పెట్రోల్‌, ‌గ్యాస్‌ ‌సిలిండర్‌ ‌ధరల పెంపుపై…. క్షేత్ర స్థాయిలో ఉద్యమాలు…

  • ధాన్యం కొనుగోలుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పోరు
  • పీసీసీ వర్కింగ్‌ ‌కమిటీలో తీర్మానం
  • దిల్లీలో సీఎం కేసీఆర్‌ ఆమరణ దీక్ష చేస్తే రక్షణగా ఉంటాం టీ పీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి

ప్రజాతంత్ర , హైదరాబాద్‌ : ‌కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉమ్మడి పోరాటం చేయాలని రాష్ట్ర కాంగ్రెస్‌ ‌పార్టీ నిర్ణయించింది. పెట్రోల్‌, ‌డీజిల్‌, ‌గ్యాస్‌ ‌సిలిండర్‌ ‌ధరల పెంపుతో కేంద్ర ప్రభుత్వం పేదల ప్రజల నడ్డి విరిచిందనీ, ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలసి రైతులను మోసం చేస్తున్నాయని క్షేత్ర స్థాయిలో ప్రజలకు వివరించాలని నిర్ణయించింది. ఇందుకోసం ప్రత్యేక కమిటీలు వేయనున్నారు. ఈమేరకు శనివరాం పీసీసీ వర్కింగ్‌ ‌కమిటీ ఆర్గనైజింగ్‌ ఇన్‌చార్జి మహేశ్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ధాన్యం కొనుగోలు అంశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైకరిని నిరసిస్తూ రైతులకు న్యాయం జరిగేలా క్షేత్ర స్థాయిలో ఉద్యమించాలని నిర్ణయించారు.

పెట్రోల్‌, ‌డీజిల్‌, ‌గ్యాస్‌ ‌ధరల పెంపుతో నిత్యావసర వస్వువుల ధరలు భారీగా పెరిగి ప్రజల జీవన వ్యయం విపరీతంగా పెరుగుతుందనీ, దీంతో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుందని సమావేశంలో అభిప్రాయపడ్డారు. మరోవైపు, రాష్ట్రంలోని టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం విద్యుత్‌ ‌చార్జీల పెంపుతో సామాన్యులపై విపరీతమైన భారం మోపుతున్నదనీ, ఈ అంశాన్ని సైతం ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుని వెళ్లాలని పిసిసి వర్కింగ్‌ ‌కమిటీ సమావేశంలో నిర్ణయించారు. ఈ విషయంలో ప్రజలను కూడా భాగస్వాములను చేస్తూ క్రియాశీల ఉద్యమాలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రజలకు కాంగ్రెస్‌ ‌హయాంలో, ఇప్పుడు ఉన్న ధరలను తెలియజేసి చైతన్యపరచాలని ఈ సందర్భంగా సమావేశంలో నిర్ణయించారు.

దిల్లీలో సీఎం కేసీఆర్‌ ఆమరణ దీక్ష చేస్తే రక్షణగా ఉంటాం: రేవంత్‌ ‌రెడ్డి
రాష్ట్రంలో ధాన్యం సేకరణ అంశంపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై పోరాటం చేస్తానని అంటున్న సీఎం కేసీఆర్‌ ‌దిల్లీలో ఆమరణ దీక్ష చేస్తే కాంగ్రెస్‌ ‌కార్యకర్తలు రక్షణగా ఉంటారని టీ పీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన గాంధీభవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ధాన్యం కొనుగోళ్ల అంశంలో టీఆర్‌ఎస్‌, ‌బీజేపీ పార్టీలు లేని సమస్యను తెరమీదికి తీసుకొచ్చి రాజకీయం చేస్తున్నామని విమర్వించారు. రూ.10 వేల కోట్లు ఇస్తే ధాన్యం సేకరణ బాధ్యతను కాంగ్రెస్‌ ‌పార్టీ తీసుకుంటుందని స్పష్టం చేశారు. దిల్లీకి వెళ్లిన మంత్రుల బృందంలో కేటీఆర్‌, ‌హరీష్‌ ‌రావు ఎందుకు లేరని ప్రశ్నించారు. రాష్ట్రంలో పండించిన మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేసే బాద్యత రాష్ట్ర ప్రభుత్వంపైనే ఉంటుందనీ, ఈ విషయంలో కేంద్రాన్ని ఒప్పించే బాధ్యత కూడా సీఎం కేసీఆర్‌దేనని ఈ సందర్భంగా రేవంత్‌ ‌రెడ్డి స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page