ఎల్బీనగర్, ప్రజాతంత్ర, నవంబర్ 21: నీతిమాలిన రాజకీయాలు కాñదు.. నిబద్ధత కలిగిన రాజకీయాలే నా లక్ష్యమని ఎల్‌బీనగర్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి సామ రంగారెడ్డి పేర్కొన్నారు. వనస్థలిపురం డివిజన్‌లోని క్రిస్టియన్ కాలనీ, హస్తినాపురం ఈస్ట్, ఎఫ్‌సీఐ కాలనీ, వెంకటరమణ కాలనీ తదితర కాలనీల్లో స్థానిక కార్పొరేటర్ రాగుల వెంకటేశ్వర్‌రెడ్డితో కలసి రంగారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించిన బిజెపి పార్టీ అభ్యర్థినైన తనను గెలిపించాలని కోరారు. ప్రజాసేవ చేయాలనే దృఢ సంకల్పంతో రాజకీయాల్లోకి వచ్చిన తాను గత 16 సంత్సరాలుగా నియోజకవర్గ ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకున్నానన్నారు. ఎల్‌బీనగర్‌లో ఇక సుధీర్‌రెడ్డి రౌడీ పాలనకు చరమగీతం పాడి, సుపరిపాలన కొరకు బీజేపీకి ఓటు వేసి గెలిపించడానికి నియోజకవర్గ ప్రజలు సంసిద్ధులై ఉన్నారన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ మ్యానిఫెస్టోల కంటే బీజేపీ మ్యానిఫెస్టోనే బాగుందనే అభిప్రాయం ప్రజల్లో ఉందన్నారు. బీజేపీ మ్యానిఫెస్టోలో జీహెచ్ఎంసీ పరిధిలో వరదనీరు, డ్రైనేజి వ్యవస్థ ప్రక్షాళనకు ప్రాధాన్యతను ఇచ్చిన విషయాన్ని ఎల్‌బీనగర్ ప్రజలు గుర్తించాలన్నారు. బీజేపీని గెలిపిస్తే వరదనీరు, డ్రైనేజి సమస్య శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. నియంతలా వ్యవహరిస్తున్న అప్రజాస్వామికవాది అయిన సుధీర్‌రెడ్డికి ఓటుతో బుద్ధి చెప్పి, బీజేపీని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కొత్త రవీందర్‌గౌడ్, నూతి శ్రీనివాస్, కాటం క్రాంతిగౌడ్, అంజన్‌కుమార్‌గౌడ్, తడకమళ్ల విజయ్, రాథోడ్, విజయ కాలనీ అధ్యక్షులు భూపతిరెడ్డి, సతీష్‌గౌడ్, నవీన్, మోహన్‌రెడ్డి, హరీందర్‌రెడ్డి, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.