పౌర సమాజం పాత్రం కీలకం

ప్రొ:హరగోపాల్
తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం  హైదరాబాద్  మదీనా ఎడ్యుకేషనల్ సెంటర్ లో    ఆచార్య జయశంకర్   12వ స్మారకోపన్యాస స్పూర్తి సదస్సు   లో  ప్రొ:హర గోపాల్ మాట్లాడుతూ ఇన్ని త్యాగాలు చేసిన తెలంగాణ లో ఫలితాలు ఆశాజనకంగా లేవు.కర్ణాటక తరహలో పౌర సమాజం పని చేయాల్సిన అవసరం ఉందన్నారు.తెలంగాణ వచ్చాక అంతా బాగుంటదని ఏమి అనుకోలే.అంతర్గత దోపిడీ సాగుతుది ఎదుర్కోవడానికి సిద్దంగా ఉండాలని అనాడే అనుకున్నం.ఇంతకంటే పెద్ద ఉధ్యమం అవసరం ఉంటదని జయశంకర్ గారి మాట్లాడిన మాటలను గుర్తు చేసారు.ప్రజా ఆకాంక్షలు పట్టించుకోకపోతే ఉద్యమాలే పాలకుల విధానాల మార్పు కు నాంది అన్నారు.తెలంగాణ విద్యావంతుల వేదిక రుపొందించిన ప్రత్యామ్నాయ విధానాలను ప్రభుత్వం పట్టించుకోలేదు అన్నారు. ఆచరణలో పెట్టే విధంగా పాలకులను వెంటాడాలన్నారు.పాలనలో ఒక మాఫియా అంతర్లీనంగా ఏలుతుందన్నారు.అధికార పార్టీ ల నేతలు తెలంగాణ వచ్చిన తర్వాత గుట్టలను కూడా వదలడం లేదు అన్నారు.వ్యవస్థ ను మొత్తం కలుషుతం చేసి చట్టబద్దమైన సంస్థలన్నింటిని అచేతనంలోకి నెట్టి వేసారన్నారు.పౌర హక్కుల సంఘం జోలికి సమైక్య పాలకులు కూడా రాలేదన్నారు. కేసీఆర్ మాత్రం నిషేధం విధించడం తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చిన బహుమానం అన్నారు.మొత్తం గా ప్రాధమిక హక్కులు సైతం కాల రాయబడ్డాయన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page