- దర్యాప్తు సంస్థల ముందు ఎవరైనా హాజరు కావాల్సిందే
- చట్టాలు చేసే మనమే బాధ్యతగా వ్యవహరించాలి
- ఖర్గే వ్యాఖ్యలపై రాజ్యసభలో ఛైర్మన్ వెంకయ్య వ్యాఖ్యలు
న్యూ దిల్లీ, అగస్ట్ 5 : పార్లమెంట్ సభ్యులకు కేంద్ర దర్యాప్తు సంస్థలు సమన్లు జారీ చేయవచ్చని, అరెస్ట్లు చేయవచ్చని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు. క్రిమినల్ కేసుల్లో వారు సైతం సామాన్య ప్రజలతో సమానమేనని, ఎంపీ పదవితో వారికి ఎలాంటి రక్షణ ఉండదని వెల్లడించారు. పార్లమెంటు సభ్యులు తమ పార్లమెంటరీ విధులను అడ్డంకులు లేకుండా నిర్వహించేందుకు వీలుగా కొన్ని ప్రత్యేకాధికారాలను అనుభవిస్తారు. కానీ, క్రిమినల్ కేసుల్లో ఎంపీలకు, సామాన్య ప్రజలకు ఎలాంటి బేధాలు ఉండవని ఉపరాష్ట్రపతి వెంకయ్య స్పష్టం చేశారు. పార్లమెంట్ సమావేశాల వేళ తనకు ఈడీ సమన్లు జారీ చేయటంపై కాంగ్రెస్ నేత మల్లికార్జున్ ఖర్గే ప్రశ్నించిన మరుసటి రోజే వెంకయ్య నాయుడు ఈ వ్యాఖ్యలు చేయటం ప్రాధాన్యం సంతరించుకుంది.
సివిల్ కేసుల్లో పార్లమెంట్ సభ్యులకు ఉన్న ప్రత్యేక అధికారాలను రాజ్యసభ ఛైర్మన్ వెల్లడించారు. పార్లమెంట్ సమావేశాల ప్రారంభానికి 40 రోజుల ముందు, తర్వాత సివిల్ కేసుల్లో అరెస్ట్ చేయలేరని పేర్కొన్నారు. అయితే, క్రిమినల్ కేసుల్లో ఎలాంటి రక్షణ ఉండదని స్పష్టం చేశారు. చట్టాన్ని, లీగల్ పక్రియను గౌరవించటం చట్టసభ్యుల బాధ్యత అని సూచించారు. పార్లమెంట్ సమావేశాలతో సంబంధం లేకుండా.. దర్యాప్తు సంస్థల విచారణకు హాజరు కావాలని రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు సూచించారు. గురువారం రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లిఖార్జునఖర్గే చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన రాజ్యసభలో మాట్లాడారు.పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు ఈడీ విచారణకు పిలవడం సరైనదేనా అంటూ.. ప్రతిపక్ష నాయకుడు మల్లిఖార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ సమావేశా లతో సంబంధం లేకుండా.. దర్యాప్తు సంస్థల విచారణకు హాజరుకావాలని సూచించారు. చట్టాలను చేసే పౌరులుగా.. అది మన బాధ్యత అని గుర్తుచేశారు. పార్లమెంట్? వర్షాకాల సమావేశాల్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. జులై 18న ప్రారంభమైన సమావేశాలు..
ఆగస్టు 12న ముగియనున్నాయి. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నా.. లేకపోయినా.. ఎంపీలు దర్యాప్తు సంస్థలు పిలిచే విచారణలకు హాజరుకావాల్సిందేనని అన్నారు. చట్టాలను చేసే పౌరులుగా.. ఆ చట్టాలను, న్యాయ పక్రియను గౌరవించడం మన బాధ్యతని వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. ఇటీవల రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గేకు ఈడీ సమన్లు జారీ చేయడం వల్ల గురువారం సభలో దుమారం చెలరేగింది. రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో ఈ విషయం ఖర్గే ప్రస్తావించారు. కాంగ్రెస్ను భాజపా భయపెట్టాలని చూస్తోందని.. అయితే దీనికి భయపడబోమని అన్నారు. ప్రతిపక్ష నాయకులను లక్ష్యంగా చేసుకోవడానికి కేంద్రం.. దర్యాప్తు సంస్థలను వాడుతోంది. ఈడీ చర్యలపై కేంద్రం సమాధానం చెప్పాలి. నాకు ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు ఈడీ నుంచి సమన్లు అందాయి. నేను చట్టానికి లోబడి ఉంటాను.. కానీ పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు ఈడీ విచారణకు పిలవడం సరైనదేనా అని రాజ్యసభలో ప్రతిపక్ష నేత ప్రస్తావించారు.