పేపర్‌ ‌లీకేజిలో బిజెపి కుట్ర

స్వార్థ రాజకీయాలకు విద్యార్థుల జీవితాలతో ఆటలు
కుట్రదారులను ఎవ్వరినీ వొదిలేదిలేదు
విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

వికారాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 5 : ‌రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకే పేపర్‌ ‌లీకేజీలు చేస్తున్నారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు. తాండూరు, వరంగల్‌లో టెన్త్ ‌పరీక్ష పేపర్‌ ‌లీక్‌ ‌చేయడంలో బీజేపీ అనుబంధ సంఘంలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు పాత్ర ఉందని ఆరోపించారు.  బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌తో సంబంధాలున్న వ్యక్తులే పేపర్‌ ‌లీక్‌ ‌చేసి ప్రభుత్వాన్ని అభాసుపాలు చేస్తున్నారని సబితా ఇంద్రారెడ్డి విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ పెద్దల పర్యవేక్షణలోనే బండి సంజయ్‌ ‌కుట్రకు పాల్పడ్డారని ఆరోపించారు. బీజేపీ తన స్వార్థ రాజకీయాల కోసం ఐదు లక్షల మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారనని ధ్వజమెత్తారు. టీఎస్‌ ‌పీఎస్‌సీ పేపర్‌ ‌లీక్‌ ‌నిందితుడు రాజశేఖర్‌, ‌టెన్త్ ‌పేపర్‌ ‌లీకేజ్‌లో నిందితుడిగా ఉన్న ప్రశాంత్‌కు బీజేపీ నాయకులతో సంబంధాలున్నాయని ఆరోపించారు.

వికారాబాద్‌లో టెన్త్ ‌పేపర్‌ ‌లీక్‌ ‌చేసిన టీచర్‌ ‌కూడా బీజేపీ అనుబంధ సంఘం సభ్యులని విమర్శించారు. ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయాలనుకునే వారు ఎంతటి వారైనా వొదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్టపాటు చేయాలనే ఉద్దేశంతోనే పదో తరగతి ప్రశ్నపత్రాలు బయటకు తీసుకొచ్చి వైరల్‌ ‌చేస్తున్నారని పేర్కొన్నారు. వికారాబాద్‌ ‌జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్‌ ‌భవన్‌లో మంత్రి సబితా ఇంద్రారెడ్డి వి•డియాతో మాట్లాడారు. టీఎస్‌పీఎస్సీపేపర్ల లీకేజీ నుంచి పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజీ వరకు కుట్ర కోణం దాగి ఉందని మంత్రి తెలిపారు. కేంద్రంలోని బీజేపీ పెద్దల పర్యవేక్షణలోనే రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌పేపర్‌ ‌లీకేజీల కుట్రకు పాల్పడ్డారని మంత్రి పేర్కొన్నారు. వి• స్వార్థ రాజకీయాల కోసం ఐదు లక్షల మంది విద్యార్ధుల జీవితాలతో చెలగాటం అడుగుతారా..? అని సబితా ఇంద్రారెడ్డి మండిపడ్డారు. ఇందులో ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని మంత్రి సబితా ఇంద్రారెడ్డి హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page