 1969-71 మధ్య ఆయన ఢిల్లీ  నుంచి వెలువడే వామపక్ష అనుకూల ఇంగ్లీష్‌ ‌పత్రిక విలేకరిగా పని చేశారు.1971లో ఆయన విజయవాడ వెళ్లి విశాలాంధ్రలో చేరారు. కొద్ది కాలానికే ఆ పత్రికకు సంపాదకుల య్యారు. 28 ఏళ్ల సుదీర్ఘ కాలం విశాలాంధ్ర సంపాదకులుగా ఉన్నారు. ఆయన సంపాదకీయాలు సూటిగా, స్పష్టంగా ఉండేవి. స్పష్టత, సంక్షిప్తత ఆయన శైలి.

‘తెలుగు పత్రిక పరిణామం – ప్రయోగాలు – ప్రయోజనం’ అన్న వ్యాసంలో తెలుగు పత్రికా రంగంలో వాడే భాషా ప్రామాణీకరణ జరగలేదని విచారం వ్యక్తం చేశారు. విజయ వాడ, ఇతర ప్రాంతాల.లోనూ ఉపన్యాసకుడిగా ఆయనను ఆహ్వానించే వారు. ఆయన మాటల్లో అడుగడుగునా వ్యంగ్యం తొణికిస లాడేది. ఆయన గొప్పవాడిగా కనిపించే ప్రయత్నం ఎన్నడూ చేయలేదు. మేధావిగా ఆయనకు ఎంత గుర్తింపు ఉన్నా ఎనిమిది పదుల వయసు నిండి నాకా, ఆయనతో మాట్లాడిన వారు ఎవరైనా ఆయన జ్ఞాన విస్తృతి చూసి ముచ్చట పడేవారు. నిబద్దత కలిగి, విలువలకు జీవితాంతం కట్టుబడిన కమ్యూనిస్టుగా విజ్ఞానఖనిగా రాఘవాచారి పేరు గాంచారు. ఏఐఎస్‌ఎఫ్‌ ‌రాష్ట్ర అధ్యక్షుడిగా విద్యార్థి ఉద్యమానికి ఆయన అందించిన సేవలు ఎనలేనివి. 30 ఏళ్ల పాటు విశాలాంధ్ర సంపాదకులుగా బాధ్యతలు నిర్వర్తించిన రాఘవాచారి, సీపీఐ రాష్ట్ర కంట్రోల్‌ ‌కమిషన్‌ ‌చైర్మన్‌గా, సీపీఐ జాతీయ కంట్రోల్‌ ‌కమిషన్‌ ‌సభ్యులుగా సేవలందించారు.

1972లో విశాలాంధ్ర ఎడిటర్‌గా బాధ్యతలు స్వీకరించిన రాఘవాచారి 2005 వరకు కొనసాగారు. రాఘవాచారి, హైదరాబాదులోని ఒక హాస్పిటల్‌లో చికిత్సపొందుతూ 2019, అక్టోబరు 28వ తేది తెల్లవారు జామున మరణించారు. తెలుగు పత్రికా రంగానికి ఆయన చేసిన సేవను తెలుగు ప్రజలు ఎప్పుడూ గుర్తించుకునే, ఉదాత్తమైన
వ్యక్తిత్వం ఉన్న రాఘవాచారి నిస్సందేహంగా మేధావి.
– రామ కిష్టయ్య సంగనభట్ల…
9440595494

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page